Friday, July 8, 2016

నా బ్లాగింగ్ జీవితానికి నాలుగు ఏళ్ళు....


2011 నాటికి బ్లాగ్ అనే పేరు వింటూ ఉండేవాడిని,నా మిత్రులు కొంతమంది వాళ్ళ బ్లాగ్ ల URL ని ఇచ్చి చూడమని చెప్పేవారు.చూసేవాడిని,కొన్ని చాలా బాగా అనిపించేవి,ఇంకొన్ని ఫరవ లేదు అనిపించేవి.ఏమైనా ఒకరి భావాలు అలా ఆన్ లైన్ లో ఉండటం,దానిని ప్రపంచం లో ఎక్కడనుంచి అయినా చూడగలగటం నిజంగా ..సైన్స్ కి జోహార్లు చెప్పవలసిందే.అయితే నేను ఏదో ఇంటర్ నెట్ ని అయితే ఉపయోగించేవాడిని గాని సీరియస్ గా ఓ బ్లాగ్ రాయాలని అనిపించేది కాదు.కూడలి లో,మాలిక లో ఇంకా ఇతర అగ్రిగేటర్ ల లో వచ్చే వివిధ బ్లాగుల్ని బాగా చదివేవాడిని.ఆ విధంగా పోగా పోగా నాకు ఓ బ్లాగు రాయాలనిపించింది.ఎలా దాన్ని ప్రారంభించాలి..బ్లాగ్ స్పాట్ లోకి వెళ్ళి నానా రకాలుగా కొన్ని రోజులు గెలికి మొత్తానికి లేఖిని లో తెలుగు రాయడం,దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన బ్లాగు లో అంటించడం నేర్చుకున్నాను.ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది.అలా నా మొదటి తెలుగు బ్లాగు భద్రాద్రి ఎక్స్ప్రెస్ ప్రారంభం అయింది.

ఇక ఇంగ్లీష్ బ్లాగు కూడా ఒకటి రాయాలనే పురుగు తొలచసాగింది.ఇండి బ్లాగర్ లోకి పోయి వివిధ బ్లాగర్లు ఎలా రాస్తున్నారో చూసేవాడిని.ఎక్కువ గా ఉత్తరాది వాళ్ళు ఉండేవారు.తర్వాత బెంగుళూర్ నుంచి ఎక్కువ మంది ఉండేవారు.ట్రావెల్ బ్లాగర్లు నన్ను బాగా ఆకర్షించారు.ఇంద్రాణీ ఘోష్ ,జోషి డేనియల్ ,నిరంజన్ ఇట్లా.అలాగే వివిధ అంశాల పై రాసే టోమిచన్ మథైకల్ బ్లాగ్ ని బాగా చదివే వాడిని.

ఇలా ఉండగా  ఒకసారి "గార్డియన్ " పత్రిక లో దక్షిణ ఆసియా ప్రాంతానికి విలేకరి గా పనిచేసే Randolf Erickson అనే విదేశీయుణ్ణి కలవడం జరిగింది.అతను బ్రిటిష్ జాతీయుడు. పోలవరం ప్రాజెక్ట్ పై అతను ఒక ఆర్టికల్ చేస్తున్నాడు,తోడ్పడమని మా మిత్రునికి ఒకతనికి "హిందూ" లో పని చేసే ఒక ఉద్యోగి చెప్పడం తో అతను నన్ను కలిశాడు.ఆ విధంగా తనతో అయిన పరిచయం నాలోని ఇంగ్లిష్ బ్లాగర్ ని  పైకి లేచేలా చేసింది.నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు,చిన్న చిన్న తప్పులు దొర్లినా కాలక్రమం లో తెలిసిపోతుంటాయి.నీకంటూ ఒక శైలిని ఏర్పరుచుకో  అదే ముఖ్యంగా కావాలసింది అంటూ ఉత్సాహపరిచాడు.ఆ విధంగా నా మొదటి ఇంగ్లీష్ బ్లాగ్  ప్రారంభం అయింది.అదే Murthy's photo blog .

ప్రస్తుతం ఈ రెండు బ్లాగులు బాగానే చదువరులను అలరిస్తున్నాయి,అని నా భావన.ఇది గాక ఇంకో రెండు ఇంగ్లీష్  బ్లాగులు కూడా రాస్తున్నాను.దేవుని దయవల్ల adsense వారు కూడా నా పట్ల చల్లని  చూపు చూశారు.ఆమోదించారన్న మాట.అది గూగుల్ వారి నుంచి మంజూరు కావడం ఒక ఎత్తయితే దానిని నిలుపు కోవడం ఒక ఎత్తు.అది ఒక పెద్ద అంశము. ప్రత్యేకంగా చెప్పుకుందాము.---Murthy KVVS  

No comments:

Post a Comment