Friday, December 5, 2014

ఈ పాట మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.




సిరిమల్లె సొగసు ..జాబిల్లి వెలుగు అనే ఈ పాట నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఒకటి.పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా లోనిది.ముఖ్యంగా ఇంటర్ల్యూడ్స్ లో వచ్చే గీటార్,వేణువు,డోలక్ బిట్లు బాగుంటాయి.సత్యం సంగీత దర్శకత్వం లో వచ్చిన మృదు మధుర గీతాల్లో ఇది ఒకటి.దాశరధి సాహిత్యం లో కూడా సున్నితమైన భావాలు సన్నజాజుల్లా రాలుతాయి.బహుశా ఇది మీకు కూడా నచ్చవచ్చునేమో..!దీనిలో మోహన్ రాజు గారి స్వరం కూడా చాలా లలితంగా ఉంటుంది.సుశీల గారి గురించి ఇక చెప్పేదేముంది..!Click here 

No comments:

Post a Comment