Sunday, May 4, 2014

మహాత్ముల చెప్పిన వాటిని తమ సొంత విషయాలుగా ప్రచారం చేసుకోవడం సమంజసం కాదు.

మహాత్ముల చెప్పిన వాటిని తమ సొంత విషయాలుగా ప్రచారం చేసుకోవడం సమంజసం కాదు.

కొంతమంది ఆధ్యాత్మిక గురువులు వారి జీవిత కాలం లో కాలానుగుణంగా,సందర్భానుగుణంగా చెప్పిన  కొన్ని విషయాలను తమ సొంత భావాలా అన్నంత రీతిలో కొంతమంది ఉదహరించడం, వివరించడం  చేస్తుంటారు.మంచిది... దానివల్ల ఆ మాటల్లోని గుబాళింపు ఇంకా ఎక్కువమందికి తెలుస్తుంది.అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే కనీసం మాటమాత్రంగానైనా ఆ source ని ఎవరిదగ్గరనుంచి తీసుకున్నారో తెలుపకపోవడం.

ఏం...ఎందుకు చెప్పాలి..?పేటెంట్ హక్కులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించవచ్చు.లేకపోవచ్చు...కాని ఆ అసలు వ్యక్తి పేరుని వెల్లడించినంతమాత్రాన తనకి వచ్చే గౌరవం ఏమీ తరిగిపోదు.పైగా పెరుగుతుంది కూడా..అతని నిజాయితీకి...!

అలా కాకుండా వేరే ఓ చోట దాని true source గూర్చి తెలుసుకున్నప్పుడు వారి మీద జాలికలుగుతుంది.అది ఒక్కటనేకాదు...మహాత్ముల యొక్క మాటలు వారిని ఉదహరిస్తూ చెప్పడం వల్ల వారి ఆశీర్వాదం కూడా ఒనగూరుతుంది.బాగా గమనించినట్లయితే అది ఎవరికి వారికి తెలుస్తుంది.

ఇది ఎందుకు చెబుతున్నానంటే...  Gospel of Sri Ramakrishna లో శ్రిరామకృష్ణ పరమహంస ఆయన జీవితం లో జరిగిన ఒక ఉదంతం గురించి నరేంద్రునికి ఒక ఉదాహరణగా చెబుతారు.మక్కీకి మక్కి అదే విషయాన్ని ఆ మధ్య ఒక ప్రసంగం లో ఒకాయన తను కనిపెట్టిన విషయం లా చెప్పుకున్నారు.కనీసం reference కూడా ఇవ్వలేదు. మహాయోగీశ్వరుల యొక్క ప్రతిమాట వెనుక వారి శక్తి నిబిడీకృతమై ఉంటుంది.అందుకే అవి నిత్యనూతనంగా హృదయాలని వెలిగిస్తుంటాయి.అది గమనించాలి.

శ్రీ రామకృష్ణులు నరేంద్రుని కొన్ని రోజులు చూడకపోయేసరికి దాని గురించి అడుగుతూ " నరేన్ ...నామాటల్ని అర్ధం చేసుకోగలింది నువ్వు ఒక్కడివే...నిన్ను చూడకపోతే నా హృదయం నీటితో తడిసిన వస్త్రాన్ని పిండితే ఎలా అవుతుందో అలా అవుతుంది" అంటూ ఒక ఒక వస్త్రాన్ని పిండి చూపిస్తారు. ఎంత కవితాత్మ ఉన్నది ఈ చిన్ని మాటలో అనిపిస్తుంది నాకైతే...!  Click here

No comments:

Post a Comment