Tuesday, January 7, 2014

నిన్నటి పాడుతా తీయగ పై నాలుగు ముక్కలు



రెహమాన్ స్వరపరచిన పాటలు పాడారు ఈసారి.రెహమాన్ కొన్ని కొత్త ప్రయోగాలకి నాంది పలికిన మాట వాస్తవం.అయితే కొన్ని పాత పాటల బాణీలు తెలివిగా తనకి అనుగుణంగా ఉపయోగించుకుంటాడు.ఏదైనా వినడడానికి హాయి గా ఉండేలా చేస్తాడు పాటని.వాలుకనులదానా ...అనే పాట మీనన్ చక్కగా పాడాడు.పెదవే పలికే ...పాట కూడా అనంత్ బాగా పాడాడు.కొంచెం నీరు...పాట ఇంగ్లీష్ పాట ల బాణీ లో హాయిగా సాగింది.అపరంజి మదనుడే...బాణీ మధురంగా ఉంటుంది.వాయిద్యాల సహాయం లేనప్పుడు కూడా కొన్ని అలా ఉంటాయి.అదే శబ్ద మహిమ.

శశివదనే...very soothing song.దానిలో సంగతులు గాని..మధ్యలో ...ఫ్లూట్ గాని ఎక్స్ లెంట్ కాంబినేషన్. చిన్ని చిన్ని ఆశ...రెగ్గే స్టైల్ లో ఆహ్లాదంగా ఉన్నది.నిష్క్రమించిన అనంత్ కి అభినందనలు. అథితి చంద్రబోస్ చెప్పిన ఒకదానితో మాత్రం నేను ఏకీభవించలేను.ఈ మధ్య కాలం లో వస్తున్న straight పాటల కంటే కొన్ని dubbing సినిమాలలోని పాటల సాహిత్యమే వెరైటీ గా ఉంటోంది.బాణీలు కూడాను.తమిళం లోనుంచి అనువాదం అయినప్పటికి కొన్ని సాంగ్స్ భావ పరంగ హృదయాన్ని ఊపివేసేలా ఉంటాయి. నిజం గా మూలం లో ఎలా ఉంటాయో అనిపిస్తుంది. అరణాచలం,ముత్తు,చంద్రముఖి,నరసిమ్హా ఇట్లా కొన్ని డజన్ల సినిమాల పేర్లు నేను చెప్పగలను.Click here

P.S: My heart felt Condolences.....Rest in Peace Uday Kiran.

No comments:

Post a Comment