Tuesday, December 3, 2013

నిన్నటి పాడుతా తీయగ పై నాలుగుముక్కలు

స్వప్న వేణువేదో....beautiful composition!రేపల్లే వేచెను..వేణువు వేచేను ..ఒకప్పుడు చాలా ప్రసిద్ది చెందినది.ఇప్పటికీ ఎప్పటికీ హాయిగా వినగలిగిన పాట.బాగా పాడిందామ్మాయి.ఇలాంటి వాటికి సుశీల గారి స్వరం బాగుంటుంది.అక్షరాలన్ని చక్కగా వినబడతాయి ఆమె పాడితే. కల ఇదని..ఆణిముత్యమే..బాగుంది !ప్రియతమా నా హృదయమా ....చాలా బాగా పాడాడు.ఆర్కెస్ట్రా కూడా చక్కగా అమరింది. వేణువై వచ్చాను...పాట ఎవర్ గ్రీన్....ఒక కావ్యమే వున్నది దానిలో..వేటూరి జిందాబాద్..గాయని జిందాబాద్..!

తలచినదే జరిగినదా ...పాడిన ఆదర్శ్ గొంతు పి.బి.శ్రీనివాస్ కి దగ్గరగా వున్నది.జన్మ మెత్తితిరా..  ఓ.కె!ఏ మాయె నా కవిత..ఆ అమ్మాయి చాలా బాగా పాడింది..చిత్ర ఒక అందం తో పాడితే ఈమె తనదైన శైలి లో బాగా పాడింది.ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను ఆమె fan అయినాను ఈ ఒక్క రెండిషన్ తో..!

నీ గూడు చెదిరింది...కి న్యాయం జరిగింది ....!Click Here


No comments:

Post a Comment