రాయగడ రచయితల సమావేశానికి వెళ్ళి అనేకమంది నూతన కవి మిత్రులను కలవడం ఒక సంతోషకరమైన విషయం.కాగా ఒక చిన్న విషయం లో ఇలా కాకుండా ఉన్నట్లయితే బాగుండేది అని మాత్రం అనిపించింది. దానికి ఎవరూ బాధ్యులు కారు.కొన్ని సార్లు పరిస్థితులు అలా అవుతాయి.అంతే.ఏమీలేదు...ముఖ్య అథితి మండలి బుద్ధ ప్రసాద్ గారికి నేను నా గాడ్ ఫాదర్ అనువాద ప్రతిని అందచేసినపుడు ,ఆకస్మికంగా ా ఆయన పదండి ఒక ఫోటో దిగుదాము అని అన్నారు..దానితో మా ముందునే ఉన్న అశుతోశ్ పాత్రో గారిని అడగ్గా కెమెరా తో ఒక స్నాప్ తీశారు. దాని తర్వాత ఓ పావుగంట కి అనుకుంటా దానిలో సెల్ అయిపోవడం తో ఆ తర్వాత ఆయన మొబైల్ తో తీశారు,ఆ తర్వాత దాన్ని వాట్సాప్ లో పంపిస్తానని అన్నారు.వచ్చిన తర్వాత గుర్తు చేయగా అది ఆనందరావు పట్నాయక్ గారి కెమెరా లో ఉన్నట్లు తెలిపారు.హ్మ్...ఏమని ..అడుగుతాము మళ్ళీ..మళ్ళీ..కొన్ని సార్లు అంతే..నా మొబైల్ తో తీసినా బాగుండునేమో..కొన్ని సార్లు అంతే..అలా జరిగి పోతుంటాయి..అదే విధి.
No comments:
Post a Comment