Friday, December 18, 2015

బతుకు పుస్తకం....ఈ పుస్తకం ఎప్పటినుంచో చదువుదామని అనుకుంటున్నా

బతుకు పుస్తకం....ఈ పుస్తకం ఎప్పటినుంచో చదువుదామని అనుకుంటున్నా..అయితే ఇటీవలనే కుదిరింది.1983 లో మొదటి ప్రింట్ వేశారు.రెండవ ముద్రణ ఈ ఏడు ఏప్రిల్ లో వేశారు.వుప్పల లక్ష్మణ రావు గారి ఆత్మ కధ గానే భావించినా ..1898 లో జన్మించి మొన్న ఆయన చనిపోయేదాక నెమరు వేసుకున్న సంగతులు ఎన్నో మరుగున పడిన విషయాల్ని గుర్తు చేస్తాయి.బరం పురం ఇప్పుడు ఒడిసా లో ఉన్నా ఒకప్పుడు మద్రాస్ ప్రావిన్స్ లో భాగంగా నే ఉండేది.ఆయన చిన్నప్పుడు తాత గారు  వారి ఇంటికి రకరకాల ఆంగ్ల పత్రికల్ని తెప్పించి వాటిని ఇంట్లో పిల్లల చేత చదివించడం..రాని అర్ధాల్ని నోట్ బుక్ లో రాయించి పిమ్మట వివరించడం..అలాగే కొంత భూమిని ఇచ్చి వారి చేతనే ఆ భూమి లో కూరగాయలు పండించడం ..వాటిని వండించడం గమ్మత్తుగా ఉండి అప్పట్లోనే ఆయన ముందు చూపుని తెలియజేస్తుంది.పెళ్ళిళ్ళు పేరంటాల్లో పట్టింపులు అలనాటి ఉదంతాల ద్వారా తెలియజేశారు.

బోటనీ లో డాక్టరేట్ చేసి ..అనేక మైన వృత్తులు వాటి తో సంబందం లేనివి చేసి చివరకి మాస్కో లో తెలుగు అనువాదకుని గా   కుదురుకుని ఎన్నో రష్యన్ రచనలని తెలుగు లోకి హృద్యమైన శైలి లో అందించారు. తొలి ఉపాధ్యాయుడు,జమీల్యా  ఇలాంటివి ఆ కోవ లోనివే.బరం పురం లోని వాతావరణం ని కళ్ళకి కట్టినట్లు చూపించారు.లండన్ లో ఆయన చదువుకునే రోజుల్లో జరిగిన విషయాలు ..వివిధ వ్యక్తులతో పరిచయాలు కొత్త లోకాన్ని ఆవిష్కరిస్తాయి.ఇప్పటి తో పోల్చుకుంటే 1950 ల్లోపు ..ఉద్యోగం దొరకడం సులువుగా ఉండేదనే చెప్పాలి.మెట్రిక్ చదివినా..ఎఫ్.ఏ. ..చదివినా ..ఇంకా పైకి చదివినా మరీ కింది క్లాస్ చదివినా ఏదోచోట ఎదో ప్రభుత్వ కొలువు సులభంగానే   లభించేదని చెబుతారు.

స్విస్ మహిళ మెల్లీ షోలింగర్ తో పరిచయం కావడం...ప్రేమ కి దారి తీయడం..కొన్ని పరిశీలనలు పరిశోధనలు తరువాత వారు రష్యా లో పెళ్ళి చేసుకోవడం ..ఆ తర్వాత కొన్నాళ్ళకి రోడ్డు ప్రమాదం లో ఆమె మరణించడం ఒక సీరియల్ గా సాగిపోతుంది.ఆమె మన దేశం లో స్వాతంత్ర్య ఉద్యమం లో ని కొన్ని ఘట్టాల్లో పాల్గొండం..సబర్మతి కి వెళ్ళి అక్కడ ఉండటం...ఇంకా ఇలాంటివి ..చదువుతూ పోతూన్నప్పుడు అసలు ఈ విదేశీయులకి ఏమిటబ్బా ఈ సానుభూతి అనిపించక మానదు.

రష్యా లో అనువాదకుని గా రిటైర్ అయినతర్వాత 1970 లో బరం పురం లో నే తాను మరణించేదాకా ఉండిపోయారు.ఒరిస్సా వారు బ్రహ్మ పూర్ గా బెర్హం పూర్ గా పిలుచుకునే ఆ పట్టణాన్ని తెలుగులు బరం పురం గా పిలుచుకుంటాము.రెండు సంస్కృతులు పడుగు పేక లా కలిసి పోయిఉంటాయి.జ్ఞానసీమ గా  దీన్ని పిలువ వచ్చును.ఒరిస్సా బార్త అనే న్యూస్ పోర్టల్ ఇక్కడ నుంచి మనోజ్ దాస్  అనే ఆయన నడుపుతుంటాడు.ఒక సారి వారి కార్యాలయానికి వెళ్ళడం తటస్థించింది.మీరు బరం పురం దాటిన తర్వాతనే అసలైన ఒరిస్సా కనిపించడం మొదలవుతుంది.అన్ని రకాలుగా.Click here

No comments:

Post a Comment