Saturday, December 6, 2014

ఈ మధ్యన వచ్చిన ఓ న్యూస్ చదివిన తర్వాత ఇది రాయాలనిపించింది.

ఈ మధ్యన వచ్చిన ఓ న్యూస్ చదివిన తర్వాత ఇది రాయాలనిపించింది.నేతాజీ బోస్ యొక్క చివరి రోజుల గురించి తెలిపితే కొన్ని దేశాలతో మన దేశ సంబంధాలు దెబ్బతింటాయని.కనుకనే తెలపడం వీలు కాదని ..!ఏమిటీ ఇంకా ఈ మిస్టరీ..మరిచిపోయి మానిపోతున్నవాటిని కెలకడం తప్ప.బోస్ గారు ఎప్పుడూ ప్రాతహ్ స్మరణీయులే..అప్పుడప్పుడొచ్చే ఈ వార్తల లోగుట్టు ఏమిటో పైనున్నవాడికే తెలియాలి.

పూర్తిగా చెప్పరు..అలాని ఊరుకోరు.ఊరికే చరిత్ర చదవడం కాదు..కొన్ని కొన్ని సంఘటనలను అన్వయించుకొని ఆలోచిస్తే యూరోపియన్ల తెలివితేటలు,ముందుచూపు కొన్ని వందల ఏళ్ళు ముందుంటాయి.ఆ విషయంలో మనం పాపాయిలమే.ఆ గేప్ ఇప్పుడు ఎంత పెరిగిందో నేనైతే ఊహించలేను.మనకి ప్రస్తుతం ఉన్న వనరు ఏమిటి.ఆ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి..అన్ని వాళ్ళు ఇచ్చే సాధనాలనుంచే ..వార్తా ఏజన్సీలు గాని,ఇంటర్నెట్ గాని ..ఏ దేశం గురించి అయినా తెలుసుకోవాలన్నా వాళ్ళిచ్చిన సమాచారం నుంచే...అదే ప్రామాణికం..అంతకు మించి ఆ దేశాల కి వెళ్ళి ఎక్కువ విషయాలకోసం ప్రయత్నిస్తే ఏ ఏక్సిడెంట్ ఎందుకు అవుతుందో ఎవరూ ఊహించలేరు.మనం కలలో కూడా ఊహించనంత నిఘా ఉంటుంది..దేశపౌరులు సైతం దానికి సహకరిస్తారు. లోకసబంధమైన ఎంజాయ్మెంట్ ని ఎంతైనా చేయండి...త్రాగండి ..తినండి..ఇంకా ఏదైనా ఎన్నిరకాలుగానైనా చేసుకొండి..దానిని రాజ్యం సహిస్తుంది.కాని దేశ ద్రోహాన్ని మాత్రం సహించదు.ఈ రోజుకి వారి బలం అదే ఏ రంగం లోనైనా ..నా దృష్టిలో అమెరికా ..యూరపు లోని దేశాలకి మనవడు లాంటి వాడు.కుర్రవాడు ఏది వచ్చినా గెంతులేస్తుంటాడు.కాని అనుభవజ్ఞుడైన తాత మాత్రం ఒక మూలకి కూర్చుని ప్రపంచాన్ని   రెగ్యులేట్ చేస్తుంటాడు.చిద్విలాసంగా.. !!Click here

No comments:

Post a Comment