నిన్ననే ఎందుకో ఏమీ తోచక క్రిష్-3 సినిమా కి వెళ్ళాను.ఖాళీ అసలు దొరకడం లేదు.ముఖ్యంగా ఈ బ్లాగు ప్రపంచం లోకి వచ్చాక.రాత్రీ లేదు పగలు లేదు అలా చదువుకుంటూ ,రాసుకుంటూ పోవడమే ఏమిటో ఈ దురదానందం అనిపిస్తుంది అప్పుడప్పుడు..!
ఏమాటకామాట రాకేష్ రోషన్ బాగా తీశాడు సినిమాని.అసలు ఎక్కడా బోరు అనేది లేదు.కధ ని నమ్మాలా లేద అన్నంత సైన్స్ ఫిక్షన్ ని దట్టించి తీశాడు.ఏమైనా హృతిక్ రోషన్ ని ...మించిన అందగాడు ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది నాకైతే..!ఆ కండలవీ చూసి మాత్రమే కాదండోయ్ ...నటన కూడా చాలా బాగుంటుంది.ఈ సినిమాలో తండ్రీ కొడుకులు గా అతను చూపించిన పరిపక్వత అసలు మన తెలుగు యువ హీరోల్లో ఏ ఒక్కరైనా చేయగలరా..?
కాల్ పాత్రలో వివేక్ ఒబెరయ్ బాగా చేశాడు.అనేక వినాశకర ప్రయోగాలు చేస్తూ లోక కంటకునిగా తయారైన వ్యక్తిగా రాణించాడు. ఫోటోగ్రఫీ అద్భుతం అనాలి. ఏమీ లేదు..మన పురాణాల్లోని ముఖ్యంగా రామాయణాన్ని బేస్ చేసుకొని కధ ఉన్నది ..!చెబితే కధ ఇంతేనా అంటారు.కాని చూస్తే మాత్రం మీరు...మీ పిల్లలతో సహా బాగా ఎంజాయ్ చేస్తారు.అది మాత్రం రూఢి గా చెప్పగలను.Click here for more
No comments:
Post a Comment