Sunday, July 17, 2016

"తల్లి భూదేవి" నవల చింగిజ్ ఐత్మతొవ్ యొక్క మరియొక బంగారు తునక

గతం లో గుర్తుండి ఉంటుంది.చింగిజ్ ఐత్మతోవ్ రాసిన జమీల్య ఇంకా తొలి ఉపాధ్యాయుడు గురుంచి రాసి ఉన్నాను.ఇప్పుడు ఇంకొక నవల "తల్లి భూదేవి"  గురుంచి చెప్పుకుందాము.ఈ చింగీజ్ ఎక్కడ పుట్టింది...కాని ఇక్కడ చదువుతుంటే హృదయం రసప్లవీతమవుతుంది.కన్నీరు కార్చకుండా ముగించలేము అతని రచనని..అదీ అనువాదం లో..మళ్ళీ ఇంగ్లీష్ ని మధ్య లో దాటుకుంటూ వచ్చి.అసలు ఆ ఒరిజినల్ లో ఎంత గాఢత ని పెట్టావయ్యా మహానుభావా అనిపించింది.తనని తాను ఆ మాటల్లో సంపూర్తి గా నింపుకోకపొయినట్లయితే అది సాధ్యమా..? రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యం లో వచ్చిన నవల ఇది.ఒక కుగ్రామం లో ఒక కుటుంబం.అక్కడి  నుంచి ముగ్గురు కొడుకులు ,భర్త తప్పనిసరై యుద్ధ రంగం లోకి వెళ్ళడం ..వాళ్ళు చనిపోవడం..ఇంట్లో ..చివరకి ..అత్త ,కోడలే మిగలడం..వారి బాధలు...ఇంకా ఆ గ్రామం లో ..అలాంటి వారే ఇంకొందరు..అదీ స్థూలంగా కధ.కాని పేజి లో ఏదీ వృధాగా చెప్పినట్టుగా ఉండదు.అలాగే వాస్తవానికి దూరం గాను ఉండదు.

ఈ తెలుగు నవల చదివేప్పుడు ఆసక్తి కలిగి ఇంగ్లీష్ ప్రతిని కూడా పక్క నే పెట్టుకుని చదివాను.నిజంగా ఉప్పల లక్షమణ రావు గారికి జోహార్లు అర్పించాను.అంత రమ్యంగా,అర్ధవంతంగా అనువదించారు.అనువాదకుడు అంటే ఏదో మక్కీ కి మక్కీ అనువదించడం కాదు, ఆ సమాజం గూర్చిన లోపలి పొరల్ని అర్ధం చేసుకుని ఉండాలి,అప్పుడే అది పండుతుంది. తొల్గొనాయ్  అనే ముసలామె పొలం దగ్గరకి వచ్చి గడిచిపొయిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది.. ఆ భూమి కూడా జవాబిస్తూ ఉంటుంది.ఎలా తను తన భర్తని కలిసింది..ఆ పొలం లో పని చేస్తూ గడిపింది..ముగ్గురు కుమారులని కనడం...వారి తో జీవితం ..తరువాత యుద్ధానికి పిలుపు రావడం ..వెళ్ళడం..వారు మరణించడం..కోడలు ఇంకొక వ్యక్తి ద్వారా గర్భవతి కావడం..ఆమె చనిపోవడం..మనవడు బ్రతకడం...వాడికి ఈ కధ అంతా చెబుదామా లేదా అని తటపటాయించడం ...ఇలా కధ సాగి పోతుంది.

చింగీజ్ నవలలు అన్నీ ఒక మోస్తరు పెద్ద కధలు వంటివి.ఇది అలాంటిదే.చింగీజ్ ఐత్మతోవ్ చెప్పే విధానం కడు రమ్యమైనది నాకు తెలిసినంత లో ..గుండె మీద దెబ్బ మీద దెబ్బ వేస్తూ ముందుకు సాగే ఆ శైలి ని ఎంత అనుకరించాలన్నా అది కుదరని పని.ఎందుకంటే అది గంగోత్రి నుంచి గంగ ఎలా ప్రవహిస్తుందో అంత సహజంగా,సాధికారికంగా ప్రవహిస్తుంది.సంభాషణలు చెప్పే విధానం లో ..ఎంత సహజత్వం..వర్ణన కోసం వర్ణించినట్లుగా ఉండదు. ఆ పర్వతాలు..ఆ గడ్డి మైదానాలు..రకరకాల కాలాలలో ..ఆ మధ్య ఆసియా లోని పల్లెల శోభలు...నిజంగా అక్కడికి వెళ్ళిపొయిన అనుభూతి కలుగుతుంది.కూసే భరద్వాజ పక్షిని ని సైతం ఒక పాత్రని చేయడం..!నిజంగ కోడలిని అంతగా ప్రేమించే  అత్తగా ఎవరైనా ఉంటారా అనిపిస్తుంది.యుద్ధం లో కుమారుడు ఖాసిం మరణిస్తాడు,అది విని కోడలు దిగాలు చెందడం, నీవైనా మళ్ళీ పెళ్ళాడి  సుఖంగా బ్రతుకు అని అత్త కోరుకోవడం, ఓ గొర్రెల కాపరి వల్ల గర్భవతి కావడం,తను మొహం చాటేయడం..పిల్లాణ్ణి కంటూ ఆ అమ్మాయి అలినాయ్ మరణించడం..పుట్టిన ఆ మనవడి తో కాలం గడుపుతూ ...పొయే లోపు ..అతని జన్మ రహస్యం చెప్పాలా ..లేదా అని యోచిస్తూండడం..అలా ముగుస్తుంది కధ.

ఈ కధ లో రచయిత రెండవ ప్రపంచ యుద్ధాన్ని ,దాని వల్ల రష్యా లో కలిగిన పరిణామాల్ని ,త్యాగాల్ని ,సమిష్టి వ్యవసాయ  క్షేత్రాల్లో స్త్రీలు సైతం కష్టించి యుద్ధ రంగానికి ఎలా తిండి గింజలు పంపారు...ఎలాంటి బాధల్ని ఎదుర్కున్నారు అనేది చాలా చక్కగా చెప్పారు.అనుబంధాలు అనే మాటకి అర్ధం ఈ నవల లో అర్ధం తెలుసుకోవచ్చును..!అంత హాయిగా చద్వుకోవచ్చును..ఎక్కడా పిసరంత బోరు కొట్టదు.

"నిజంగా ఈ రోజు నడిచి వచ్చిన దారి నా జీవితం లో అత్యంత కఠినమైన దారి..."  బహుశా ఇలాంటి   మాట ఆ బాష లో  ని ఒక వ్యక్త పదబంధమనుకుంటాను, ఇదే తొలి ఉపాధ్యాయుడు లో కూడా తారస పడుతుంది.ఇంగ్లీష్ లో ఇలా ఉంది " THE ROAD I TRAVELLED THAT MORNING WAS THE HARDEST ROAD OF MY LIFE" .

గ్రామం నుంచి ఆ రాత్రి పూట అలిమోన్(కోడలు)  ని  ఆసుపత్రికి పక్క ఊరికి తీసుకు వెళుతుండగా మధ్యలో ఆమె ఆ బండి లోనే మరణిస్తుంది.శిశువు పుడతాడు.ఆమె (అత్త) ఇలా రోదిస్తుంది. How unfortunate you are..Your very first cry was your farewell to your mother....!Then ,from some far away place came the thought : " But life has not died off completely,a little shoot has been left." Then another thought replaced it:" How can he ever survive if he hasn't even tasted his mother's milk? No,he won't last long." .......!!!!!

ఇలాంటి యూరోపియన్ క్లాసిక్స్ ని ఆంగ్లం అనే మాధ్యమం లో చదవగలిగినందుకు ఆనందమనిపించింది.అలాగే ఉప్పల లక్ష్మణ రావు గారికి తెలుగు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. Murthy KVVS

No comments:

Post a Comment