Thursday, December 26, 2013

దేవయాని ఖోబ్రాగడె విషయం లో అసలు విషయాలు ఏవో దాచి వ్యవహరిస్తున్నట్లుగా ఉన్నది

దేవయాని ఖోబ్రాగడె విషయం లో అసలు విషయాలు ఏవో దాచి వ్యవహరిస్తున్నట్లుగా ఉన్నది.అటు అమెరికా గాని..ఇటు ఇండియా గాని..!తప్పుడు సమాచారం పై వీసా పొంది సహాయకురాలిని తీసుకువెళ్ళడం,అక్కడి చట్టాలు నిర్దేశించిన దానికంటే తక్కువ వేతనాలు ఇవ్వడం అనేవి బయటకి వినబడుతున్న అభియోగాలు.ఇలాంటి అభియోగాలు గతం లో అమెరికా లో పనిచేసే రష్యన్ డిప్లొమాటిక్ అధికారులపై కూడా ఒక పాతిక సార్లు వచ్చినవి.అయితే వాటిని ఇంత రచ్చ చేసినట్లుగా లేదు.

మనదేశం నుంచి వెళ్ళే చాలామంది ఇక్కడినుంచి పనిమనుషులని తీసుకువెళ్ళడం పరిపాటి.దీని  వెనుక మళ్ళీ అనేక కారణాలు ఉంటాయి.అవి అందరిలీ తెలిసినవే.ఈ ఉదంతం రచ్చ కావడం తో పనిమనుషుల్ని వెంటబెట్టుకెళ్ళే చాలామందికి ఒక ఘాటు ఉదాహరణని చవి చూపినట్టుగా వుంది.బహుశా దీని వెనుక ఉద్దేశ్యాలు కూడా అలాంటివేనేమో..!Click here

No comments:

Post a Comment