Tuesday, December 24, 2013

నిన్నటి పాడుతా తీయగ పై నాలుగు ముక్కలు



గీతాలాపన లో మొదటిగా మంచు కొండల్లోన చంద్రమా ..అనేది చోటుచేసుకొంది.ఈ సారంతా కొద్దిగా జానపద గీతాల్లాంటివి పాడారు.సోగ్గాడే చిన్ని నాయనా...అనే పాట ఆ కాలం లో బాగా వినిపించిన పాట ..వంశీప్రియ న్యాయం చేసింది.లచ్చుమమ్మ లడాయిలే ...ఓ.కె.!ఏరువాక సాగారో ..పాట బాగా పడింది బిందు...సాగారో  లో గా అనేది దీర్ఘంగా ఉండడం అనేది బహుశా పాట సౌలభ్యం కోసం మాత్రమే ననుకుంటాను.పంటచేలో పాలకంకి నవ్వింది...బాగా పండింది.భద్రాచలం కొండ...పాట విన్నప్పుడల్లానిపిస్తుంది..అసలిప్పుడు ఇక్కడ ఎక్కడున్నాయి అవి..ఎప్పుడో తరిగిపోయినాయి.

ఆగెదెట్టాగా ...ఒకప్పుడు ఎల్.ఆర్.ఈశ్వరి గొంతులో వాడవాడలా వినిపించిన పాట.ఆ గొంతు లోని సెక్సీనెస్ కి మంచానపడిన వారైన లేచి ఆడవలసినదే..!ఈ వారం అలా హాయిగా సాగిపోయింది.  Click here 

No comments:

Post a Comment