మానవాతీత శక్తులు అంటే అక్కడ కాసేపు దృష్టి నిలిచిపోతుంది.ఎవరికైనా..!చదవకుండా ఎలా ఉండగలం..!అందులోను ఇహలోక జీవితాన్ని ,పారమార్ధిక జీవితాన్ని చాలా లోతుగా తొంగి చూసిన వివేకానందుని విషయం లో అయితే ఇంకానూ.ఇందాకనే Talks with Swami Vivekananda పుస్తకం లో కొన్ని పేజీలు చదివిన తరువాత ఇది రాయాలనిపించింది.అది 1898 వ సంవత్సరం ,బలరాం బాబు ఇంట్లో కొంతమంది తో సంభాషిస్తున్నప్పుడు ఒక వ్యక్తి అడుగుతారు.అతీత శక్తులు అంటూ ఉంటారు గదా అలాంటివి మీ అనుభవం లో కి ఏవైనా వచ్చాయా అని.ఎదుటి మనిషి మనసు ని అద్దం లా చూడవచ్చు..కొద్ది సాధన తో..కాని అవి ఏమీ ఆత్మ సాక్షాత్కారానికి దోహదం చేయవు..పైగా నీ మార్గాన్ని మళ్ళించడానికి అవి ప్రయత్నిస్తాయి.అందుకనే రామకృష్ణులు వాటిని లక్ష్య పెట్టవద్దు అని మాతో చెపుతుండేవారు అని వివేకానద స్వామి బదులిచ్చారు..!
దెయ్యాలు,అలాంటివి ఉన్నాయంటార..అని అడిగినప్పుడు,మనకి తెలియని ప్రపంచాలు మన చుట్టూ చాలా ఉన్నాయి.అయితే ఎంతసేపు వాటిని గురుంచే ఆలోచించుతూ ఉండకు.కొంత కాలానికి నువ్వు అలానే మారిపోతావు. అంటూ...నేను ఒకసారి హిమాలయాల వద్ద పర్యటిస్తున్నప్పుడు ఒక రాత్రి ఒక గ్రామం లో బస చేశాను.బాగా రాత్రి అయిన తర్వాత శబ్దాలు కోలాహలంగా వినబడుతుండగా నేను బస చేసిన ఇంటి లోని ఆయన్ని అడిగాను.అతను నన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు.అక్కడ చాలామంది గుమి కూడి ఒక మనిషిని చూస్తున్నారు. ఆ మనిషి పై ఏదో ఆవహించినట్లుగా ఊగుతున్నాడు.ఇంతలో ఎర్రగా కాల్చిన ఒక గొడ్డలిని కొంతమంది వ్యక్తులు తీసుకు రాగా ఈ ఆవాహించిన వ్యక్తి తన వొంటికి,తల వెంట్రుకలకి దాన్ని తాకించుకున్నాడు. విచిత్రంగా ఆ మనిషి వొంటికి గాని ,వెంట్రుకలకి గాని ఆ వేడి ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది.కాసేపయిన పిమ్మట దాన్ని నేను తాకి చూశాను.నా చేతికి బొబ్బ వచ్చినంత పనయింది.ఇంతలో ఒకతను నా దగ్గరకి వచ్చి మహరాజ్ ఇతణ్ణి తాకి చూసి చెప్పండి అన్నాడు.నేను అతని తల పై చేయి ఉంచి ఉచ్చరించిన కాసేపటికి మామూలు మనిషిగా అయిపోయాడు.
నేను అమెరికా వెళ్ళే ముందు ,మదరాసు సమీపం లో ఉన్న సమయం లో ఓ రాత్రి ఒక పీడకల వచ్చింది ,మా అమ్మ గారు చనిపోయినట్లుగా ఆ కలలో వచ్చింది.ఈ విషయం తెలిసి మన అలసింగ పెరుమాళ్ ఇంకా మిగతా మిత్రులు నన్ను ఒక వ్యక్తి దగ్గరకి వెళదాం రమ్మని పదే పదే కోరిన పిమ్మట వెళ్ళాను.అతను ఒక స్మశాన సమీపం లో ఉన్నాడు..నాకు వచ్చిన కల గురుంచి మన మిత్రులు తెలిపి అమ్మ క్షేమంగా ఉన్నారా లేదా అని అతణ్ణి అడిగారు.ఆయన కాసేపు పెన్సిల్ తో ఏవో రాసిన పిమ్మట..మా తండ్రి,తాత గార్ల పేర్లు వారి జీవిత శైలి,చాలా లోతుగా వెళ్ళి చెప్పాడు.మా అమ్మ గారు బాగానే ఉన్నారని తెలిపాడు.కొన్ని రోజులాగిన తర్వాత చూస్తే అతను చెప్పినవన్నీ అక్షర సత్యాలు అని తేలినవి అని స్వామి తెలిపారు.
ఒక మారు గంగా నదీ తీరం లో నడుస్తున్నప్పుడు చనిపోయిన మా బంధువు ఒకామె కనిపించి చాలా విషయాలు చెప్పడం మొదలెట్టింది.దానిలో కొన్ని నిజాలున్నాయి,కొన్ని అబద్ధాలు ఉన్నాయి..!ఆమె అత్మకి తర్పణం వదిలి న పిమ్మట కనిపించడం మానివేసింది.అని ఇలా చెబుతూ ..ఏమిటి..ఇవాళ అన్నీ పనికిమాలిన వ్యవహారాలు అన్నీ వస్తున్నాయి.ఇలాంటి వాటిని ఆలోచించడం మానేయండి..మీ మెదడు లో ఇలాంటి వాటికి చోటు ఇవ్వ వద్దు..అంటూ ముగించారు.Click here

No comments:
Post a Comment