Tuesday, February 4, 2014

రాంగోపాల్ వర్మ పుస్తకం 'నా ఇష్టం' ఒకసారి ఆ మధ్యన ఎప్పుడో చదివాను

రాంగోపాల్ వర్మ పుస్తకం 'నా ఇష్టం' ఒకసారి ఆ మధ్యన ఎప్పుడో చదివాను.మళ్ళీ ఈ మధ్య ఇంట్లో పుస్తకాలు సర్దుతుంటే కనబడితే అలా తిరగేశాను.ఒకలాంటి తెంపరితనం,స్వేచ్చాశీలత ..కొత్తగా ఆలోచించడం ఇవన్నీ అతనిలో గోచరించాయి.తనకి ఎవరూ స్నేహితులు లేరని చెబుతాడు.కాని సత్యేంద్ర అనే తన క్లాస్మేట్ అతనిపై చూపిన ప్రభావాన్ని నిర్మొహమాటంగా ,నిజాయితీగా అంగీకరించడం ..ఆ విధంగా చాలాతక్కువమంది చేయగలరు.నెపోలియన్ ఒక చోట అంటాడు 'రూసో ' లేకపోతే నేను లేను అని.ఆ విధంగా ఇంకొకరి ప్రభావశీలతని అంగీకరించడం అంత సులువు కాదు.

ఇంగ్లీష్ రచయితల్లోని వాస్తవికత రాం యొక్క సినిమాల అల్లికలో బాగా కనబడుతుంది.అది ఒక్కోసారి మనకి dry గానూ మరోసారి intelligent గాను అనిపిస్తుంది.మొత్తం మీద అది కొత్తగా అనిపించేలా ఉంటుంది.అతను Mario Puzo ని బాగా చదివి జీర్ణించుకున్నాడు.దానివల్ల crime లో నున్న మానవీయకోణాన్ని నచ్చేలా చెబుతాడు.అలాగే Osho ని కూడా బాగా చదివాడు.వీరిద్దరిని సమగ్రంగా చదివితే మనిషి ప్రవర్తించే విధానం పూర్తిగా మారిపోతుంది.అంతలా వారు ప్రభావితం చేస్తారు.

అయితే Osho చాలా నాకు తెలిసినంతలో చాలా ప్రమాదకారి.అతడి రీజన్,లాజిక్, ఇలాంటివే కాదు చరిత్రని ,మానవస్వభావాన్ని విశ్లేసించే తీరు కట్టిపడవేస్తుంది.మన భారతీయ గుప్త శాస్త్రాల మీద..ధ్యాన పద్ధతులపైన ఎంత అధారిటీ ఉన్నదో పాశ్చ్యాత్య తత్వ శాస్త్రాల పై గూడా అంతకి మించిన అవగాహన ఉన్నది.నాకు తెలిసీ ఒకటి చెప్పగలను...ఓషో ని తీవృంగా చదివిన వాళ్ళెవరూ వివాహబంధంలో ఉండలేరు. అతడు మన కోసం కాదు గాని విదేశీయ జ్ఞానార్తులకు బోధించడానికి పుట్టాడని నాకు అనిపిస్తుంది.మరి అలాంటి ఓషొ ప్రభావాన్ని రాం ఎలా దాటిపోగలడు. 

అతనికి అంటే వర్మ కి ఏదైతే లేదని చెబుతుంటాడో అవన్నీ అతనిలో పుష్కలం గా ఉన్నాయి.సెంటిమెంట్స్ కూడా బలంగా నే ఉన్నాయి.అయితే వాటిని వేరే కోణం లో వివరిస్తాడు.(మిగతాది తరవాత)  Click Here  

No comments:

Post a Comment