జయలలిత పోయిన తరువాత వెల్లువెత్తుతున్న సానుభూతి ..ప్రేమ అంతా చూస్తుంటే సగటు భారతీయుని మనసు ప్రతిబింబిస్తున్నది.ఎన్ని అవినీతి కేసులు,ఎంత చెడ్డ ప్రొప గాండ.బతికి ఉన్నప్పుడు.ఒక్కసారి పోగానే ..అమ్మా అమ్మా ..అంటూ..శోకాలు.సరే..ఇవి అన్నీ తమిళ సగటు ప్రజానీకానికి షరా మామూలే.కానీ టివి. లో ఆ సీన్లన్నీ చూసి చూసి తెలుగు వారికి కూడా ఒక ట్రాన్స్ లో పడినట్లయింది.ఎన్ టి ఆర్ పోయినప్పుడు కూడా ఇంతా ఫీలవ్వలా..మనాళ్ళు.అదేంటో...!
జయలలిత చివరి రోజుల్లో చేసింది ఏమిటి ..సగటు ఓటరు ని ఆకర్షించే కార్యక్రమాలే తప్ప మరొకటి కాదు.అసలు ఏ మాత్రం ఇంత సాయం చేసినా సగటు తమిళుడు కృతజ్ఞుడు గా ఉంటాడు..అది అక్కడ గాలి లోనే ఉంది.దానికి మూలాలు వెతికితే చాలా ఉంటాయి.వీరారాధన అనేది అక్కడ ఎక్కువ...అది ఈరోజున వచ్చింది కాదు...కొన్ని వందల ఏళ్ళ నేపధ్యం ఉంది దానికి.వారి గొప్ప దనానికి ,చికాకు కలిగించేదానికి అదే కారణం.తెలుగు నేపధ్యం తో పోల్చుకోవడం పిచ్చిదనమే అవుతుంది. జయలలిత ని mgr వదిలి వెళ్ళిన అవశేషంగా చూసే ఆమె కి అంత విలువనిచ్చింది.సరే mgr కి ఇద్దరు భార్యలు పోవడం..మూడవ ఆమె తో ఉండడం ..ఈమె .. నాల్గవ ఆమె గా ఉండడం అవి ఏమీ తమిళులు మనలా పట్టించుకోరు...అదంతా ద్రవిడ కల్చర్ లో ఓ భాగంగానే భావిస్తారు.అది అంతే.చాలా మంది అనుకుంటూ ఉంటారు...బ్రాహ్మణ స్త్రీ అయిన జయలలిత ద్రవిడ ప్రాంత నాయకురాలి లా ఎలా ఎదిగింది అని.దానికి కారణం ఇదే.MGR యొక్క ఎండార్స్మెంటే దానికి కారణం.మన రాష్ట్రం లో మాదిరి గా కులం కి మరీ అంత ప్రాధాన్యత లేదు.తమిళ్ వచ్చి ఉండి ..తమిళ పద్దతులు పాటిస్తే చాలు వారిని సొంతం చేసుకుంటారు తమిళులు.అలా కానట్లయితే రజనీ కాంత్ అక్కడ సూపర్ స్టార్ కాగలడా..?
నిజానికి MGR మళయాళీ నాయర్ వర్గానికి చెందిన వాడు.ఇంచు మించు మన దగ్గర కమ్మ కులం వంటిది అని చెప్పవచ్చు.అలానే కరుణా నిధి యొక్క మూలాలు మన విజయనగరం లో ఉన్నాయి.నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడు గాని ఎప్పుడు తెలుగు వాడినని చెప్పడు..చెపితే అక్కడ ఓట్లు ఎవరూ వేయరు.ఇంకొక గమ్మత్తు ఏమిటంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతం లో రాణించిన వారి లోఅక్కడ బ్రాహ్మణులు ఎంత మంది ఉంటారో బ్రాహ్మణేతరులు కూడా అంత మంది ఉంటారు.
MGR is not Nayar ... He is menon ..... by the way .... what are the similrities you have observed between kamma caste and Nayar caste
ReplyDeleteMenon is also a title bestowed to Nairs.
ReplyDelete