Tuesday, January 14, 2014

నిన్నటి పాడుతా తీయగ పై నాలుగు ముక్కలు



అసలివాళ ఈ పోస్ట్ రాయకూడదనుకున్నాను.ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్నటి ఎపిసోడ్ ని పూర్తిగా చూడలేకపోయాను.సుందరము..సుమధురము...అనే పాట సాగుతున్నపుడు ఇంట్లోకి వచ్చాను.ఆ రకంగా కొంత రిలీఫ్ పొందాను.గూగుల్ లో వెదికి పట్టుకోవచ్చునేమో గాని ..ఏమైనా ఎప్పటిది అప్పుడు వింటేనే హాయి.సరే అమావాస్య చంద్రుడు లోని ఆ పాట విషయానికొస్తే ...ఆ గాయకుడు అద్భుతం గా ఆలపించాడు..ఆర్ఖెస్ట్రా కూడా చాలా బాగుంది. ఆ పాట కి వెనుక వచ్చే  కోరస్..రిధం... అప్పటికీ ఇప్పటికీ వెరైటీ గా నే ఉంటుంది.

మనీషా పాడిన పాట బాగుంది.అయితే ఆ పాట బయట పెద్దగా నేను వినలేదు.కనుక ఓ నూతన గీతం విన్నట్లుగా అనిపించింది.ఎలా ఎలా తెలుపను...పాట బాగా ఉన్నది.ఈ బ్లాగు వీక్షకులు అందరికీ...నా సంక్రాంతి శుభాకాంక్షలు.Click Here   

No comments:

Post a Comment