Tuesday, January 21, 2014

నిన్నటి పాడుతా తీయగ పై నాలుగు ముక్కలు



ఎదుట నీవే...ఎదలోన నీవే అనే అభినందన లోని పాట తో కార్యక్రమం మొదలైంది.దానికి ఆత్రేయ అద్దిన సాహితీ సొగసులు ఎప్పటికీ అలానిలిచిపోతాయి.అతిసామాన్యమైన మాటలతో హృదయపు లోతులను కదిలించడం ఆయనకే చెల్లింది.ఆత్మీయులు సినిమాలోని మదిలో వీణలు మోగే...పాట చాలానాళ్ళకి విని ఆనందమనిపించింది. ఉదయబిందు మంచిగా ఆలపించింది.ఆ పాటలోని ప్రారంభపు హమ్మింగ్ ..వింటుంటే ఏదో ఆనందలోకాల్లో విహరించినట్లు భావచిత్రాలు కదలాడతాయి.తన్మయత్వం అంటారే ..మ్మ్ ఇంకా నాకు కుదరడంలేదు చెప్పేదానికి..!

దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి....ఎవర్ గ్రీన్ సాంగ్.వేదాంతపు అంచుల్లోకి తీసుకెళ్ళే పాట.అర్జున్ న్యాయం చేశాడు.మాను మాకును గాను...సింప్లీ సూపర్భ్.మధుమాసవేళలో ...మరో ఆణిముత్యం ! జోరుమీదున్నావు తుమ్మెద...ఎప్పటికీ అలరించేపాట.అంతా బాగా పాడారు. ఆ పాటల్ని ఇప్పటికీ విని ఆనందించగలుగుతున్నాము.. గత సంవత్సరం వచ్చిన తెలుగుసినిమాల్లో సాహిత్యపరంగా ,సంగీత పరంగా కాస్తా పాడుకోవడానికి హాయిగా ఉన్న పాటలు ఏమైనా ఉన్నాయా అంటే నాకైతే ఏమీ తట్టడం లేదు.గత కొన్ని ఏళ్ళ నుంచి ఇదే నా స్థితి...బహుశా  జనరేషన్ గేప్ వల్ల నాకలా అనిపిస్తున్నదా...మరి అలాంటప్పుడు ఆ పాత మధురాలు ఇప్పటి వారినీ అలరిస్తూనేఉన్నాయిగదా..!!!Click here

1 comment:


  1. లలితకళలకి కొత్త,పాత అని లేదు.వాటికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి.వాటి ప్రకారం బాగుందా,లేదా అన్నదే ప్రశ్న.ఉదాహరణకి,రెనజాన్స్ చిత్రాలని,(renaissance paintings)ని,పాత శిల్పాలని ఇప్పటికీ చూసి ఆనందిస్తున్నాము కదా.1950- 1990 మధ్యలో మంచి సినిమా సంగీతం వచ్చింది.తర్వాత,కారణాలేమైనా దాని వాసి(quality) బాగా తగ్గిపోయింది.

    ReplyDelete