Wednesday, April 2, 2014

ఎండలు మండుతున్నాయంటే దానికి కారణాలు ఇవే..!



మీరు బాగా గమనించారో లేదో మనకి మట్టి రోడ్లు ఉన్నప్పటికంటే తారు రోడ్లు,సిమెంటు రోడ్లు వచ్చినతరవాతనే ఎండలు బాగా ముదిరాయి.అంతే కాదు ఒకప్పుడు ఎండలో తిరిగినా అలిసిపోయేవాళ్ళం కాదు.కాని ఇప్పుడు ఓ రెండు నిమిషాలు బయటి వెళ్ళినా అలిసిలేవలేని స్థితి.మనం మన రవాణా సౌకార్యానికి చక్కని రోడ్లు వేసుకున్నాం...కాని వాటికి ఇరువేపులా మంచి నీడనిచ్చే చెట్లని పెంచలేక్పోతున్నాము.దానివల్ల సూర్యుని నుంచి వచ్చే సూర్యరశ్మి అంతా ఈ సిమెంట్,తారు రోడ్ల పై పడి విపరీతంగా కాగి వాటిని మరిత కనిపించని ఎండ లా మన మీద ప్రతాపం చూపుతొంది.అంటే reflection అన్నమాట.సాయంత్రం ఎండ తగ్గిన తరవాత కూడా రోడ్ల మీద నుంచి ఆవిర్లు వస్తున్నాయి. సరుగుడు చెట్ల లాంటివి కాకుండా మంచి పచ్చదనం ఉండే చెట్లని రోడ్లకిరువేపులా పెంచాలి.ఈ మధ్య విచక్షణా రహితంగా చెట్లని కొట్టిపారేస్తున్నారు.చిన్న పట్టణాలు,గ్రామాలు కూడ దీనికి మినహాయింపు కాదు.ప్రతి పౌరుడు/రాలు తక్షణ అవసరంగా భావించి దీన్ని ప్రచారం చేసి చెట్లని రోడ్లకిరువేపులా పెంచాలి.Click here

No comments:

Post a Comment