Tuesday, October 8, 2013

నిన్నటి పాడుతా తీయగా పై నాలుగు ముక్కలు



ఈ మధుమాసంలో.. అనే మధురమైన పాటతో కార్యక్రమం మొదలైంది.ఆ పాటలో ఓ చోట అంటాదు వేటూరి" అందమైన మన ఇల్లు,అవని మీద హరివిల్లు...ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు..."ఎంత చక్కని భావన.భావగాంభీర్యం,భాషలోకి తెచ్చి నిలపడం మళ్ళీ  పదాల్లో ఒక  అందం మళ్ళీ ట్యూన్ కి సరిపోయేట్టు ఉండటం ...దేనికి దానికి ఫిట్ గా బిగించడం ..ఆ craftmanship వేటూరికే చెల్లు..!  

మరుగేలరా ..త్యాగయ్య కీర్తన ఈ రోజుకీ పాడుతున్నామంటే దానికి అంతకు మించిన కితాబు ఏముంది..? ఆ కారణజన్ముల గురించి ఎంత చెప్పినా తక్కువే..! నిను చూడక నేనుండలేను..బాగా పాడారు! ఆ వరసలు చాలా బాగుంటాయి.ప్రియతమా..తమా సంగీతం ఆ అమ్మాయి బాగానే పాడింది..కాని స్వరం తేలిపోయినట్టుగా వున్నది.ఏం చేస్తాం ఏ భాషకి బాగా అలవాటు అయితే దానికి సంబందించినట్లుగా మన కంఠం మారిపోతుంది.

ఆగదు ఆగదు...బాగా కృషి చేశారు.పాడెద నీ నామమే ...అలనాటి మధురమైన వీణ పాట.చక్కగా వుంది.దాశరధి గారి పదాలు చాలా లలితంగా,పొందికగా ..మధురంగా ఉంటాయి..అదేమిటో గాని ఆయన పాటల్లో నాకు తెలిసీ నూటికి నూరు శాతం చాలా హిట్ పాటలే..!
ఆమనీ పాడవే...well tried.కోరస్...వాయిద్య సహకారం excellent.Click here

No comments:

Post a Comment