Paths of Glory నవల గురించి కొన్ని విషయాలు..
కొందరు ఉంటారు..వారికి కొన్ని గొప్ప కలలు ఉంటాయి..వాటిని ఎంతో కష్టించి పరి పూర్తి చేస్తారు..దురదృస్టం వెన్నాడుతున్నదా అన్నట్లు ..వారికి రావాలసిన గుర్తింపు మాత్రం రాదు.ప్రపంచం ఎప్పుడో వారిని ఎన్నో ఏళ్ళు గడిచిన తర్వాత గుర్తించవచ్చు.ఈలోగా వారు ఈ ప్రపంచం నుంచే నిష్కృమించవచ్చు. అదిగో అలాంటి ఒక నిజమైన వ్యక్తి యొక్క జీవితం ని ఆధారం గా చేసుకొని రాసిన నవలయే ఈ Paths of Glory అనేది, రచయిత మరెవరో కాదు ప్రముఖ బ్రిటిష్ నవలాకారుడు Jeffry Archer .దీనిలోని హీరో George Mallory.1924 లో ఎవరెస్ట్ శిఖరాన్ని ప్రపంచం లో మొట్ట మొదటి సారి గా అధిరోహించిన పర్వతారోహకుడు.అయితే దాని ఆనవాలు 1999 వరకు బయటకి తెలియరాలేదు.దానికి కారణం ఆయన శవం ఎవరెస్ట్ కి దిగువన 600 మీటర్ల కిందన దొరికింది.శిఖరం అధిరొహించిన పిమ్మట ఆక్సిజన్ అందక కిందకి దొర్లి పడి చనిపోయి ఉండవచ్చునని కొన్ని ఆధారాలు లభించాయి.
1953 లో ఎవరెస్ట్ ని ఎక్కిన సర్ ఎడ్మండ్ హిల్లరి ,ఇంకా టెంజింగ్ నార్గే లు ఆ తర్వాత వారే నని ఈ నవలలో చెప్పడానికి ప్రయత్నించారు.1999 లో ఒక పరిశోధక బృందం ఆ శిఖరానికి చేరుకొని Geoge Mallory శవాన్ని ఆ మంచులో కనిపెడతారు.పర్వతం నుంచి జారిపడినప్పుడు అతని శరీరం లోని కాళ్ళు చేతులు దారుణంగా విరిగినట్లుగా అగపడతాయి.శవం కి ఉన్న ఆ దుస్తులు పేలికలై ఉంటాయి.రోలెక్స్ వాచ్ చేతికి ఉన్నది.నడుముకి ఉన్న రోప్ తెగిపోయి ఉంది.27000 అడుగుల ఆ ఎత్తులో ,ఆ మంచులో దిక్కుమాలిన ప్రేతం లా ఉన్న ఆ శవం ఒకప్పుడు కేంబ్రిడ్జ్ లో ఆంగ్ల సాహిత్యం అభ్యసించిన మనిషి అంటే ఎవరూ నమ్మరేమో.
ఈ దిగిన పరిశోధక బృందం లో కూడా ఈ ఖ్యాతి లేటు గా ఎక్కిన ఆ ఎడ్మండ్ హిల్లరి కే దక్కాలని దురాలోచన చేసే వ్యక్తులు కూడా ఉంటారు.నర్మ గర్భంగా కొన్ని డైలాగులు నడుస్తాయి.శవం జేబు లో వెతుకుతారు..దానిలో ఒక కర్చీఫ్ దొరుకుతుంది ..దానిమీద Ruth అనే పేరు ఎంబ్రాయిడరి ఉంటుంది.ఆమె George యొక్క భార్య.ఆ పేరు ని అలా ఎంబ్రాయిడరి చేసి అతనికి ఇస్తుంది..!అయితే ఆమె ఫోటొ మాత్రం ఆ దుస్తుల్లో కనబడదు.అంటే ఈ లెక్కన ఎవరెస్ట్ ని అతను ఎక్కినట్లు వాళ్ళు భావిస్తారు.ఎందుకంటే ఆమె ఫోటో ని ఆ శిఖరం మీద తన గుర్తుగా ఉంచుతానని చెబుతాడు.ఇవన్నీ అతని డైరీ ని చదివి తెలుసుకుంటారు.
George Mallory కధని . .ఈ చావు కి ముందు అతని జీవితం ఎలా గడిచింది ..అతని బాల్యం,చదువు,ప్రేమ,ఉద్యోగం ఇంకా సకల వ్యవహారాలు ముఖ్యంగా పర్వతారోహణ పై అతని కి గల మక్కువ..యూరపు లోని వివిధ పర్వతాల్ని ఎక్కడం ..దాని లోని పట్లు అన్నీ హృద్యంగా రచయిత వర్ణిస్తాడు.లండన్ వాసి అయిన హీరో చదువుకునే సమయం లో డబ్బులు ఆదా చేసుకునే తీరు ..ప్రేయసి రూథ్ టర్నర్ కోసం వెనిస్ వెళ్ళి కొన్ని సాహసాలు చేయడం ఆహ్లాదం గా ఉంటుంది.George కేంబ్రిడ్జ్ లో చదువుకునే రోజులు అక్కడి సిస్టం ని వివరిస్తాయి.
1953 లో ఎవరెస్ట్ ని ఎక్కిన ఎడ్మండ్ హిల్లరి ఆ శిఖరం పైకి ఎక్కి 15 నిమిషాలు ఉంటాడు నార్గే తో కలిసి.కాని ఎందుకనో గాని ఫోటో అక్కడ ఉండి తీయించుకోడానికి ఇష్టపడలేదని అందుకనే ఆ చిన్న మంచు ని నరికే గొడ్డలిని తాను ఒక్కడ్నే ఫోటో దిగానని టెంజింగ్ నార్గే చెప్పారు ఒక ఇంటర్వ్యూ లో.బహుశా అతని అంతరంగం లో ఆ క్రెడిట్ పొందిన మొదటి శ్వేత జాతీయుడు George Mallory అని తెలుసునేమో..!
కొందరు ఉంటారు..వారికి కొన్ని గొప్ప కలలు ఉంటాయి..వాటిని ఎంతో కష్టించి పరి పూర్తి చేస్తారు..దురదృస్టం వెన్నాడుతున్నదా అన్నట్లు ..వారికి రావాలసిన గుర్తింపు మాత్రం రాదు.ప్రపంచం ఎప్పుడో వారిని ఎన్నో ఏళ్ళు గడిచిన తర్వాత గుర్తించవచ్చు.ఈలోగా వారు ఈ ప్రపంచం నుంచే నిష్కృమించవచ్చు. అదిగో అలాంటి ఒక నిజమైన వ్యక్తి యొక్క జీవితం ని ఆధారం గా చేసుకొని రాసిన నవలయే ఈ Paths of Glory అనేది, రచయిత మరెవరో కాదు ప్రముఖ బ్రిటిష్ నవలాకారుడు Jeffry Archer .దీనిలోని హీరో George Mallory.1924 లో ఎవరెస్ట్ శిఖరాన్ని ప్రపంచం లో మొట్ట మొదటి సారి గా అధిరోహించిన పర్వతారోహకుడు.అయితే దాని ఆనవాలు 1999 వరకు బయటకి తెలియరాలేదు.దానికి కారణం ఆయన శవం ఎవరెస్ట్ కి దిగువన 600 మీటర్ల కిందన దొరికింది.శిఖరం అధిరొహించిన పిమ్మట ఆక్సిజన్ అందక కిందకి దొర్లి పడి చనిపోయి ఉండవచ్చునని కొన్ని ఆధారాలు లభించాయి.
1953 లో ఎవరెస్ట్ ని ఎక్కిన సర్ ఎడ్మండ్ హిల్లరి ,ఇంకా టెంజింగ్ నార్గే లు ఆ తర్వాత వారే నని ఈ నవలలో చెప్పడానికి ప్రయత్నించారు.1999 లో ఒక పరిశోధక బృందం ఆ శిఖరానికి చేరుకొని Geoge Mallory శవాన్ని ఆ మంచులో కనిపెడతారు.పర్వతం నుంచి జారిపడినప్పుడు అతని శరీరం లోని కాళ్ళు చేతులు దారుణంగా విరిగినట్లుగా అగపడతాయి.శవం కి ఉన్న ఆ దుస్తులు పేలికలై ఉంటాయి.రోలెక్స్ వాచ్ చేతికి ఉన్నది.నడుముకి ఉన్న రోప్ తెగిపోయి ఉంది.27000 అడుగుల ఆ ఎత్తులో ,ఆ మంచులో దిక్కుమాలిన ప్రేతం లా ఉన్న ఆ శవం ఒకప్పుడు కేంబ్రిడ్జ్ లో ఆంగ్ల సాహిత్యం అభ్యసించిన మనిషి అంటే ఎవరూ నమ్మరేమో.
ఈ దిగిన పరిశోధక బృందం లో కూడా ఈ ఖ్యాతి లేటు గా ఎక్కిన ఆ ఎడ్మండ్ హిల్లరి కే దక్కాలని దురాలోచన చేసే వ్యక్తులు కూడా ఉంటారు.నర్మ గర్భంగా కొన్ని డైలాగులు నడుస్తాయి.శవం జేబు లో వెతుకుతారు..దానిలో ఒక కర్చీఫ్ దొరుకుతుంది ..దానిమీద Ruth అనే పేరు ఎంబ్రాయిడరి ఉంటుంది.ఆమె George యొక్క భార్య.ఆ పేరు ని అలా ఎంబ్రాయిడరి చేసి అతనికి ఇస్తుంది..!అయితే ఆమె ఫోటొ మాత్రం ఆ దుస్తుల్లో కనబడదు.అంటే ఈ లెక్కన ఎవరెస్ట్ ని అతను ఎక్కినట్లు వాళ్ళు భావిస్తారు.ఎందుకంటే ఆమె ఫోటో ని ఆ శిఖరం మీద తన గుర్తుగా ఉంచుతానని చెబుతాడు.ఇవన్నీ అతని డైరీ ని చదివి తెలుసుకుంటారు.
George Mallory కధని
1953 లో ఎవరెస్ట్ ని ఎక్కిన ఎడ్మండ్ హిల్లరి ఆ శిఖరం పైకి ఎక్కి 15 నిమిషాలు ఉంటాడు నార్గే తో కలిసి.కాని ఎందుకనో గాని ఫోటో అక్కడ ఉండి తీయించుకోడానికి ఇష్టపడలేదని అందుకనే ఆ చిన్న మంచు ని నరికే గొడ్డలిని తాను ఒక్కడ్నే ఫోటో దిగానని టెంజింగ్ నార్గే చెప్పారు ఒక ఇంటర్వ్యూ లో.బహుశా అతని అంతరంగం లో ఆ క్రెడిట్ పొందిన మొదటి శ్వేత జాతీయుడు George Mallory అని తెలుసునేమో..!
No comments:
Post a Comment