ముసలాయన పైన ఆకాశం లో చుక్కల్ని చూస్తూనే కింద నీళ్ళ లో ఆ చేప తిరుగుడి ని అంచనా వేస్తూనే ఉన్నాడు.అది దూరంగా వేరే దిక్కు కి వెళ్ళి పోవాలని కూడా ప్రయత్నించడం లేదు.అక్కడక్కడనే తనలాడుతున్నది.చీకటి పడింది,చల్లదనం ఆవరిస్తున్నది..వొంటికి పట్టిన చెమట ఆరిపోతున్నది.పడవ లో ఉన్న ఓ బాక్స్ లో ఎర చేపల్ని దాస్తుంటాడు..దాని మీద ఉన్న వస్త్రం తో పగటి పూట ఒంటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ ఉంటాడు.ఇపుడు దాన్ని తన మెడ చుట్టూ కట్టుకొని ఇంకో కొసని పడవ కి ఒక మూలన కట్టాడు.కాబట్టి ఇపుడు కిందికి వంగి చూస్తున్నా ..కిందికి వెళ్ళే గేలపు తాడుకి కుషన్ లా ఉపయోగపడుతున్నది.పడవ కి ఓ చివరకి వెళ్ళి కిందికి నీళ్ళలోకి చూస్తున్నాడు.హాయిగా నే ఉన్నా..మరో వేపున ఓర్పు కూడా నశిస్తోంది.
లోన ఉన్న చేపని తాను చేయగలిగేది ఏమీ లేదు,అలానే అదీ తనని చేయ గలిగేదీ ఏమీ లేదు.అలాగని ఎంతసేపు ఈ ఎదురు చూపు..!పడవ లోనే నిలబడి లఘు శంక తీర్చుకున్నాడు.పైన ఉన్న చుక్కల్ని చూశాడు.గేలపు తాడు సముద్రపు నీళ్ళ లోకి నిటారు గా ఉంది.ఆ నక్షత్ర కాంతి లో..! కాసేపాగి పడవ కొద్ది గా అటు ఇటు ఊగినట్లుగా కదిలింది.దూరంగా ఎక్కడో హవానా నగరపు విద్యుత్ వెలుగులు మిణుకు మిణుకు మంటు..!ఆ కాంతి కనక కనుమరుగు అయితే పడవ తూర్పు వేపు సాగుతున్నట్లు లెక్క.
ఈ చేప ని చూస్తుంటే కొన్ని గంటలు పాటు ఇలానే ఉండేలా ఉంది.రేడియో గాని ఉంటే ..బేస్ బాల్ ఆట గురుంచి విని వివరాలు తెలుసుకునేవాడు.కాని లేదాయే.అయినా పిచ్చి గాని..నువు నీ పని గురుంచి ఆలోచించు...అవన్నీ ఇపుడు అవసరమా..తనని తాను తిట్టుకున్నాడు ముసలాయన.అంతలో గట్టి గా అరిచాడు" ఈ సమయం లో సాయం చేయడానికి ఆ కుర్రవాడు ఉంటే ఎంత బావుండేది" అని..!
అయినా ముసలితనం లో ఏ మనిషి ఒంటరి గా ఉండకూడదు.కాని తప్పదు మరి.
ఆ..ఇంకొకటి గుర్తుంచుకోవాలి.పొద్దున్నే కాసిన్ని టున రకం చేపల్ని తాను తినాలి.లేకపోతే ఒంట్లో శక్తి ఉండదు.గుర్తుంచుకో..తనకి తనే చెప్పుకున్నాడు.రాత్రి పూట గదా.దేని గొడవ దానిదే..ఈ నీళ్ళ లో కూడా...!రెండు Porpoise చేపలు తన పడవ సమీపం లో సరసాలాడుకుంటున్నాయి.ఆ చప్పుడు..ఆ మగ చేప ,ఆడ చేప చేసే సమాగమ సందడులు తాను గుర్తుపట్టగలడు.హ్మ్..అవీ మనుషులకి తోబుట్టువులు వంటివే..ఆ ఎగిరే చేపలు మాదిరిగా...!
ఒక్క సారిగా నీటి లోపల ఉన్న ఆ పెను చేప గుర్తుకు వచ్చి విచారమనిపించింది. దాని వైఖరి వింత గానే ఉంది.దాని వయసు ఎంతో ఏమో..ఇలాంటి మొండి చేపని ఇంతవరకు చూడలేదు.పైకి ఎగిరి దూకడానికి కూడా ఆలోచిస్తున్నది.తెలివైనదే.. అలా బలంగా ఎగిరి తనని దెబ్బ తీయవచ్చును...అయితే అది అనేక మార్లు గాలాల్లో చిక్కుకొని తప్పించుకున్న రకం కాబోలును..!
ఇక్కడ పడవ మీద ఉన్నది ఒకే ఒక్క మనిషి అని దానికి ఏం తెలుసు...అంతే కాదు ఆ మనిషి ఒక ముసలి వాడు అని కూడా దానికి తెలియదనుకుంటా.తప్పకుండా అది ఒక పెద్ద చేప యే అయి ఉండాలి.మార్కెట్ లోకి పోతే దాని మాంసానికి ఎంత ధర వస్తుందో.. మంచి ధైర్యస్తుని లానే గేలానికి వచ్చి తగులుకుంది.. ఏ మాత్రం తొట్రిల్లకుండా తన పోరాటం కొనసాగిస్తున్నది.దానికి ఇంకా ఏమైనా ఇతర ఆలోచన ఉందా..లేదా నా లాగానే నిరాశ తో అలసిపోయిందా..!
ఎప్పుడో జరిగిన ఒక సంగతి జ్ఞప్తి కి వచ్చింది.ఒక మారు సముద్రం లో ఇలానే వేటకి వచ్చినపుడు ఒక పెద్ద మార్లిన్ చేప చిక్కింది.అది ఓ ఆడ చేప..దానిని పడవ లోకి గుంజడానికి ప్రయత్నించినప్పుడల్లా దాని జత గా ఉన్న మగ చేప దాని బలమైన మొప్పలతో పడవ ని కొడుతూ ప్రతిఘటించింది.తాళ్ళని...హార్పూన్ ని..సర్దుతున్నప్పుడు అంత ఎత్తున ఎగురుతూ ఆడ చేప ని విడిపించడానికి తంటాలు పడింది.మొత్తానికి తాను,ఆ కుర్రవాడు ఇద్దరూ కలిసి చేపని పట్టేసి పడవ లో బందించారు.ఆ మగ చేప పడవ తో అలాగే కొంత దూరం సాగి వచ్చి ఆ తర్వాత ఆగిపోయింది.కుర్ర వానికి గాని తనకి గాని ఆ సన్ని వేశం బాధ గా అనిపించిది..అలా జంట ని విడగొట్టినందుకు గాను మమ్మల్ని క్షమించమని వేడుకొని ఆ తర్వాత దాన్ని ముక్కలుగా తరగడం చేశాము. (సశేషం)
No comments:
Post a Comment