Wednesday, April 29, 2015

ఆ భావాన్ని,మన ఘంటసాల గార్ని ఎంతగానో మెచ్చుకున్నారు ఒక నెదర్లాండ్స్ కి చెందిన బ్లాగరు .

ఓసారి ఎందుకనో ఏమీ తోచక నాకు బాగా ఇష్టమైన కొన్ని పాటలు వింటున్నాను.జీవన తరంగాలు సినిమా లోని టైటిల్ సాంగ్  వింటూ వింటూ..ఎందుకో ఈ భావాన్ని ఇంగ్లీషు.. లోకి అనువదిస్తే బాగుండును అని వెంటనే అనిపించి కొన్ని నిమిషాల్లో ఆ పని చేసి నా బ్లాగు లో పెట్టాను.యూ ట్యూబ్ లోని పాటతో సహా.తెలుగు సినీ గీతాల్ని అనువాదం చేయడం ఇదే మొదటి సారి.అలతి అలతి మాటలతో హృదయాన్ని కదిలించే అనల్ప గీతాల్ని రాయడం లో ఆత్రేయ గారి తీరే వేరు.ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే ఈ రోజు ఆ పాటని విని ..ఆ భావాన్ని,మన ఘంటసాల గార్ని  ఎంతగానో మెచ్చుకున్నారు ఒక నెదర్లాండ్స్ కి చెందిన బ్లాగరు .ఈమె Readers Wil అనే పేరుతో బ్లాగింగ్ చేస్తుంటారు.హిమాచల్ ప్రదేశ్ కి చెందిన Uppal గారు కూడా నచ్చారు ఈ పాటని.ఆ కామెంట్లని,ఇంకా నా అనువాదాన్ని పక్క లింక్ నొక్కి చూడండి.http://riversideman333.blogspot.in/2015/04/you-bear-ten-months-your-children-and.html#comment-form

No comments:

Post a Comment