నిన్న ఒక హృదయ విదారకమైన సంఘటన జరిగింది.ఫోటోలు సైతం పోస్ట్ చేశారు ..అవి చూసి మా అడ్వకేట్ మిత్రులు పామరాజు తిరుమల్ రావు మరియు వైద్యుల వెంకటేశ్వర్లు గార్లకు అభినందనలు తెలియజేశాను.రోడ్డు మీద వెళుతున్న ఆవు పెయ్య ని ఒక వాహనం ఢీ కొట్టింది.దానితో పాపం ఆ మూగ జీవి కాలు విరిగి విల విల లాడగా ఆ మిత్రులు దగ్గరుండి వైద్యం చేయించి గోరక్షణ ని చేతల్లో చూపించి పదుగురికి ఆదర్శప్రాయులైనారు.అందుకు వారికి మరోమారు అభినందనలు.
అసలు సమస్య మూలం లోకి పోతే గోవులు ఏ దేశం లోనైనా ఇలా రోడ్ల మీద కి ఎందుకు అనుమతింపబడాలి..? అట్లని వాటి ని కోపగించుకోవడం లేదు.అది దాని యజమాని సమ్రక్షణ లో ఉండాలి.పచ్చిక లో మేస్తుండాలి.లేదా యజమాని సావడి లోనైనా ఉండాలి.ఆ మూగ జీవుల కష్టాన్ని,పాలని వాడుకొని నీ ఖర్మ నీ ఆహారం నీవు సంపాదించుకో పో అని జనారణ్యాల లోకి,రోడ్ల పైకి తోలేస్తున్నారు.ఒకసారి వాటి గోడు ని చూడండి..తిండానికి ఏమీ దొరకక పేపర్లు అవీ గోడ మీదినుంచి చీరుకొని తింటుంటాయి.ఏ కూరగాయల కొట్టు దగ్గరికో ఎక్కడికో పోయి దీనంగా చూస్తుంటాయి.అదిలించి కొడతారేమోనని వాటికీ భయమే.బిక్కు బిక్కు మని ఉంటాయి...వీటికి పోటీ గా కుక్కలు,పందులు ఒకటి.ఇవి ఏమైనా తింటే ఎగబడుతుంటాయి.ఆ దృశ్యం చూడడానికే అమానవీయంగా ఉంటుంది.అసలు వీటికి తిండి పెట్టకుండా బయటకి తోలిపారేసే ఆ యజమానులను శిక్షించే విధంగా చట్టం ఎందుకు తీసుకు రాకూడదు..?గో మాత మీద ప్రేమని కేవలం మాటల్లో నే తప్ప చేతల్లో చూపే ఈ మిత్రుల వంటి వారు చాలా చాలా తక్కువ.గతం లో కూడా ఇలాంటి దీన దృశ్యాలు ఎన్నో కానబడినవి ఎందుకని ఇంత Insensitivity..?
అవి అనవసర భారం అనుకున్నప్పుడు ఆ కబేళల కన్నా తరలించండి.చిత్ర హింసల తో అవయవాలు విరిగి ఆ రోడ్డు మీద పడితే అవి చూస్తూ పోవడం కన్నా, ఆకలి బాధ తో అలమటిస్తూ రోడ్ల మీద కుక్క బాధలు పడే ఆ మూగ జీవుల పట్ల పనికి రాని ఆదర్శపు స్లోగన్లు కాక పూని ఏదైనా పని చేయండి..జంతుప్రేమికులకు ,మానవ ప్రేమికులకు ఇదే నా విజ్ఞాపన.
No comments:
Post a Comment