Saturday, February 8, 2014

రాం గోపాల్ వర్మ పుస్తకం "నా యిష్టం" గురించి (రెండవ మరియు చివరి భాగం)



మొత్తం 119 పేజీల్లో రాము స్వగతం ఉన్నది.మిగతాది అంతా అతని గూర్చి ఇతరులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇంకా ఫోటోలు ఉన్నాయి.ఆసక్తికరంగానే ఉన్నదని చెప్పాలి.ఏదిఏమైనా కాలేజీ జీవితంలో తారసపడే వ్యక్తుల ప్రభావం ప్రతివారి జీవితంలో చాలావుంటుంది.అదే విధంగా సత్యేంద్ర... రాము జీవితం లో అనిపిస్తుంది. యూరపు లో నివసిస్తున్న అతను రాము పై రాసిన అభిప్రాయం చాలా విలువైనది.ప్రపంచంలో the land of ultimate paradoxes అనేది ఏదైనా ఉంటే అది భారతదేశమే నంటాడు అతను.  దానికి ఇచ్చిన చెప్పే కారణాలు కూడా సహేతుకమే.ప్రపంచంలో చాలా అందమైన ముఖకవళికలు ఉన్నవారు కూడా భారతీయులే అంటాడతను. తను ఈ దేశం వాణ్ణి కనక అలా చెప్పడం లేదు.అనేకదేశాలవాళ్ళని  దగ్గరగా చూసినతరవాత కలిగిన అనుభూతి అది అంటాడు. రమారమి ఓ శతబ్దం క్రితం విచిత్రంగా స్వామి వివేకానంద కూడ తన ప్రపంచ పర్యటన తరవాత అదే మాట అంటాడు.

 రాము గొప్ప చదువరి.అదీ సమకాలీన ఇంగ్లీష్ ఫిక్షన్ విషయంలో..చెప్పనవసరం లేదు.అదేమీ లేకుండా కొంతమంది అతన్ని అన్నివిషయాల్లో అనుకరించాలని చూస్తుంటారు. అక్కడే వాళ్ళు ఫూల్స్ గా కనబడుతుంటారు.ధారవి గురించి అతను చెప్పే విధానం ఎందుకో touchy గా అనిపించింది. నేను ముంబాయి లో ఉన్నప్పుడు అనుకున్నవిధానంలోనే అతడూ వర్ణించడం ఆహ్లాదంగా తోచింది.

తెలుగు సీమ నుంచి హిందీ పరిశ్రమ కి వెళ్ళి తనదైన ప్రత్యేకశైలి తో యావద్భారతాన్ని ఆకర్షించిన దర్శకుడు రాం మాత్రమేనని చెప్పక తప్పదు. కాని తెలుగువాళ్ళకి ఉన్న రోగమేమిటంటే ఒక తెలుగువాడు బ్రతికివుండగా అతని గొప్పదనాన్ని అంగీకరించరు. Click Here   

No comments:

Post a Comment