Friday, March 10, 2017

Ernest Hemingway నవల The Old Man and the Sea సంక్షిప్తంగా (ఏడవ భాగం)


గేలం తాడు ని అలాగే ఎడం చేతి తో పట్టుకొని నీటి లోకి చూస్తుండగా మళ్ళీ లోపల కదిలినట్టు గా తోచింది.ఇంకా అదనంగా ఉన్న తాడు ని నీటి లోపలకి స్థిరంగా పంపుతున్నాడు.ఆ చేప కూడా కంగారు పడకూడదు గా ...అందుకనే అతని చేతి వేళ్ళ సాయం తో తాటి ని వదులుతున్నాడు.

" తిను చేప..బాగా తిను..ఆ ఎరలు గా కట్టిన బుల్లి చేపాల్ని బాగా తిను..ఆ సముద్రం నీటి లో..ఆ చీకటి లో..ఆరువందల అడుగుల లోతున ఉన్నట్లున్నావు.. తాజా గా ఉన్నాయి అవి..మళ్ళీ అటు తిరుగు ఓసారి..అలాగే లాగిస్తుండు.." ముసలాయన అలా బిగ్గరగా  నే మాట్లాడుతున్నాడు.

లోపల నుంచి ఈ సారి ఒక గట్టి ఊపు తగిలింది.బహుశా ఎరల్ని పీక్కొని తిండం లో కష్టం గా ఫీలవుతుందేమో..ఆ గేలపు హుక్ లో ఉండే వాటిని పీక్కొని తినడం అంత ఈజీ కాదు..బాగానే లాగాలి..కాసేపు ఆగినాక చలనం ఆగిపోయింది.

" ఏయ్ చేపా..రా..రా..కాస్త తిరుగు ఇటు..అటేపు టున రకం చేపలు కూడా ఉన్నాయి.వాటిని కూడా వాసన చూడు మరి.సిగ్గుపడకుండా తిను." చేపని ఉద్దేశించి తను అలా మాటాడుతూనేఉన్నాడు.అదే సమయం లో బొటన వేలు,చూపుడు వేలు మధ్య నుంచి గేలపు తాడు ని పట్టుకొని వేచి చూస్తున్నాడు అలానే.మళ్ళీ ఒక చిన్న ఊపు లోపలనుంచి.

" ఆ చేప కి హుక్ బాగా నే తగులుకొని ఉండవచ్చు.దేవుడా..దాన్ని ఆ దిశ గా పోనీ....అది ఎటూ పోకుండా ..ఓ తిరుగులు తిరుగు తోంది.బహుశా అది గతం లో ఏదో గేలానికి చిక్కి బయటపడిన రకం అనుకుంటా.పాత అనుభవాలు గుర్తుకి వస్తున్నాయ్ అనుకుంటా.."
" అంతలోనే తాడు కదిలినట్లు అయింది.కాసేపు బాగా బరువు  ఉన్నట్లు గాను,కాసేపు తక్కువ బరువు ఉన్నట్లు గాను అనిపిస్తోంది.చేతి వేళ్ళ మధ్య నుంచి తాడు ని వదులుతున్నాడు.బాగా ప్రెషర్  పడుతోంది." ఏమి చేపరా  బాబు ఇది , గేలపు హుక్కులు బాగానే గుచ్చుకొని ఉన్నాయేమో. మళ్ళీ ఓసారి రౌండ్ వెయ్యి .  తిరుగులు తిరుగుతున్నావు  లోపట..బరువు బాగా నే ఉన్నట్లుంది."

ఇంకా కొంచెం తాడు వదిలాడు.మంచి గా తిననివ్వాలి.దానికి సౌకర్యం గా ఉండాలి.ఇంకా తాడు ఉంది..భయం లేదు." నువ్వు బాగా తింటేనే ఆ  హుక్ లు బాగా నీ నోటి లోకి పోతాయి.  తిను ఇంకా తిను.. బాగా తిను,అప్పుడు ఈజీ గా పైకి లాగవచ్చు..బయటకి వచ్చినాక నా హార్పున్ తో నీ పని బడతా ..సరేనా ...తయారా..  " ముసలాయన గొణుగుతూ అన్నాడు తాడు ని చేతి నుంచి చేతి కి మార్చుకుంటూ.. !

చేప బరువు అంచనా వేసుకుంటూ ..తనలో తాను మాట్లాడుకుంటూనే ఉన్నాడు.చేప మళ్ళీ కదిలినట్లయింది. వెంటనే తాడు ని లేపలేదు. ఆ తాడు బలం గా నే ఉంది. ఎంత చేపనైన లాగేస్తుంది.  హిస్ స్స్స్ ...అనే శబ్దం రాసాగింది.బలం కొద్దీ తాడుని పట్టుకొని ఉన్నాడు ముసలాయన.పడవ కాసేపటి తర్వత వాయవ్యం వేపు తిరుగసాగింది. కాసేపటికి నీళ్ళ లో కి ఒక శక్తి ప్రవహించింది.ఆ చేప స్థిరం గా లోపలే ప్రయాణం చేస్తోంది.

" ఇప్పుడు కనక ఆ కుర్రవాడు ఉంటే బాగుండును" ముసలాయన అనుకున్నాడు. ఈ చేప ఏదో గాని గట్టి రకం లానే ఉంది.నన్నే తోసినంత పని చేస్తోంది.అయినా నేను వదులుతానా..చేతనైతే దాన్నే ముక్కలు చేయనీ ఈ తాడుని... చిత్రం ఏమిటంటే మరీ లోపలకి పోవడం లేదు.అంత వరకు సంతోషం దేవుడా..!

అదే గనక ఇంకా సమ్ముద్రం లోపలకి పోవాలనుకుంటే తాను చేయగలిగేది ఏమి లేదు.ఆ విధంగా శబ్దాలు చేస్తూ,చస్తే నేను ఏం చేయగలను..కొన్ని పనులు చేయాలిప్పుడు...తాడు ని లోపలకి వదిలాడా దాన్ని గట్టిగా పట్టుకోడానికి తంటాలు పడాల్సి వస్తోంది.పడవ కింద నుంచి ఆ చేప చేసే చికాకు కి ..పడవ కూడా వొంపు తిరిగిపోతోంది.ఆగడం లేదు." ఏమిటి ..ఇది గాని నన్ను చంపుతుందా..?లేదు ..అది జరగని పని" మళ్ళీ తనే సముదాయించుకున్నాడు.

నాలుగు గంటలు గడిచాయి.నీటికి పై భాగం లోనే ఈదుతున్నది..అయితే చేప దాని పూర్తి స్వరూపాన్ని చూపించడం లేదు.పడవ ని వొంపడానికి తెగ ప్రత్నిస్తున్నది..తాడు ని గట్టి గా   తన వీపు కి కట్టుకున్నాడు.

" దాదాపు మధ్యానం అనుకుంటా..ఈ చేప గేలానికి గల హుక్ కి చిక్కుకున్నది గాని  మొహం మాత్రం కనబడనీయట్లేదు.గట్టిదే. ఈ చేప చిక్కడానికి ముందర మాట ..టోపీని నుదురు మీదికి లాక్కొని పెట్టుకున్నాడు.బాగా చెమట పట్టి అది నుదురు మీదికి జారి చిట పట లాడుతోంది.

దాహం గా అనిపించింది.తాడు మీద మోకాలు ఆనించకుండా జాగ్రత్త గా పాకి..పడవ ముందు భాగం లో ఉన్న బాటిల్ ని తీసుకొని కొన్ని నీళ్ళు తాగాడు.అలసట గా అనిపించి అలానే కొద్ది గా ఒరిగాడు..కొద్దిగా రెస్ట్ తీసుకుందామని...పడుకుని అలాగే తల వైపు వెనుక భాగం లో చూశాడు.నేల భాగం అసలు కనబడటం లేదు.ఇంకా రెండు గంటలు గడిస్తే సూర్యుడు కూడా అస్తమిస్తాడు.ఈ లోపులోనే తాను వెళ్ళిపోవాలి.వీలవుతుందో లేదో.పోనీ చంద్రుడు వచ్చే వేళ కైనా బటపడాలి.అదీ వీలు కాకపోతే రేపు పొద్దుట కి కూడా అవుతుందేమో..ఎంతైనా గానీ..నాకైతే బాధ లేదు.ఆ చేప  నోట్లో హుక్ చిక్కుకొని ఉందిగా..అదే నిర్ణయించాలి..నేను వెళ్ళే వేళని..! ఆ వైరు కూడా దాని నోరు ని కట్టేసినట్లు చేసి ఉండవచ్చును..అందుకే గింజుకుంటున్నది...అసలు ఇంతకీ నాకు చిక్కిన ఈ చేప ఎలాంటిదో..అసలు ఓసారి అది నాకు కనిపిస్తే బాగుండును " అనుకున్నాడు ముసలాయన.(సశేషం) 

No comments:

Post a Comment