అందరకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.సరే..ఈ పోస్ట్ ని ఇలానే ప్రారంభిస్తాను ఈ రోజున,ఒక్కోసారి ..మన యోచన మనుకున్నా పదిమంది తో కలసి నడచుటయే సబబు.నిజానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం నాకు కొంత అయిష్టమని కాదు గాని అది ఏదో అడ్డుపడుతుంది.ఒక ఆలోచన..లోలోపలిది.ఒక్క సారి గుండ్రంగా సూర్యుని చుట్టి భూమి రావడం తో మనకి ఇక్క డ ...సంబరాలు..ఏడు మారిందని..!ఈ విధంగా ఎన్ని బిలియన్ల సార్లు భూమి ఇలా తిరిగిందో..ఇంకా తిరగనున్నదో....మనం పుట్టి ఇవన్నీ కనిపెడుతున్నాము సరే...అంతకు ముందు ఇవి లేవా..ఉన్న వాటినే అదీ ఇదీ ..అనీ పేర్లు పెట్టుకుంటూ పోతుంటాము.అసలు ఈ విశాల విశ్వం లో ఈ మనిషి జన్మకి.. అర్ధమూ గమ్యమూ ఏమిటో....ఒక్కొక్కరు ఒక్కోటి చెబుతుంటారు.ఆలోచిస్తే ప్రతి కొత్త నిమిషమూ ఒక సెలబ్రేషనే..!ఒక కొత్త రూపమే..కాలము లో నిన్న ,నేడు,రేపు ఇవన్నీ మన కోసం గీసుకున్న గీతలే..కాలము ఒకటే గీత దాని ఆది ఏమిటో,అంతము ఎక్కడో..కాకపోతే ఈ నిమిషమూ మైక్రో రూపము కనక గుర్తించము ఇదీ ఒక కొత్త ఏడాది వంటిదేనని..జీవితము నిరంతరమూ ఒక ఉత్సవమే అనేక రంగుల కలయికతో..!
నేను మీతో ఏకీభవిస్తున్నాను. మన ఉగాదికి మన పబ్బాలకి ఈ ప్రాముఖ్యతనివ్వరు. ఏదో చెప్పినట్టు కుక్కల హడావిడి ఎక్కువ..
ReplyDelete