Tuesday, December 17, 2013

నిన్నటి పాడుతా తీయగ పై నాలుగుముక్కలు



రాసలీల వేళ ...అనే మధురగీతం తో కార్యక్రమం మొదలుపెట్టారు.అటువంటి ఒక slow pace లో కూడా రకరకాల వొంపులతో వయ్యారాలతో గీతాన్ని మధురం గా తీర్చి దిద్దటం ఇళయ రాజా యొక్క ప్రత్యేకత.ఆ వెనుక వచ్చే తబల ..గిటార్ రిధం పాట కి వ్యతిరేక దిశ లో సాగుతుంది.ఈ సారి అన్నీ చక్కని రసగుళికలే ఎంచుకుని పాడారు.మనసులోని కోరిక...మీనన్ చక్కగా పాడాడు.అహ నా పెళ్ళియంట...భావయుక్తం గా సాగింది.సాగేను జీవిత నౌక...పిల్లతెమ్మెర లా హాయిగా సాగిపోయింది. చందురుని మించు...పాట కూడా చక్కగా ఆలపించారు.అందరూ రాటు తేలుతూ హాయిగా పాడుతున్నారు.ప్రేయసీ మనోహరి...బాగున్నది..!ఇంకా మిగతా వారు కూడా న్యాయం చేస్తున్నారు.

చందన చర్చిత నీలకళేబర...అనే జయదేవ గోస్వామి యొక్క అష్టపది విన్నందుకు సంతోషమనిపించింది.నాకు ఊహ తెలిసినప్పటినుంచి వింటున్నా ...ఎప్పటికీ విసుగుగా అనిపించదే..!జయదేవుని అష్టపదులు..అర్ధం తెలియని వారికి కూడా అలా ఆగి వినాలనిపిస్తాయి.ఆ శబ్ద సౌకుమార్యం లో ఏదో రహస్య సంగీతం ధ్వనిస్తున్నట్లుగా అనిపిస్తుంది.మరందుకనే నేమో అటు బెంగాలీ వాళ్ళు,ఇటు ఒడియా వాళ్ళు జయదేవుడిని మావాడంటే మావాడని claim చేసుకొంటుంటారు.Click here

No comments:

Post a Comment