Saturday, October 29, 2016

విజయ చంద్ర గారి " నీలి లాంతరు (కవిత్వం)" ని అందుకున్నాను.



విజయ చంద్ర గారి " నీలి లాంతరు (కవిత్వం)" ని అందుకున్నాను.నిన్ననే.రకరకాల జీవిత  సన్నివేశాల్ని,తనని కదిలించిన ప్రపంచం లోని సంఘటనల్ని వస్తువు గా మలిచిన తీరు ఒక ప్రత్యేకమైన  కవి గా ఆయనని నిలబెడుతున్నది.తనకంటూ ఒక దారి,గొంతుక ఉన్నది.ఇదీ నాకు తోచిన విషయం ఆ కవితల్లో కొన్నిటిని చదివినపుడు..!  చెప్పే పద్ధతి పాఠకుడికి విసుగు కలిగించదు సరికదా ఒక ఊపు లో చదువుకుంటూ వెళ్ళిపోతాము.

అపరిచితుడు కవిత లో తనకు తారసపడిన సామాన్యుని పరామర్శించి జీవిత గమనం లోనికంటా తొంగి చూస్తాడు.రోజువారి పనుల్ని హృద్యంగా కవితీకరించిన తీరు  ఆకట్టుకొంటుంది." ఒకోసారి పబ్లిక్ లైబ్రరీ లో వార్తా పత్రిక తిరగేస్తూ,మరొకసారి సాయం కాలం చెరువు గట్టు మీద ఎవరితోనో పిచ్చాపాటి మాట్లాడుతూ, ..మిరప బజ్జీ తింటూ,..రోడ్డు సైడు బడ్డీ లో టీ తాగుతూ ..." ఇలా సాగుతుంది.అతను అన్నిటిని గమనిస్తుంటాడు..కాని దేని లోనూ పూర్తి గా నిమగ్నం కాడు.కవి కి అతను ఒక మార్మికుని లా కనబడతాడు.

గతం గతహ లో మనిషి సరుకు గా మారని కాలాన్ని నోస్టాల్జియ గా చెబుతాడు కవి.తిండి,భక్తి ఇలా ప్రతిదీ ఎలా రూపాంతరం చెందిందో విశదీకరిస్తారు.బరం పురం వీధుల గుండా మనల్ని తీసుకు వెళతారు.ఎక్కడైనా మనిషి వ్యధ ఒకటే.కారుణ్యం నిండిన మనిషి గుండె ఒకటే.అది ఈ పుస్తకం లోని ప్రతి కవిత తెలుపుతుంది. ఒరియా ,బెంగాలీ,హిందీ వంటి ఇతర భాషల్లోకి వీరి కవితలు తర్జూమా చేయబడ్డాయి.నేను చెప్పడం కంటే మీరు చదివితేనే దీని లోని రసపుష్టి తెలుస్తుంది. ప్రతులకు : విజయ చంద్ర (కవి) ఫోన్ : 0 94387 20409  

No comments:

Post a Comment