Tuesday, November 12, 2013

నిన్నటి పాడుతా తీయగ పై నాలుగు ముక్కలు



శుభలేఖ రాసుకున్నా...అనే అందమైన పాటతో కార్యక్రమం మొదలైంది.ఆ పాటలో ఆర్కెస్ట్రా కంపోజిషన్ బాగుంటుంది.ఇళయరాజా ప్రత్యేకత నాకు అనిపించినమేరకు ఏమిటంటే ఒక వాయిద్యం వస్తుండగానే దాన్ని పూర్తి కానివ్వకుండా inter mixing గా ఇంకా దాంట్లోకి అనేక లేదా ఇంకో దాన్ని ఎంటర్ చేయిస్తుంటాడు.అయితే అది కాంట్రాస్టింగ్ గా ఉండదు.చాలా పకడ్బందీ గా ఉంటుంది.ఈ విధానాన్ని అంతకు ముందు ఎవరూ పెద్దగా చేసినట్టు నాకు తెలియదు.స్వతహాగా గిటారిస్ట్ కావడం మూలాన దానితో చక్కని ప్రయోగాలు చేస్తాడతను.ఏమైనా అతను భారతదేశం లో జన్మించిన ఒక వండర్ ఫుల్ జీనియస్...దాంట్లో మరోమాట లేదు. 

వేదం లా ఘోషించే..పాట బాగున్నది.మంచి సాహిత్యం..మంచి ట్యూను.స్వాతి ముత్యపు జల్లులలో...పాట బాగా పాడారు.అయితే ఇంకా స్కోప్ ఉంది.మళ్ళీ హంస లెఖ ది చాలా ప్రత్యేకమైన శైలి.కనులు కనులను దోచాయంటే..హుషారుగా సాగింది.పోయే పోహడ చూస్తుంటే ఇతనే విన్నర్ అయ్యేలా వున్నది.ఈ పాట సాహిత్యం బావుంటుంది.అనగూడదు గాని చాలా డబ్బింగ్ పాటల సాహిత్యం మన straight గా వచ్చే పాటల కంటే బావుంటాయి.మనాళ్ళు..ఎంతసేపు బూతు మాటలకి..వంకర ఎకసెక్కెపు పదాలకి ఇచ్చినంత ప్రాముఖ్యం  దేనికి ఇస్తారని..?

స్వరములు ఏడైనా.. గీతం ఒక ఆణిముత్యం ! బాగా పాడారనే చెప్పాలి.ఈ గాలి..ఈ నేల  పాట ఓ.కె.,సరే ఈ వారానికి సెలవు!Click here

No comments:

Post a Comment