రాయగడ ఒరిస్సా లోని ఒక జిల్లా కేంద్రం.తెలుగు వారు,ఒరియా వారు మమేకమై వర్ధిల్లుతున్న ప్రాంతం.ఎక్కడికి వెళ్ళిన ..అక్కడ వీనుల విందుగా చక్కని తెలుగు,ఒరియా,హిందీ కొండకచో బెంగాలీ వినబడుతూ భారతీయ జీవనం లోని భిన్నత్వం అతి సుందరం గా ముడివేసుకున్న ప్రాంతం.అటువంటి ప్రాంతానికి, రాయగడ రచయితల సంఘం వారు నిర్వహించిన ఓ సాహితీ సమావేశం నిమిత్తము గత ఎనిమిదవ తేదీన వెళ్ళడం జరిగింది. డా.బాబూరావు మహంతి గారు వెలువరించిన రామాయణ పరిశోధక గ్రంధం ని ఈ సంధర్బం లో ఆవిష్కరించారు పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారు. కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసినా ఈ సారి ఎందుకనో అలుపు రాలేదు అదీ బస్సు మీద ,గతం లో భుబనేశ్వర్ అవీ వెళ్ళినా రైలు ప్రయాణమే అయింది.అసలు ప్రయాణాలు కూడా మూడు రకాలు గా చేయాలి జన బాహుళ్యం యొక్క నాడిని,యాసని,సన్స్కృతిని పట్టుకోవాలంటే..!అందులోనూ మన దేశం ఎంత విభిన్నతలకి ఆలవాలం...!అన్నిటిని గుది గుచ్చే ఏదో ఒక ఆత్మ ..ఇక్కడనే ఉంది..అది అన్ని విభేదాలకీ అతీతమైనది.దాన్ని అంతర రాష్ట్ర ప్రయాణాల్లో బాగా తెలుసుకుంటాము.
ముందు గా సాహితీ మిత్రులు విజయ చంద్ర ,బరంపురం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను,వారి వల్లనే ఈ ప్రయాణం సాకారం దాల్చింది.అంతే కాదు వారి లోని విద్వత్తును తెలుసుకోగలిగాను.రామాయణం పై ఆయన చేసిన సమీక్ష కొత్త ద్వారాలను తెరిచింది.ఈ ప్రవాసాంధ్రుల లో ఎంత మంది మహానుభావులున్నారో...కవులు,రచయితలు,గాయకులు,తదితర రంగాలలో కృషి చేస్తూ తెలుగు సన్స్కృతిని ఇనుమడింప చేస్తున్న దృశ్యం కళ్ళకి కట్టింది.ఇంకా మంచి విష్యం ఏమిటంటే అచటి ఒరియా రచయితలు కూడా మన తెలుగు సాహితీ సమావేశానికి విచ్చేసి ఉండటం...అశుతోశ్ పాత్రో,బాసుదేవ్ పాత్రో వంటి వారు.రెండవ కవి ఒరియా పాత్రికేయులు కూడా.ఆయన పుస్తకం ఒకటి ఇచ్చారు.ఇరు భాషా సాహిత్యాల గూర్చి చర్చించాము.అక్కడి నిర్వాహకులు ఎంతో ఉత్సాహంగా అందర్నీ ఆహ్వానించారు.
సభ లో ఆలోచనాత్మకమైన రీతులు ప్రతిధ్వనించాయి.విజయ చంద్ర గారి ఆప్యాయతానురాగాలు మరువలేనివి,వారి కవితాసంపుటిని బహూకరించారు.మిగతావి పంపిస్తానని చెప్పారు.సమయం కుదిరినప్పుడల్లా వాటి గురుంచి నా అభిప్రాయాల్ని రాస్తాను.రాయగడ రచయితలు ,మాన్యులు ఆనంద రావు పట్నాయక్ గారు ,ప్రొఫెసర్ దినకర్ గారు ఇంకా ఎందరో మిత్రులు పరిచయం అయినందుకు సంతోషం గా ఉంది. ఇంకొకటి చెప్పాలి...కాంతా రావు తంపా గారు ఆయన శిష్యురాలు అనురాధ పాణిగ్రాహి తో కలిసి పాడిన పాటలు ఎంత హాయిగా ఉన్నాయో ఈ కార్యక్రమం ఆసాంతమూ అంత చక్క గా సాగిపోయింది. I bid adieu to you Rayagada and cherish your spirit of bonhomie and fraternity.
Pics Credit: Sri Ashutosh Patro
Thanx Sir for posting the event. we are thankful to u for ur esteemed presence.
ReplyDelete