Tuesday, October 1, 2013

నిన్నటి పాడుతా తీయగా పై నా రివ్యూ....!



పాడాలనే ఉన్నది...అనే ప్రారంభ గీతం బాలు పాడారు...!ఆత్రేయ వాడే తేలికైన మాటలు,దాని మాటున గంభీరమైన భావాన్ని పొదిగే పద్ధతి అది ఆయనకే సొంతం...చాలా మంది అలా రాయాలని చూస్తారుగాని చాలా బోలుగా అనిపిస్తుంది.అదే ఒరిజినాలిటి లోని వైభవం!మహదేవన్ వరసలు కూడా కరుణ భావాన్ని పొంగింపజేస్తాయి.వెరసి ఎప్పటికి వినగలిగే ఒక రస గుళిక..!

జాబిల్లి కోసం..పాట బహుశా అప్పుడు జయచంద్రన్ పాడారనుకుంటా..!  ఈయన కూడా ఓ.కే...మరీ ఖూని చేయలేదు. నీవు లేక వీణ...బాగా పాడిందా అమ్మాయి. ఒకప్పుడు వీణ పాటలు చాలా మంచివి వచ్చాయి.ఎవరో రావాలి...నీ హృదయం కదిలించాలి  ఇలాంటి రసార్ద్రగీతాలు  ఎన్నడూ మరువలేనవి.మళ్ళీ వాటిని సుశీల గారు పాడితేనే హాయిగా ఉంటుంది.

హంస లేఖ రాశా ..పాట బాగా పాడాడు ..!హంస లేఖ బాణీలు.. instrumental style ఒక ప్రత్యేకంగ తోస్తుంది.రాగాలపల్లకిలో...ఫరవాలేదు.మాటే మంత్రం...పాట మళ్ళీ ఒరిజినల్ అన్నంత స్థాయికి తీసుకెళ్ళారు.కోరస్ ఇంకా ఆర్కెస్ట్ర లోని వైవిద్యం ఈ గీతానికి ప్రాణం.ఏది ఏమైన ఇళయరాజా యొక్క గ్రేస్ ..అది వాయిద్యాలని ఉపయోగించడం లో గాని..వరసలు కట్టడం లో గాని ఎవరికీ రాదేమోనని నా నిశ్చితాభిప్రాయం. Click here       

No comments:

Post a Comment