Sunday, November 27, 2016

మంగళంపల్లి బాలమురళీకృస్ణ మరణించినప్పుడు తెలుగు ప్రముఖుల రెస్పాన్స్ ఇంకా నివాళులు ఇవన్నీ చూసినప్పుడు ఒకటి అనిపించింది





మంగళంపల్లి బాలమురళీకృస్ణ మరణించినప్పుడు తెలుగు ప్రముఖుల రెస్పాన్స్ ఇంకా నివాళులు ఇవన్నీ చూసినప్పుడు ఒకటి అనిపించింది.బయటకి ఓ ఆడంబరం కోసం తెలుగు జాతి తొక్కా తోలు అని కబుర్లు చెప్పడం తప్ప అలాంటిది ఏదీ లేదని..!!ఒక్క ప్రముఖ నటుడు గాని,దర్శకుడు గాని,రాజకీయ ప్రముఖులు గాని,సాన్స్కృతిక ప్రముఖులు గాని కనీసం భౌతిక కాయాన్ని సందర్షించిన పాపాన పోలేదు.నిజానికి తమిళులు ఎవరూ రాకపోయినా అనుకోడానికి ఏమీ లేదు ..కాని కమల్ హాసన్,శివ కుమార్,వంటి నటులు అనేక మంది జేసు దాసు వంటి గాయకులు వెళ్ళి నివాళులు అర్పించారు.అదీ వారికి ఉన్న కళ ల పట్ల గౌరవం.బాలమురళి కర్ణాటక సంగీతానికి సమకాలం లో త్యాగయ్య వంటి వారు.అనేక దేశాల్లో కచేరీలు చేసి తెలుగు తేజాన్ని శోభించారు.కాని అది మన సో కాల్డ్  జనాలకి ఆనదు.బూతు సినిమాలు తీస్తూ కోట్లు గడించిన నిర్మాత ,దర్శక,నటులు మనకి గోఅప్ప కళా సేవ చేసిన వారు గా కనబడతారు.

అసలు చెప్పాలంటే తెలుగు వారికి ఓ పది శాతాన్ని ఇంచుమించు వదిలేస్తే ..చాలామందికి కుల స్పృహ ఉన్నంతగా కళా స్పృహ ఉండదు.ప్రతి వ్యక్తిని అతని కృషిని కుల ముసుగు లోనుంచి మాత్రమే చూస్తారు.అది ఈ తెలుగు జాతి ఖర్మ.బాలమురళి మద్రాస్ లో కాకుండా ఆంధ్ర లో ఉన్నట్లయితే ఈ మాత్రం కూడ పేరు వచ్చేది కాదు.మాండలిన్ శ్రీనివాస్ కూడా మద్రాస్ లో ఉండి కృషి చేయడం వల్లనే ప్రపంచ ఖ్యాతి చెందాడు..కాని అతను మన కుల స్పృహ కళ్ళకి ఇప్పటికీ ఆనరు.ఏ మాటకి ఆ మాట ఒక కళాకారుని గుర్తించి గౌరవించడం లో తమిళ ప్రజల రీతి యే వేరు.అది స్వతహగా ఆ సంస్కృతి నుంచి వచ్చినది.అందుకనే గామోసు మాలతీ చందూర్ ఒక సారి అన్నారు తెలుగు వారికి తెలిసినవి రెండే కల్చర్స్...ఒకటి అగ్రి కల్చర్..రెండు సినిమా కల్చర్ అని...!

బాల మరళి పోయిన రోజున ..ఆ తర్వాత రోజున ...టైంస్ ఆఫ్ ఇండియా ,హిందూ,హిందు స్థాన్ టైంస్ వంటి పత్రికల వెబ్సైట్స్ చూస్తే ఎంతో మంది తెలుగేతరులు ఆయన్ని తల్చుకుంటూ కామెంట్లలో రాసినది చూస్తే బాల మురళి గురుంచి(తెలుగులకి తప్ప)  ఇతరులకే ఎక్కువ తెలుసునేమో అనిపించింది.

3 comments:

  1. తెలుగువారికి సినిమా కల్చర్ తప్ప మరేమీ పట్టదండీ. బాలసుబ్రహ్మణ్యం పేరు విన్నవారే బాలమురళి పేరు విన్నవారు ఈనాటి యువ, మధ్యవయస్సు తరాల్లో తక్కువే అనుకోక తప్పదు.

    ఫర్లేదు. సినిమాల్లో ఈమధ్య బయోపిక్స్ అని బాగానే వస్తున్నాయి, సొమ్ములు బాగానే చేసుకుంటున్నాయి. కాబట్టి మంగంళంపల్లి బాలమురళీకృష్ణగారి గురించి కూడా ఒక సినిమా అలాంటిది వచ్చినా రావచ్చును. అందులో బాలమురళిని గురించి వారి కుటుంబానికీ, శిష్యులకూ ఇతర సన్నిహితులకూ కూడా తెలియని వింతలూ విశేషాలూ తప్పకుండా బోలెడు ఉంటాయి కాని సంగీతం మాత్రం తెలుగువారికి పట్టని శాస్త్రీయసంగీతం కాక బాగా ఆధునికంగా ఉంటుంది సుమండీ. మనదేశంలో ఉన్న క్రికెట్ పిచ్ఛిని సొమ్ము చేసుకుందుకు గాను ఆ సినిమాలో బాలమురళీ గారు ఒక మంచి క్రికెటర్ అని కూడా చూపినా ఆశ్చర్యం లేదు - అలా ఎందుకూ అంటే మరి యువతరానికి నచ్చాలి కదా!

    ReplyDelete
  2. బాగా చెప్పారు మూర్తి గారూ. చావుపరామర్శ చెయ్యడానికి కూడా కులాలు చూసుకునే మనుష్యుల మధ్య బతుకుతున్నాం కదా ఈ కాలంలో, ముఖ్యంగా కళా రంగంలో. అందువల్ల జరిగినదాంట్లో / జరగనిదాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు.
    అసలు ఉన్నత పద్మపురస్కార గ్రహీతకు చూపించవలసిన మర్యాద కూడా చూపించలేదని ఇంకోచోట చదివాను. అంతిమసంస్కారాలకి ప్రభుత్వ లాంఛనాలు ఏర్పాట్లు చెయ్యలేదే అని అడిగితే ఆ సంగతి తమిళనాడు ప్రభుత్వం చూసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సెలవిచ్చారని పత్రికలలో చదివాను. తమిళనాడు ప్రభుత్వంతో మన వాళ్ళే ముందస్తుగా సంప్రదించి తగిన ఏర్పాట్లు జరిగేలా చూసుకునుండచ్చుగా. వేరే బ్లాగులో శ్యామలీయం గారన్నట్లు తెలుగువారికి రానురాను ఆత్మగౌరవం కుంచించుకు పోతోంది, సిగ్గు పడాలి.
    మంగళంపల్లి గారి సమకాలికుడైన భీమసేన్ జోషి గారికి లాగానే వీరికి కూడా 'భారతరత్న' కోసం మన ప్రభుత్వం, నాయకులు పట్టించుకోకపోవడం వాళ్ళంతా సిగ్గుపడవలసిన మరో వైఫల్యం. అయినా బాపు గారికి దాదాపు అంత్యదశ వరకు కనీసం 'పద్మశ్రీ' కూడా రాకపోయినా చీమకుట్టినట్లైనా లేకపోయిన మన నాయకులు ఏదో చేస్తారని ఆశించడం జనాల తెలివితక్కువ.

    ReplyDelete