Sunday, November 29, 2015

కొంత మంది కి ఆ భాష పట్టుబడక కూడా ద్వేషిస్తూంటారు.

కేశరాజు పల్లె లో ఈ రోజు జరిగే స్కై బాబా పుస్తక విడుదల 

కేశరాజు పల్లె లో ఈ రోజు జరిగే స్కై బాబా పుస్తక విడుదల పండుగ కి ఈ రోజు వెళదామని ముందు అనుకున్నాను.కాని తలవని తలంపు గా ఒకరి కి బ్లడ్ డొనేషన్ చేయవలసి వచ్చింది.ఆయనతో నాకు ముఖ పరిచయం లేదు గాని ఫేస్ బుక్  లో ఆహ్వానం చూసి వెళదామనుకున్నాను.ముఖే ముఖే సరస్వతి గదా..!ఆయన కధలు రెండు మాత్రం చదివాను.బాగా అనిపించినవి.ఇప్పుడు వెజిటేరియన్ ఓన్లి  అని ఆంగ్ల తర్జుమా పుస్తకం వేయడం బహు బాగా అనిపించింది.అసలు ఇంగ్లీష్ లోకి మన కధలు ఇతర ప్రక్రియలు ఇంకా వెళ్ళవలసిన అవసరం ఎంతో ఉంది.తెలుగు వారిలో కొంత మందికి ఉన్న అపోహ ఏమిటంటే ఇంగ్లీష్ అనగానే అదేదో మాతృ భాష ని కబళించేది అని.కొంత మంది కి ఆ భాష పట్టుబడక కూడా ద్వేషిస్తూంటారు.

ఇప్పటికి మన భావ జాలం ..అది ఏ ప్రక్రియ గాని దేశ వ్యాప్తంగా ..విశ్వ వ్యాప్తంగా తెలియాలంటే ఇంగ్లీష్ మాత్రమే సాధనం.మన తెలుగు లలో  చాలా మంది ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ నుంచి చూసినా ఏదో అకడమిక్ రచనలు ..ఆ శైలి యే తప్ప ...పాఠకుల గుండె తట్టే విధంగా రాయడం చిన్నతనం అనుకుంటారు.మరి ఈ రకం గా ఎందుకని తెలుగు లో ఉంది అంటే ..ఒకరకమైన హిపోక్రసీ ఏ..! అంతకంటే ఏమి లేదు. మీరు పావ్లో కొయిలో ఆంగ్ల అనువాదల్ని చదవండి..ఎంత సూటి గా ఎంత..ఎంత సరళ భాష లో ఉంటాయో.ఆయన పోర్చు గీస్ లో మాత్రమే రాస్తాడు.మిగతాదంతా అనువాదకులే.కాని మన ఇంగ్లీష్ అనువాదకులో ..మూల రచన కంటే పరమ కృతకంగా అనవసరమైన ఆడంబర పదాలతో గారడీ చేసి అసలు దాన్ని చెడగొడతారు.ఒక ఉదాహరణ చెబుతాను...నేను మనోజ్ దాస్ ఆంగ్లం లో రాసిన  Farewell to a Ghost, The General అనే కధల్ని ఇటీవల చదివాను.అదే రచయిత తన మాతృ భాష అయిన ఒరియా లో కొన్ని కధలు రాశాడు.రెండిటికి బేరీజు వేస్తే చదువరికి అర్ధం అవడమే  ధ్యేంగా ఉంది. మరి ఎందుకని ఇంగ్లీష్ అనువాదం కి వచ్చేసరికి జటిలంగా చేయాలని భావిస్తారు.అదే అర్ధం కానిది.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ..ముంబాయి నుంచి అటు ఈశాన్య రాష్ట్రాల దాకా  తెలుగుల భావ జగతి తెలియాలంటే ఆంగ్లమే సరైన సాధ్యం...అంతకు మించి ఎల్లలు దాటాలన్నా దాని వల్లనే సాధ్యం.ప్రతి రాష్ట్రానికి అయిదు లేదా పది కాపీలే అమ్ముడు పోనివ్వండి కాని దాని విలువ వేరు.దాని విస్తరణ వేరు. ఏముంది చేతన్ భగత్ నవల్స్ చదవండి... అంత కన్నా లక్ష రెట్లు మిన్నగా రాసేవారు మన లోనూ ఉన్నారు. కాని మనం ఒక హిప్నాటైజ్ కాబడిన స్థితి లో ఉన్నాము.అదే సమస్య.ఎంత సేపు మన చూపు మన పరిధి లోనే.ఆంగ్ల విస్తరణకి..దానికి ఉన్న మార్గాలు అన్వేషించడం లో కూడా ఒక అలసత్వమే.కొంతమంది ప్రముఖ రచయితల్ని పబ్లిషర్స్ ని కలిసినపుడు కూడా ఎందుకనో ఓ విముఖత నిర్లిప్తత అగుపించింది.ఇకనైనా పొరలు చించుకొని బయట కి వద్దాము. Click here

1 comment:

  1. Exact ga chepparandi.... i too agree with your point of view

    ReplyDelete