Saturday, December 14, 2013

"స్వామి వివేకానంద" చిత్రం పై నా రివ్యూ



అందరూ పిల్లలే నటించిన స్వామి వివేకానంద సినిమా కి ఇవాళే వెళ్ళాను.దర్శకులు ..నిర్మాతలు పిల్లల కోసమేగద తీసింది ఎక్స్ క్యూజ్ చేయలేరా అంటే ఏమీ అనలేం గాని..చాలా హిస్టారికల్ పాయింట్స్ ని గాని..వివేకానందుని జీవితాన్ని గాని అనుకున్నంతగా ఎలివేట్ చేయలేదు.నరేంద్రుడు సంగీతం ఆలపించినపుడు ఒకామె కి కాళ్ళు రావడం లాంటి విషయాలని వివేకానందుని జీవితచరిత్ర లో ఎక్కడా నేను చదవలేదు. ఇంకా ఇలాంటివి కొన్ని అల్లిన సన్నివేశాలు ఉన్నాయి.

నరేంద్రుడు ఖేత్రి మహారాజు అజీత్ సింగ్ దగ్గరకి వచ్చేటపుడు స్వాగతం లో నే వివేకానందస్వామి అని అనడం సమంజసం గా లేదు.మొదటి సారి విదేశాలకి వెళ్ళడానికి ఓడలో ప్రయాణించడానికి టికెట్ కొని ఇచ్చి ..ఒక జత కాషాయ వస్త్రాలు బహూకరించి ..ఆ తరువాత ఆయన పేరుని వివేకానంద అని మార్చినది అజిత్ సింగ్ మహారాజు అని గుర్తుంచుకోవాలి.ఆయన మీద గల ప్రేమాదరాల వల్ల అదే పేరుతో ఆయన కొనసాగారు.

సరే..పిల్లలు అంతా శక్తి వంచన లేకుండా నటించారు.హీరో పాత్రధారి ఇంకా కొన్ని జాగ్రత్తలు హావభావాలకి సంబందించి తీసుకుంటే బాగుండేది.సినిమా చివరి లో చూపించిన రామకృస్ణమిషన్ కార్యక్రమాలు,కన్యాకుమారి సన్నివేశాలు అవీ బాగున్నాయి.ఒకసారి చూడండి...నష్టం లేదు..!Click here

No comments:

Post a Comment