Sunday, October 6, 2013

మంచు విష్ణు చెప్పింది నిజమే..!



ఈ రోజు సాక్షి డైలీ లో మంచు విష్ణు తో ఇంటర్వ్యూ వచ్చింది.దాంట్లో అతని ఒక అభిప్రాయం మటుకు నూటికి నూరుపాళ్ళు నిజమనిపించింది.చెన్నై కి హైదరాబాద్ కి గల భేదం గూర్చి చెబుతూ డబ్బుల్ని అవసరానికి మించి ఖర్చు పెట్టడం,పైపైని హంగులు కొరకు తహ తహ లాడటం తెలుగువాళ్ళలో ఎక్కువ అన్నాడు.అది ఒప్పుకోవడానికి మనస్కరించకపోవచ్చుగాని అది పూర్తిగా నిజం.డ్రస్ ని చూసో,లుక్స్ ని చూసో బాగా మర్యాద నిచ్చే గుణం తెలుగువారిలో కద్దు.చెన్నై వారిలో సూక్ష్మ దృష్టి చాలా ఎక్కువ.ఒక మనిషి సరుకేమిటో క్షణం లో పట్టేస్తారు.మన దగ్గర 5 కోట్లు ఉన్నవాడు 2 కోట్లు ఖరీదు చేసే కారు మెయింటైన్ చేస్తాడు.తమిళుల్లో మోపెడ్ నడిపే వాళ్ళలో కూడా కోటీశ్వరులుంటారు.ఇంకొకరు ఏదో అనుకోవాలని కాకుండా తనకి అవసరమైనంత మేరకే వాహనాల కోసం వాళ్ళు ఖర్చుపెడతారు.

డ్రస్ విషయం కూడా అంతే..! ఒకరి దుస్తుల్ని బట్టి అక్కడి వారి మేధస్సు ని అంచనా వేద్దామనుకుంటే పొరపాటుపడినట్టే..! చాలా ఇలాంటి పొదుపు చర్యల్లో వాళ్ళు బ్రిటీష్ వాళ్ళనే ఫాలో అవుతుంటారు.ఒక వైపు సాంప్రదాయం,మరో వైపు ఆధునిక విజ్ఞానం రెండిటిని సమపాళ్ళలో ఆదరించడం తమిళుల నైజం.Click here

No comments:

Post a Comment