Thursday, April 23, 2015

తెల్ల వాళ్ళకి మన కి విరాళాలు ఇవ్వడం తప్ప వేరే పని ఏమి లేదా ..!

నేను డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఆ తొలి రోజుల్లో ఆసక్తి కొద్దీ  కలం స్నేహం కి సంబందించిన ఒక బులెటిన్ (ద ఇండియన్ మెయిల్)  నడిపేవాణ్ణి.అవి యూరపు లోని దేశాల్లో కొన్ని వాటికి ఇంకా అమెరికా కి ఇంకొన్ని కాపీలు వెళ్ళేవి.నిజం చెప్పాలంటే ఫిన్ లేండ్ కి చెందిన రైమొ కార్న అనే ఒక మిత్రుడు ఇంకా కెనడా  లోని షారోన్ స్మిత్ అనే ఆవిడ ద్వారా ఇవి మెయిల్ చేయబడేవి.అట్లా వీళ్ళు నాకు బాగా  సహకరించిన వారిలో కొందరు.వివిధ దేశాల్లోని ప్రజలు ,వారి అభిరుచులు ఇంకా వారి విశేషాలు చాలా దగ్గరగా తెలుసుకునే అవకాశం కలిగింది. దాదాపు గా ప్రతి ఖండం నుంచి కొన్ని డజన్ల మంది మిత్రులు ఏర్పడ్డారు.ఆ రోజుల్లో వారికి ఉత్తరాలు రాయడం,ఫోటోలు ఇచ్చిపుచ్చుకోవడం ఒక ఆసక్తిదాయక విష్యంగా ఉండేది.మన దేశానికి ,ఇతర దేశీయులకి గల వ్యత్యాసాలు పోలికలు గమనించే అవకాశం కలిగింది.అనేక మంది యూరోపియన్ లు భారతదేశ ప్రయాణం లో భాగంగా నా వద్దకి వచ్చేవారు.ఇది 1990 ల్లో మాట.అట్లాంటి వాళ్ళ లో మార్కస్ జెల్లర్ అని చెప్పి ఒకాయన. ప్రయాణం లోని మధురిమని నాలో అంకురింప జేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు.చాలా మంది అడిగేవారు,విదేశీయులు మీ వద్దకి బాగా వస్తుంటారు గదా.ఏమైనా ఫండింగ్ అదీ వస్తుందా అని.నవ్వాలో ఏడవాలో అర్ధమయ్యేది గాదు.తెల్ల వాళ్ళకి మన కి విరాళాలు ఇవ్వడం తప్ప వేరే పని ఏమి లేదా ..అసలు వారి దగ్గర్నుంచి పుచ్చుకోవాలి అనుకోవడమే పెద్ద తప్పు..మనం ఎలాంటి పని చేయకుండా అప్పనంగా పొందాలనుకోవడం లో నే అన్ని సమస్యలు వస్తాయి.అంతకు మించి ఆత్మాభిమానం అనేది చాలా విలువైనది.అని వివరించే వాణ్ణి..అది ఎందుకనో చాలామందికి రుచించేది గాదు.అయితే అంతకి మించిన జ్ఞానం ..ఆ మిత్రులనుంచి నేను పొందినది.ముఖే ముఖే సరస్వతి అన్నట్లుగా ఎన్నో విషయాల్ని ఒకరినుంచి ఒకరం పొందాము.వారిని బాధించేవి ,అలరించేవి ,ఇప్పుడు చాలామంది సోషల్ వెబ్సైట్  ల లో అనుకునేవి ఎన్నో చర్చించేవారము.మన సంస్కృతి గొప్పది అనుకోవడం లో తప్పు లేదు.కాని మనదొక్కటే గొప్పది అనుకోవడం పొరబాటు అనేది మాత్రం నాకు కాలగమనం లో  అర్ధం అయింది.Click here

No comments:

Post a Comment