ఎట్టకేలకు మళ్ళీ తీశాను Ayn Rand రాసిన The Fountainhead పుస్తకాన్ని.గతం లో ఓ సారి చెప్పాను గదా..నాకు చదవబుద్ది గాక మూసేసిన పుస్తకాల్లో ఇది ఒకటని...అయినా ఏదో ఒక చోట ..ఎవరో ఒకరు ఈమె పేరు నో,ఈ పుస్తకాన్నో ఉటంకిస్తూనే ఉన్నారు..ఎవరైన సోదాహరణ గా రాస్తారేమో చదువుదామని ఊరుకున్నా ..కానీ ఊహూ జరగడం లా! అందుకనే ఈ మధ్య ఖాళీ దొరికినపుడు దీన్ని తిసుకున్నాను.ఇది 1996 లో సిగ్నెట్ కంపెనీ వాళ్ళు వేసిన పేపర్ బ్యాక్. దీన్ లో ముందుగా ఆకర్షించినది ఈ పుస్తకం యొక్క 25 వ ఎడిషన్ కి Ayn Rand రాసిన ముందు మాటలు,ఎప్పటివి 1968 లో రాసినవి.అసలు మొదట ముద్రితమయింది మరి 1943 లో గదా. ఎంత కాలం గడిచింది..మరి ఇంకా ఇది జనాల్లో నానుతూనే ఉంది గదా.సరే ముందుగా Ayn Rand ..ఆవిడ ఈ నవల రాయడానికి గల కారణాలు,అప్పటి అనుభవాలు ఇవన్నీ కొన్ని పేజీల్లో రాసి పెట్టింది.ముందు ఇక్కడ నుంచి బయలు దేరుదామని మొదలు పెట్టా,వాటిని సాధ్యమైనంతగా సంక్షిప్తంగా ఇక్కడ ఉంచుతాను.
" ఇరవై అయిదు ఏళ్ళు అయింది గదా The Fountainhead రాసి,మీ ఫీలింగ్ ఏమిటి అని..? (సరే..ఇప్పటికి డబ్భై మూడేళ్ళు అయిందనుకోండి) కొంత మంది నన్ను అడుగుతుంటారు.ప్రత్య్యేకించి చెప్పడానికి ఏమి లేదు,సంతృప్తి కరం గానే ఉంది.రచన చేయడం లోని ఉద్దేశ్యం ని నా దృష్టి లో Victor Hugo బాగా చెప్పాడు," ఒక రచయిత తన కాలం కొరకు మాత్రమే రాయాలి అని ఎవరైన అంటే,నేనైతే నా పెన్ను ని విరగ్గొట్టి అవతల పారేస్తా" అని..!
ఒక నెల నో ,ఏడాది నో నిలిచి వడిలి పోయే రచన చేయడం ఈ రోజుల్లో కనిపించే ఒక దీన విషయం.మన వర్తమానం లోని ముఖ్య విషయాన్ని రచన ప్రతిబింబించాలి,దానికి కొద్దిగా ఓ విషయాన్ని చేరుస్తాను.ప్రతి కాలం లోనూ అలాంటి పని జరుగుతూనే ఉన్నది.ఈ The Fountainhead నవల రాసే సమయం లో ఇంత కాలం నిలుస్తుందని ఇంత ఆదరణ వస్తుందని ఊహించలేదు.అయితే ఒకటి ఇది ఎప్పటికి నిలిచిపోతే బాగుండును అనిపించింది.పన్నెండు మంది పబ్లిషర్లు దీన్ని తిప్పి కొట్టారు.మరీ ఇంటలెక్చువల్ గాను,కాంట్రవర్సీ గాను ఉంది,దీన్ని చదివే వాళ్ళు ఎవరుంటారు అని కొందరు ప్రశ్నించారు.
అయితే ఇక్కడ ఒక మనిషి గూర్చి చెప్పితీరాలి.అతని పేరు Frank O'Connor.నా భర్త.1930 ల్లో నేను రాసిన ఓ డ్రామా లో కొన్ని లైన్లు ఇలా ఉంటాయి,ఎంత గొప్ప విజన్ తో కూడిన పని చేసే వారికైనా ఒక Fuel వంటి వ్యక్తి వెనుక ఉండాలి లేదా ఆ అగ్ని చల్లారి పోతుంది.అదిగో అలాంటి Fuel లాంటి వాడే ఈ మనిషి. ఈ నవలని ఎన్నో ఏళ్ళు నిరాశ ల మధ్య ,శ్రమల మధ్య పూర్తి చేశాను,ఒక దశ లో ఆపేద్దామని కూడా అనుకున్నాను.అతను నాతో అన్న కొన్ని వాక్యాల్ని కూడా నేను ఈ నవల్లో సందర్భానుసారంగా చేర్చాను.ప్రపంచం లో మనం చేసే పనులు వ్యతిరేకత ఎదురైనా ఎందుకని ఆపకూడదు అనేదాని మీద,మిగతా వాటి మీద అతను నాతో గంటల కొద్దీ సంభాషించేవాడు.సాధారణంగా నేను రాసిన వాటిని ఎవరికీ అంకితమివ్వను,కాని ఈ నవల్ని మాత్రం Frank కి అంకితమిచ్చాను,ఎందుకంటే దీన్ని బతికించింది అతనే.
ఈ పాతికేళ్ళ లో మీ భావాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని కొంతమంది అడుగుతుంటారు.లేదు అనే చెపుతాను.అయితే జ్ఞానం లోను,దాన్ని అప్లయ్ చేసే విధానం లోను పరిణితి వచ్చింది.మూల భావం ఏమీ మారలేదు అని అంటాను.అప్పుడున్నంత గర్వం గానే ఇప్పుడూ ఉన్నాను.
ఈ నవల రాయడం వెనుక మీ ఉద్దేశ్యం ఏమిటి.
(మిగాతాది వచ్చే భాగం లో చూద్దాము)
---Murthy Kvvs
No comments:
Post a Comment