Sunday, October 2, 2016

అమెరికా...అమెరికా...(యాత్రా నవల) చదివిన తర్వాత..


ఈ మాటలు కొన్నింటిని రాయాలనిపించింది.అమెరికా వెళ్ళి వచ్చిన తరువాత వారి అనుభవాలను అక్షర రూపం లో చాలా మంది పంచుకున్నారు. గతం లో కొన్ని రచనలు చదివి ఉన్నాను.సరే అక్కడ ఉన్న వాళ్ళు రాసినవి కూడా కొన్ని వచ్చినవి.అంపశయ్య నవీన్ రాసిన ఈ రచన ఒక నవలా రూపం లో సాగుతుంది.దానిలొని పాత్రలు అన్ని మనం గుర్తింపవచ్చును.ఒక తెలుగు వారి సంస్థ పిలుపు మేరకు వెళ్ళి ఇంకా అక్కడి తమ బంధువులను ,మిత్రులను కలుసుకున్నారు.అద్భుత దృశ్య మాలికలను చూసి వాటి గురుంచి రాశారు.అక్కడి తెలుగు వారి జీవితాలను ముందుంచారు. వెలుతురు కొంత చీకటి కొంత అన్నట్లుగా అక్కడి వివిధ పోకడలను వివరించారు.

తెలుగు వారి సినిమా పిచ్చి అక్కడ కూడ వర్ధిల్లుతూనే ఉంది,ముఖ్యంగా అక్కడి సమావేశాల్లో సాహితీ పరమైన చర్చా కార్యక్రమాలు వినేవాళ్ళు లేక వెల వెల బోతుండగా,సినిమా నటులు ఉన్న వాటికి మాత్రం తెలుగులు విరగబడి రావడం గోల చేయడం ఇలాంటివి కనిపిస్తాయి.అలానే ఇచ్చే ఆతిథ్యం లోని తేడాలూ కనిపిస్తుంటాయి.లాస్ ఏంజిల్స్,చికాగో ఇంకా ఇతర వివిధ ప్రాంతాల్లో ని తెలుగులను ముఖ్యంగా కొందరు సాహితీ జిజ్ఞాసువుల్ని వారి కోరిక మేరకు కలుసుకున్నారు.

 ఎంత కష్టపడితే అంత ఎదిగే అవకాశం ఉన్నదని,మన లా పని కట్టుకొని ఎదుటి వాడిని దెబ్బతీసే పనులు ఇక్కడ చేయరని,ఒకరి జీవితం లోకి ఒకరు ప్రవేశించి చికాకు చేసే జీవన శైలి అమెరికా లో ఉండదని దాని వల్లనే ఎవరి పని లో వారు ఉండి వారాంతాల్లో జీవితాల్ని హాయిగా గడుపుతుంటారని కొన్ని సన్ని వేశాల్లో చెప్పారు.ట్రాఫిక్ పోలీస్ లు ఫైన్ వేసే టప్పుడు కూడా మర్యాద గా ప్రవర్తించే విధానం రచయిత శ్లాఘించారు.మన దగ్గర మనిషి కి మనిషి కి మధ్య సభ్యత పాటించడం కూడా చిన్నతనం గా భావిస్తారు.ఎంత రూల్స్ ని బ్రేక్ చేసి తప్పించుకోగల్గితే అంత హీరోయిజం.అక్కడ చుట్టపు చూపు  గా వచ్చిన తల్లి దండ్రుల్ని కదిలిస్తే వాళ్ళు ఏం చెబుతారంటే ' మా పిల్లలు పనికి వెళ్ళిపోతే మాకు ఏమీ తోచదు,పక్కింటి వాళ్ళ తో మాట్లాడడము గాని బయటకి వచ్చి ఏటైనా పోదామనా కుదరదు బోరు వచ్చి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటారు.

రాజకీయాల ప్రసక్తి వచ్చినప్పుడు ఒక లోకల్ ఆమె అంటుంది...ఎవరి పని వాళ్ళు చేసుకోవడం లోనే అందరూ ఉంటారు.అవి అన్నీ ఆ రంగం లో ఉన్న వాళ్ళ కే వదిలిపెడతారు,ఒక్కసారి ఎన్నికలైపోతే అందరూ అధ్యక్షుడిని గౌరవిస్తారు.అట్లా..!

రచయిత నేటివ్ అమెరికన్ ల తో ఇరాక్ మీద చేస్తున్న యుద్ధం గురుంచి ప్రస్తావించగా వాళ్ళు నవ్వి ఊరుకుంటారు.ఇంకా చాలా సంగతుల్ని ప్రస్తావించుకుంటూ పోయారు.ఇండియా లో అప్పుల పాలయి ఈ అమెరికా లోకి పారిపోయి వచ్చి కష్టపడి పనిచేసి కొన్ని ఏళ్ళ లో అవి అన్ని తీర్చి వేసిన ఒక వ్యక్తి తన గాధ చెబుతాడు.అట్లానే జీవితం లో కొన్ని వాటిల్లో దెబ్బ తిని మళ్ళీ కుదురుకున్న వాళ్ళు,రియల్ ఎస్టేట్ బిజినెస్ లు చేస్తున్న వాళ్ళు ,సాఫ్ట్ వేర్ వాళ్ళు..ఇలా అన్ని రకాలు కనిపిస్తారు.

తెలుగుల సామాజిక కోణం ని ఆవిష్కరించడం లో ఈ రచన ఒక బాధ్యతని నిర్వర్తించింది.ఇక్కడ మన దేశం లో అమెరికా ని తిట్టే మేధావుల కి చెందిన పిల్లలు నిక్షేపంగా అమెరికా లో ఉంటూ డాలర్లు సంపాదిస్తుంటారు.అక్కడ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు,కుంటి కారణాలు ఎన్ని చెప్పినా అవి తర్కానికి నిలబడవు.ఇలాంటి హిపోక్రసి మన దేశ జీవనం లో అనేక విషయాల్లో కనిపిస్తుంది.అవే మన అభివృద్ది కి నిరోధకాలు.ఎంత చక్కగా పనిచేస్తున్నా ..దాన్ని గుర్తించేది మన దగ్గర తక్కువ,నువ్వు ఎంత అందం గా మాట్లాడి అలరిస్తున్నావన్నదే ఇక్కడ ప్రధానం.దోచుకునేవాడు మన వాడు అయితే చాలు అది దోపిడి గా గుర్తింపబడదు.దేశ విశాల హితం ఎవడికి కావాలి,అలా ఎవరైనా ఉంటే ఇక్కడ చాదస్తం గాళ్ళు అని పిలువబడతారు.అసలు మన దేశం లో చూడండి  I don't know అనే పదమే ఎవరూ వాడరు,తెలిసినా తెలియకున్నా ఏదో ఒకటి చెప్పడమే తరువాయి.


మన రాస్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళ లో ఏ ఒక్కరూ అక్కడ ఇంగ్లీష్ భాష లో రచనలు చేసి పేరు గడించలేకపోయారెందుకని అర్ధం కాదు.ఝుంపా లహిరి లానో,అంతకి ముందు భారతి ముఖర్జీ లా నో మన ప్రవసాంధ్రుల్లో ఎవరూ ఉన్నట్లు నాకైతే తెలియదు.ఒక్క సాహిత్యం లో అనే కాదు మిగతా సంగీత సాన్స్కృతిక రంగాల్లో కూడా మన వాళ్ళ కృషి పెద్ద గా ఉన్నట్లు కనబడదు.అక్కడ ఉంటూ ఇక్కడి సాహిత్య ,సంగీత తదితర రంగాల్లో రాణించడమూ భ్రమే దాన్ని ఆశించనూ రాదు.దానికి బదులు గా అక్కడి సమాజం లోని వివిధ సాన్స్కృతిక రంగాల్లో ప్రవేశించి ఎందుకు ముందుకు పోరాదు.అక్కడి సినిమాల్లో ,నాటకాల్లో,సంగీతం లో,సాహిత్యం లో ..ఇలా అనేక వాటిల్లో..! నా వరకి నాకైతే అదే నిజమైన గొప్పదనం అప్పుడప్పుడు వచ్చి దేశ ప్రేమ తో స్పాన్సర్ చేసే కార్యక్రమాలకంటే..!!!

No comments:

Post a Comment