ఈ రోజు దీపావళి..Blog మిత్రులందరికి శుభాకాంక్షలు.అయినా పగటి పూట టపాసులు ఏమి కాలుస్తాము,ఏదో బయటికి వెళదాము అనుకొని తయారవుతుండగా సరిగ్గా ఉదయం 9.25 కి ఒక కాల్ వచ్చింది.అది కొత్త నెంబర్ లా అనిపించి కాసేపు మాట్లాడదామా వద్దా అని తటపటాయించాను,ఎవరైనా పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి చేశారేమోనని మొత్తానికి తీశాను.అవతలి వ్యక్తి ని కనుగొని ఇంకా ఆశ్చర్యపోవడం నా వంతయింది,ఒక్క క్షణం ఏమి మాటాడాలో తోచక మ్రాన్ పడి పోయాను.మీరు రాసిన " మూర్తీస్ మ్యూజింగ్స్" పుస్తకం చాలా బాగున్నది.ఈ రోజే పూర్తి చేశాను " అంటూ చెప్పారు అవతలనుంచి..! కృతజ్ఞతలు తెలిపాను ..!ఆ కంగారు లో పండుగ గ్రీటింగ్స్ కూడా చెప్పడం మరిచాను.ఆ తర్వాత అది స్ఫురించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ..ఏమిటీ సస్పెన్స్ అంటున్నారా..? ఆయన ఎవరో కాదు యండమూరి వీరేంద్రనాధ్ గారు.ఇంకా అంతకంటే పరిచయం ఎందుకు తెలుగు పాఠకులకు... I felt really honored for his accolades.
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Sunday, October 30, 2016
ఈ రోజు ఒక ఊహించని వ్యక్తి ఫోన్ చేశారు,నిజంగా ఆశ్చర్య పోయాను..
ఈ రోజు దీపావళి..Blog మిత్రులందరికి శుభాకాంక్షలు.అయినా పగటి పూట టపాసులు ఏమి కాలుస్తాము,ఏదో బయటికి వెళదాము అనుకొని తయారవుతుండగా సరిగ్గా ఉదయం 9.25 కి ఒక కాల్ వచ్చింది.అది కొత్త నెంబర్ లా అనిపించి కాసేపు మాట్లాడదామా వద్దా అని తటపటాయించాను,ఎవరైనా పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి చేశారేమోనని మొత్తానికి తీశాను.అవతలి వ్యక్తి ని కనుగొని ఇంకా ఆశ్చర్యపోవడం నా వంతయింది,ఒక్క క్షణం ఏమి మాటాడాలో తోచక మ్రాన్ పడి పోయాను.మీరు రాసిన " మూర్తీస్ మ్యూజింగ్స్" పుస్తకం చాలా బాగున్నది.ఈ రోజే పూర్తి చేశాను " అంటూ చెప్పారు అవతలనుంచి..! కృతజ్ఞతలు తెలిపాను ..!ఆ కంగారు లో పండుగ గ్రీటింగ్స్ కూడా చెప్పడం మరిచాను.ఆ తర్వాత అది స్ఫురించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ..ఏమిటీ సస్పెన్స్ అంటున్నారా..? ఆయన ఎవరో కాదు యండమూరి వీరేంద్రనాధ్ గారు.ఇంకా అంతకంటే పరిచయం ఎందుకు తెలుగు పాఠకులకు... I felt really honored for his accolades.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment