Saturday, June 4, 2016

The Fountainhead నవల 25 వ ఎడిషన్ కి Ayn Rand రాసిన ముందు మాటలు (రెండవ మరియు చివరి భాగం)" ఇప్పుడు గనక ఈ నవల ని రాస్తే దాని లో ఏమైనా మార్చాలని అనిపిస్తుందా అంటే అటువంటిది ఏమీ చేయను గాని ఒక చిన్న పొరబాటు దాని లో దొర్లింది.దాన్ని మాత్రం సరిదిద్దుతాను.Howard Roark కోర్ట్  సీన్ లో మాట్లాడేప్పుడు డైలాగ్ అది.egoist అనే పదానికి బదులు egotist అనే పదం ని వాడాను,నిజం చెప్పాలంటే రెండవ పదమే అక్కడ సరిపోతుంది..!సరే అది పెద్ద గా పట్టించుకున్నట్లుగా లేదెవరు...!ఆ..ఇంకో వాక్యం కూడా..!From this simplest necessity to the highest religious abstraction ,from the wheel to the skyscrapper ,everything we are and everything we have comes from a single attribute of man- the function of his reasoning mind అని Roark చెప్పే మాట కూడా నేను Religious ideas ని ఎండార్స్ చేస్తున్నట్లుగా ధ్వనించిందేమో అని నాకు ఓ అనుమానం.కాని నా ఉద్దేశ్యం వేరే..అలా చిన్న చిన్న వి ఉన్నాయి.

నా ఉద్దేశ్యం Religious abstractions అనేవి కూడా మనిషి మెదడు తో ఆలోచిస్తేనే వచ్చాయి తప్ప అద్భుతం జరిగి ఎక్కడినుంచో రాలేదు అని..!అనేక శతాబ్దాలనుంచి తన యొక్క  ethics ద్వారా మనిషి కి సంబందించిన అన్ని విలువలని Religion మొనోపలైజ్ చేస్తున్నది.కొన్ని మాటల్ని చాలా జాగ్రత్త గా దీని లో అర్ధం చేసుకోవాలి.Hopton Stoddard అనే పాత్ర Roark తో ఇలా అంటుంది ఓ చోట.

" You 're a profoundly religious man ,Mr.Roark- in your own way. I can see THAT IN YOUR BUILDINGS"

" That's true"  అంటాడు Roark.

ఈ సందర్భం లో అక్కడ చెప్పబడినది Roark యొక్క అంకిత భావం ,నమ్మిన విలువల గురించి తప్ప మతపరంగా కాదు అని అర్ధం చేసుకోవాలి.జీవితం  లోని emotional meaning ని ఇంకా Connotations ని ,హేతుబద్ధ వైఖరిని వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఆ చోటకి Religion చొరబడి తనవైన ఎథిక్స్ ని ప్రయోగిస్తుంది.ఒక అత్యున్నత గౌరవం ఇవ్వాలని అనుకుంటే ఆ సుపీరియారిటి ఆ "పవిత్రుని" కే ఉంది తప్ప మనిషి కి ఎంతమాత్రం లేదు అని చెబుతుంది.మనిషి లోని emotional realm అది ఎంత గొప్పదైనా దానికి విలువే లేదా..!కాబట్టి sense of life is dramatized ..అదే ఈ నవల్లో జరిగింది...Man Worship
ఇంకో మాట లో చెప్పాలంటే...!

ప్రతి మనిషి లోను అది జరుగుతుంది.ఒక్కోసారి అంత తొందరగానూ ఆరిపోతుంది .కొంత మంది లో ఆ అగ్ని కాలం గడుస్తున్న కొద్దీ అణగారిపోతుంది.ఇదనే కాదు Collectivism ..అది కమ్మ్యూనిజం కాని ఫాసిజం కాని నాజీజం కాని అవి కూడా ఒక మతం స్థాయి ని సంతరించుకున్నాయి.అక్కడ ఆ కేంద్రం లో God కి బదులు Society ఉంటుంది అంతే తేడా..!ఒకచోట దేవుని కోసం  మనిషి ని త్యజించమంటే మరో చోటనేమో సొసైటీ కోసం త్యజించమంటారు.రెంటికి పెద్ద తేడా ఏముంది..!ఆరాధించదగిన మనిషిలోని గొప్పతనాన్ని  ఆరాదించరు,అలాంటి వ్యక్తి ఒక్కరు కూడా కనబడరా ...కాదు అలా అలవాటు పడిపోయారు..!నా దృష్టి లో మనిషి లోని Highest potentialiity ని దాని ద్వారా ఒక గొప్పదనం కోసం  కృషి చేసే వారిని Man worshippers గా భావిస్తాను.ఈ తరగతి కి చెందని వారు Man haters..! ఈ భూమి మీద మనుషుల్లో చాలామంది ఈ రెండు భావజాలాల మధ్య Struggle చేస్తుంటారు.అసలు ఈ నవలకి పై భాగం లో ఒక కొటేషన్ పెడదామనుకున్నాను.అయితే ఆ ఐడియాని మళ్ళీ ఉపసమ్హరించుకున్నాను.అది ఎవరిదంటే Friedrich Nietzsche ఒకసారి చెప్పిన మాట.ప్రధానంగా అతను  బైరన్ కి ఉన్న ఆలోచనలకి దగ్గరగా ఉంటాడు. అంతేకాక అతని భావాల్లో హింస,బలప్రయోగం వంటి evils కూడా తప్పు కావు,లేని పోనిది ఇది మరో రకంగా అర్ధం చేసుకునే ప్రమాదముందని దాన్ని పెట్టడం మానేశాను.

మనిషి జీవితం లో యవ్వనం ఎంత ప్రాముఖ్యమైనది.ఎన్నో గొప్ప కార్యాలను చేసే అవకాశం ఉంటుంది.కాని ఇప్పుడు ఏమి కనిపిస్తున్నది..మొదలు పెట్టడమే జీవితాన్ని నొప్పి తో,నిరాశ తో,వ్యక్తం చేయడానికి వీలుకాని బాధ తో మనిషి మొదలుపెడుతున్నాడు.నిజానికి ఇది మనిషి ప్రకృతి లో లేనిది.కొంతమంది ముందుకు వెళతారు,కొంతమంది అమ్ముడు పోతారు.కొంతమంది లో ఆ అగ్ని ఎప్పుడు ఆరిపోతుందో వారికే తెలియదు. ఎవరు చెప్పారు వీరికి..తాము నమ్మిన  విలువల్ని వదులు కోవడం,కార్యాచరణని వదులుకోవడం,ఆత్మ గౌరవం ని వదులుకోవడం అదే పరిణితి అని..! Yet a few hold on and move on,knowing that the fire is not to be betrayed ,learning how to give it up shape ,purpose and reality.But whatever their future ,at the dawn of their lives,men seek a noble vision of man's nature and life's potential.There are very few guideposts to find.THE FOUNTAINHEAD is one of them..!

 ప్రతి జనరేషన్ లో ఏ కొంత మంది దీనిని అర్ధం చేసుకున్నా చాలు.మనిషి యొక్క విరాట్ స్వరూపాన్ని అర్ధం చేసుకున్న వారు ఆ కొద్దిమంది ప్రపంచాన్ని కదిలించగలరు. ఆ కొద్ది మంది కోసమే ఇది..మిగతా వారితో నాకు పని లేదు.

(సమాప్తం) -Murthy Kvvs 

No comments:

Post a Comment