మొన్నటికి మొన్న అమిత్ షా అంటే అపర చాణుక్యుడని అతను అనేకానేక ప్రణాళికలు అపూర్వంగా రచిస్తూ అమలు చేస్తూ మోడీ ప్రభంజనాన్ని ముందుకు తీసుకు పోతుంటాడని పొగిడిన వాళ్ళే బీహార్ రిజల్ట్స్ రాగానే అదే నోళ్ళ తో రకరకాలుగా తిట్టిపోస్తున్నారు.చాలా పొరబాట్లు చేశాడని,ఓబిసి లకి సీట్లు కేటాయించడం లో అన్యాయం చేశారని అంటున్నారు.ఇదే సదరు వ్యక్తులు ఒకవేళ బిజెపి గెలిచినట్లయితే ఎక్కడలేని ఉపమానాలు పొగిడి పారేసేవారు.ప్రజాస్వామ్యం అన్నాక ఈ ఎన్నికల గేం లో ఒకసారి పైకి లేవడం,మరోసారి కిందపడటం ఖాయం.అది సహజం.దాన్ని ఓ ఏదో గోరంతలు కొండంతలు చేస్తూ ఎక్కడ లేని ఊహాగానాలు చేస్తూ జనాల మెదళ్ళు చెడగొట్టడం పత్రికలకి ఇంకా సోషల్ వెబ్సైట్ లలో ఒక ఆచారంగా తయారయింది.
ఇప్పుడు చూడండి..ఇదే మోడీ బృందం రేపు ఏదో మరో స్టేట్ లో గెలవనివ్వండి.ఇక చెప్పలేము ఆ ఊహాగాన పైత్యాలు. ఏంటో ఈ పెజాస్వ్యామ్యం..ఎవరొచ్చినా ఉభయ పార్టీల్లో ఉండే పెద్ద తలకాయలకి ఏమి కాకుండానే రోజులు వెళ్ళిపోతుంటాయి.ముఖ్యంగా స్విస్ బ్యాంకుల్లోంచి వేల కోట్ల బ్లాక్ మనీ ని వెనక్కి తేవడం లో అందరివి గాలి కబుర్లే.ఎందుకంటే ఆ పెద్ద మనుషుల జాబితా లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు.Click here
No comments:
Post a Comment