ఒక్కో సారి చాలా మంచిగా తీస్తారు ఫలానా వాళ్ళు ..అని చెప్పి హీరో హీరోయిన్ లు ఎవరు అని కూడా చూడకుండా సినిమా కి పరుగు తీస్తాం.తీరా చూస్తే ఏమీ ఉండదు.ఒక మొఖ మాటానికి తీసారో ఇంకెందుకో మనకి అర్ధం అయి చావదు.అంత దరిద్రంగా ఉంటుంది.ఏ కోణం లోనుంచి చూసినా..!మళ్ళీ తమిళ్ ఇంగ్లీష్ స్టైల్స్ కలిసినట్లుగా అర్ధమయి కాని డైలాగులు..పట్టి విడిచినట్లుగా..తెలుగు రానట్లుగా ..! లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఇప్పుడు మరీ అంత కొత్త ఏమీ గాదు ఇండియాలో...దాన్ని అర్ధం చేసుకుని ఇంకా చక్కగా తీయవచ్చును..దీనికంటే..!
చాలా కృత్రిమంగా ఉంది కధనమంతా...!ప్రకాష్ రాజ్, లీలా శాంసన్ ల మధ్య డైలాగులు గాని ఇంకోటి గాని పరమ డ్రమటిక్ ఉంది.ఎంతైనా తెలుగు వాళ్ళం గదా..!పరాయి వాడు ఏది తీసినా మనకి యమహా అనిపిస్తుంది.అందులో మణి రత్నం అయితే..?లేనిది కూడా ఎక్కడనుంచో ఆరా తీసి మరీ మెచ్చుకుంటాం...! సినిమా హాలు నుంచి వచ్చేప్పుడు మాత్రం ఒకే ఒక మాట అనాలనిపించింది....ఎవరేమనుకున్నా..Hell with the flick..!Click here
No comments:
Post a Comment