Saturday, March 18, 2017

" Autobiography of a Sadhu" (An Angrez among Naga Babas) పుస్తకం గురించి నాలుగు మాటలు...ఈ పుస్తకం పేరు చూస్తేనే ఈ పాటికి మీకు అర్ధమయి ఉంటుంది.నాగా బాబా గా మారిన ఒక విదేశీయుని గాధ అని.అవును ఈ పుస్తకం మొదటి సారి గా 2005 లో రాండం హౌస్ కి సంబందించిన ప్రచురణకర్తలు Baba: Autobiography of a Blue -Eyed Yogi అనే పేరు తో ముద్రించారు.అలాగే 2010 లో Autobiography of a Sadhu,A Journey into Mystic India అనే పేరు తో మరి యొకరు ముదించారు..ఇదిగో ఇప్పుడు ఈ రూపం లో..అసలు ఏమున్నది దీని లో...అత్యంత క్లిస్టమైన నాగా పరంపర లో ఎందుకు ప్రవేశించాలనుకున్నారు..ఎటువంటి అనుభవాలను పొందారు..ఇది అంతా ఈ 260 కి పైబడిన పేజీల్లో వివరించారు.దీన్ని అంతా ప్రచురించాలంటే తన వద్ద ఉన్న సరంజామా కలిపితే వేల పేజీలకి అయ్యేది గాని చాలా వరకు తగ్గించినట్లు రచయిత చెప్పారు.

అసలు ఈ వ్యక్తి ఎవరు...విలియం గాన్స్ అతని పేరు.బివర్లీ హిల్స్ లో స్థిరపడిన కుటుంబం.తండ్రి వైద్యుడు. అరవై వ దశకం లో యవ్వన ప్రాయం లో ఒక నౌక లో భారత దేశం వచ్చాడు.ఇక్కడి రహస్య అద్యాత్మక అంశాలు అనగా మంత్ర తంత్ర శాస్త్రాలు ఇంకా బయటకి పెద్ద గా తెలియని ప్రాచీన విద్యలు నేర్చుకోవాలని అతని కోరిక.మనం నగ్నంగా కనిపించే నాగా బాబాల్ని మీడియా లో చూసి ..ఓఅహో ఇది ఒక రకమైన శాఖ నా అనుకుంటాము..వదిలివేస్తాము.అయితే ఈ అమెరికన్ మాత్రం తాను నాగా పరంపర లోకి మారి తన జీవితం తో ప్రయోగం చేయదలిచాడు.అంత సులభమా దాని లోకి ప్రవేశించడం.మొదట ఉజ్జయిని  కి వెళుతున్న ఒక సాధువు రైలు స్టేషన్ లో పరిచయం అవుతాడు.కొంత కాలం పాటు అక్కడి కాలభైరవుని ఆలయం దగ్గర లోని వారి ఆశ్రమం లో ఉండి పూజా విధానాల్లో ఫాల్గొంటాడు.అక్కడి గురువు ఒకతను నువ్వు సాధన నేర్చుకోవలసిన గురువు  రాజస్థాన్ లోని అంలోడా లో ఉన్నాడు..వెళ్ళు అని చెప్పి ఓ చీటి రాసి ఇస్తాడు.

దానిని జునా అఖడా అంటారు.దాని అధిపతి హరి పురి బాబా. సామాన్యం గా యుద్ధ విద్య అయిన మల్ల యుద్ధాన్ని సాధన చేసే  స్థలాన్ని అఖడా అంటారు.అయితే వీరి ఆవాసాలు కూడా అఖడాలు గానే పిలుస్తారు.అది ఒక చిన్న ఊరు రాజస్థాన్ లో..అంలోడా..అని.ఆ ఆశ్రమం లో ఏదో ఉత్సవం జరుగుతోంది.అదే సమయానికి ఈ విదేశీయుడు అక్కడకి వస్తాడు..అప్పుడు ఏదో యజ్ఞం జరుగుతోంది.లోపలకి వెళ్ళగానే కొద్ది గా ఎత్తుగా ఉన్న పీఠం మీద హరి పురి బాబా ఇంకా అటు ఇటు ఒకొక్కరు కూర్చొని ఉన్నారు.కొంతమంది నగ్న సాధువులు ..నాగాలు నిలబడి ఉన్నారు.వొంటి నిండా విభూతి ఉంది.వారి శ్నిశ్నాలకి రింగ్ వంటిది తొడగబడి ఉంది.జుట్టు బారెడు పెరిగి అట్టలు కట్టి ఉన్నాయి.అంతా నగ్నంగా లేరు ..హరి పురి బాబా గాని మిగతా కొందరు మోకాలి దాకా వస్త్రాలు ధరించి ఉన్నారు.బహుశా వీళ్ళు కొత్త సాధువులు లా ఉన్నారు.

హరిపురి బాబా కళ్ళు తీక్షణంగా ఉన్నాయి.కాసేపు ఆగి  ఈ విదేశీయుణ్ణి వింత గా చూశారు.తాను పరిచయం గావించుకొని నాగా సాధన లోకి రావాలనేది తన కోరిక అని ఉజ్జయిని సాధువు ఇచ్చిన చీటి ఇస్తాడు.కొద్దిగా నిరాశ పరిచినట్లు గా ముందు మాట్లాడినా ..కొన్ని రోజులు గడిపి చూడు..అప్పటకి సరే అనుకుంటే సన్యాసం తీసుకుందువు గాని అంటాడు హరిపురి బాబా.ఈ మధ్య కాలం లో తనకి నిర్దేశించిన పనులను ఊడవడం,పాత్రలు కడగడం దాకా ఆశ్రమం లో చేస్తూనే పొద్దున్నే మూడున్నర కి లేచి గడ్డ కట్టే చలి లో స్నానం చేసి  అతని జపాలు చేసుకుంటూంటాడు.

ఒక రోజు హరిపురిబాబా ఇతడిని పిలిచి నీకు డీక్ష ఇస్తున్నాను రేపు సిద్ధగా ఉండు అంటాడు.కొన్ని వందల ఏళ్ళ చరిత్ర గల నాగా పరంపర లో తాను ఒక భాగమవుతున్నందుకు సంతోషిస్తాడు.తన కల నెర వేరింది.అందులోను హరిపురి బాబా అంటే దేశ వ్యాప్తం గా ఈ తంత్ర మార్గం లో  ఒక గౌరవం ఉంది.
దీక్ష ఇవ్వడం కూడా ఒక సుదీర్ఘ తంతు..! అయిదుగురు గురువులు ఆ రోజు ఈ పని లోనే ఉన్నారు.ఆశ్రమం లో ధుని వెలుగుతోంది.అది ఎప్పుడు అలా వెలుగుతూనే ఉండాలి.ఆరిపోకూడదు.మంత్రాలు అవీ చదవడం..యజ్ఞ కార్యక్రమం..అంతా అయిన తర్వాత ఒక గురువు రుద్రాక్షలు ఇస్తాడు..ఇంకొకతను లంగోటి ని ప్రదానం చేస్తాడు...కొన్ని పసల బిళ్ళల్ని ఒకతను ఇస్తాడు..ఇలా అయిన తర్వాత హరిపురి బాబా ఈ కొత్త వ్యక్తి పేరు ని రాంపురి గా మారుస్తాడు.ఇక ఈ రోజు తో నీ గత జీవితం తో నీకు సంబంధం లేదు.అని చెప్పి ఒక పచ్చని ద్రవం కొద్ది గా తాగిస్తారు.దాని తో వారి లో ఒకడయినట్లు లెక్క.ఆ తాగినది ఆవు మూత్రం ఇంకా కొన్ని ఉంటాయి లెండి.చెప్పడానికి రావట్లేదు.

ఈ రాంపురి గురువు చెప్పే మంత్రాల్ని రాసుకోవడానికి ప్రయత్నించగా దాని వల్ల ప్రయోజనం లేదు..గురు ముఖతా  నేర్చుకొని ఉచ్చరిస్తే  చాలు..అక్షరాల్లో రాస్తే ఏమీ ఉండదు...ఖాళీ గిన్నెల్లాగా ఉంటాయి అవి.అని చెపుతుంటాడు.శూశ్రుష చేస్తూ గురువు దగ్గర చాలా అంశాలు నేర్చుకుంటాడు.సాధువులు దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ మళ్ళీ ఇక్కడకి వస్తుంటారు. వచ్చే కుంభమేళ లో తనని పూర్తి స్థాయి లో శిష్యుని గా ప్రకటిస్తానని తెలుపుతాడు హరిపురి బాబా.ఈ నాగా సాధువులు లో మొత్తం 50 కి  శాఖలు ఉన్నాయి.వాళ్ళు తమ అదిపతు లతో ..రకరకాల చోట్ల ఆశ్రమాలు ఏర్పరచుకుని ఉంటారు.మొత్తం కలిపి కొన్ని వేల మంది ఉంటారు.వీళ్ళంతా బయటకి వచ్చి ఇదిగో కుంభ మేళ లో కలుసుకుంటారు.వీళ్ళంతా తమ గురువు ల తో రౌండ్ గా పెద్ద ప్రదేశం లో డేరాలు వేసుకొని ఉంటారు.కొత్త గా దీక్ష తీసుకున్న వాళ్ళ పరిచయం కూడా మిగతా వారి తో అవుతుంది.ఫలహారాలు ఉంటాయి.గంజాయి కూడా ధూమ రూపం లో సాగుతుంది.అట్లా ఆ తంతు సాగుతుంది.నువ్వు కుంభ మేళ లో బయటకి ఎక్కువ కనిపించకు..నిన్ను ప్రకటించిన తర్వాత ఆ తర్వాత రా తెలిసిందా అంటాడు హరిపురి బాబా.

కేదార్ పురి అనే ఇంకో సాటి గురు భాయి మేళ లో కలిసి ఒక విందు దగ్గర కూర్చుంటారు.ఈ విదేశీయుడు నాగా బాబా ఎలా అవుతాడు అని గట్టిగా అరుస్తాడు భైరాన్ పురి అనే ఇంకో అఖడా గురువు.. పెద్ద కలకలం రేగుతుంది. భైరాన్ పురి అనుచరులు పెడ  రెక్కలు విరిచి అవతలకి లాగేస్తారు.అంతలో హరిపురి బాబా వచ్చి చెపుతాడు..ఇతడిని నేను ఈరోజు పూర్తి నాగా సాధువు గా నా శిష్యుని గా ప్రకటిస్తాను అని..!భైరాన్ బాబా ససేమిరా ఒప్పుకోడు...విదేశీయులు మన ఈ విద్యా సంపదల్ని కూడా దోచుకోవాలా..ఇప్పటికి దేశాన్ని దోచుకున్నది చాలాదా..అతనికి గోత్రం అనేది ఉన్నదా ..అవసరమైతే యజ్ఞం ఎలా చేయగలడు ... అని అరుస్తాడు.మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు.బాధ పడక..నేను నీకు మాటిచ్చాను..అది చెల్లించి తీరుతా అంటాడు హరిపురి బాబా.మిగతా శిష్యులు అంటారు ..తాత్కాలికంగా భైరన్ బాబా వెళ్ళిపోయినా అతను మీ మీద ఏదైనా ప్రయోగం చేస్తాడేమో..ఎందుకంటే బతికి ఉన్న జీవుల ప్రాణం అవలీలగా  తీసే విద్యలు వచ్చిన అతి తక్కువ మంది లో అతను ఒకడు..మీ జాగ్రత్త లో ఉండి తగిన క్రియలు చేయండి ..అని.కొన్ని రోజులు తర్వాత హరిపురి బాబా...విపరీతమైన అనారోగ్యానికి గురవుతాడు! (మిగతాది తరువాయి భాగం లో) 

No comments:

Post a Comment