Sunday, March 26, 2017

Autobiography of a Sadhu (An Angrez among Naga babas) గురించి నాలుగు మాటలు( రెండవ మరియు చివరి భాగం)




అలా హరి పురి బాబా...ఆసుపత్రి పాలు కావడం జరుగుతుంది.డా.రాతోడ్ అనే అతని ఆసుపత్రి లో చేర్పించడం జరుగుతుంది.ఈ గురువు కి ఇలా జరిగినపుడు రాం పురి బాబా సాధువులకి సహజమైన పర్యటన లో ఉంటాడు.హిమాలయలకి దగ్గర లో ఉన్న ఓ గ్రామం కి దాపు లో గల పాడుబడిన గుడి లో మకాం ఉంటాడు.కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక సాధువు కేదార్ పురి ఇతను ఉండే దగ్గరకి వస్తాడు ఒకరోజు ..హరి పురి బాబా ఆసుపత్రి లో ఉన్న సంగతి తెలపడానికి..!రాం పురి బాబా అచ్చెరువు చెంది అడుగుతాడు..తాను ఉన్న స్థలాన్ని ఇంత కరెక్ట్ గా ఎలా తెలుసుకోగలిగావు అని.అతను నవ్వి..ఇది ఒక రకమైన టెలిగ్రాం లాంటిది లే అని దాట వేస్తాడు.

ఆ పిమ్మట గురువు అయిన హరి పురి బాబా కి ఆసుపత్రి లో సేవలు చేస్తాడు.మొత్తానికి ఆరోగ్యం బాగు అవుతుంది.మృత్యుంజయ మంత్రం ని పఠించే విధానం ఇంకా ఇతర శారీరక పరమైన సంగతులు అంటే నాడులు ఏ విధంగా పనిచేస్తాయి...అతీంద్రియ జ్ఞానం ..ఇలాంటి విష్యాలు వంటివి రాం పురి బాబా కి తెలుపుతుంటాడు. తాను తాత్కాలికంగా బతికినప్పటకి అతి త్వరలోనే మరణిస్తానని కనక ఒక విగ్రహం తన రూపుది తయారు చేయించమని చెపుతాడు.అక్కడనుంచి తాను జవాబు ఇస్తానని తెలుపుతాడు.ఆ విధంగానే చేస్తారు.

ఉజ్జయిని,వారణాసి ఈ రెండు ప్రాచీన పట్టణాలకి ఉన్న ఘనత ఏమిటంటే అత్యంత పురాతన కాలం నుంచి ఇప్పటి దాకా మనుషులు నిరాటంకం గా నివసించడం.సాధారణంగా కొన్ని కాలాల్లో వెలిగిన ప్రాంతాలు  ఇంకొన్ని సమయాల్లో బోసిపొయి ఉంటాయి.కాని ఈ రెండు ప్రాంతాలు దానికి భిన్నం.ఇప్పటికీ అక్కడ కొన్ని వందల ఏళ్ళనుంచి కొనసాగిన యోగ  పరంపర వల్ల వారి శక్తి ప్రకంపనలు అవిచ్చిన్నంగా పనిచేస్తున్నాయి.

హరి పురి బాబా కి ఇంగ్లీష్ వచ్చును కాబట్టి కొంత సులువు అయింది రాం పురి బాబా కి.అనేక విషయాల్లో.అయితే సాధ్యమైనంత హింది ని సంస్కృతాన్ని నేర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాడు.స్పానిష్,ఇటాలియన్,ఫ్రెంచ్ భాషల్లో కూడా హరిపురి బాబా కి వ్యవహార జ్ఞానం ఉంది.అది ఆశ్చర్యపరిచింది రాం పురి ని.కాకులు అతనికి మంచి మిత్రులు.ఆయన వాటి భాష లో పిలువగానే వాలిపోతుంటాయి.వాటికి గింజలూ అవీ వేస్తుంటాడు ఆయన.పేరు కి సాధువు అయినప్పటికి హరి పురి బాబా కి స్థానిక రాచ కుటుంబాల్లో మంచి గౌరవం ఉంది.అలాగే రాజకీయుల లో కూడా.ఆయన ఆసుపత్రి నుంచి తిరిగి రావడం తో ఇలాంటి వారంతా ఆశ్రమం కి చేరుకొని ప్రణమిల్లి క్షేమ సమాచారాలు కనుక్కోవడం జరిగింది.

గంజాయి అనేది వారి దైనందిన జీవనం లో ఓ భాగం.సాధువులు కలుసుకున్నప్పుడు కూడా ఇది ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.గురువు కి కూడా పర్యటన కి వెళ్ళి వచ్చిన తర్వాత చెల్లించుకోవడం కనబడుతుంది.కొన్ని రోజులు తవాత హరి పురి బాబా మరణించడం జరుగుతుంది.ఆయన శిష్యులు అంతా    ఒక రాత్రి ఓ ఇంటి లో ఉంటారు...అప్పుడు రాం పురి బాబా ఆయన సమాధి దగ్గరకి వెళ్ళి నమస్కరించబోగా ఉన్నట్లుండి ఆ రాత్రి లో ఒక మెరుపు మెరుస్తుంది..ఆ మెరుపు వెలుగు లో హరి పురి బాబా ఒక పీఠం మీద కూర్చొని కనబడతాడు.ఆయన ఆత్మ అలా కనబడుతుంది.అనేక భావాలు అతని లో ఉన్నట్లుగా రాంపురి బాబా కి గోచరమవుతాయి.అంత లోనే ఇంకో సాధు ఈయన్ని పిలువగానే ఆ ఆత్మ మాయమవుతుంది.నిరాశ పడతాడు రాంపురి బాబా.ఆయన ఏమైనా చెప్పేవాడేమోనని అనుకుంటాడు.

హరి పురి బాబా మరణించినతరువాత రాం పురి బాబా దేశాటనం చేస్తానికి మొదలుపెడతాడు. దక్షిణం నుంచి హిమాలాయాల దాకా అటు అస్సాం లోని ఆలయాల దాకా తాంత్రికుల తో కలిసి మరియు ఒంటరి గా పర్యటనలు చేస్తాడు.అయినా తాను నేర్చుకోవలసినంత నేర్చుకోలేదని ఒక యోచన ఆయన లో ఉంటుంది.పేట్రిక్ బాబా అని ఇంకో సాధు కలుస్తాడు.ఆయన పక్క గుహ లో కొంత కాలం ఉంటాడు.అడవుల్లో,తుప్ప ల్లో ,చలి లో ఎండ లో,దొరికీ దొరకని తిండి తో ఇంత ప్రయాసలు ఎందుకని ఇతను పడుతున్నాడు అని మనకే అక్కడక్కడ అనిపిస్తుంది.దేనిని తెలుసుకోవాలంటే దానికి తగినట్లు గా ఉండాలిగదా మరి.

పుస్తకం ముగిసేనాటికి అర్ధం అయ్యేదేమిటంటే ఒక తంతు జరుగుతున్నప్పుడు హఠాత్తు గా హరిపురి బాబా ఆత్మ ఈ రాం పురి లో ప్రవేశిస్తుంది.దీన్ని కేదార్ బాబా గుర్తించి చెప్పుతాడు...అప్పుడు అర్ధ రాత్రి ....ఆ అడవి లో చీకటి లో తనలో రకరకాలు గా తిట్టుకుంటూ ..వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు.ఆ విధంగా ....పుస్తకం ముగిసిపోతుంది. ఒక సినిమా లా అనిపించుతుంది.చదివిన తర్వాత.రచయిత చెప్పే విధానం కడు సులభం గా ఉండటం వల్ల వేగంగా ముందుకి సాగుతాము.

ఈయన ఫోటో ని ఈ పుస్తకం లో చూసిన తర్వాత జ్ఞాపకం వచ్చింది.బహుశా 1993 ప్రాంతం లో అనుకుంటా నెల గుర్తు లేదు.. ఈ విదేశీ యోగి ని నేను కలిశాను ఒక నది లో స్నానం చేసి ఆలయ ప్రాంగణం లోకి వచ్చినప్పుడు.ఏ ప్రాంతం నుంచి వచ్చారు ..పేరేమిటి అని అడగ్గా ..తను జర్మన్ అని చెప్పినట్లు బాగా గుర్తు. ఆ సమయం లో ఒక డైలీ లో నేను విలేకరి గా ఉండటం వల్ల ఆ ఇంటర్వ్యూ కూడా ప్రింట్ లో వచ్చింది.ఏమో ఎవరు ఎందుకు కలుస్తారో మనం చెప్పలేము.అసలు ఈ పుస్తకం నేను చదవాలని అనుకోడానికి కారణం ఏమిటంటే "పురి" సాధు పరంపర గురుంచి తెలుసుకోవాలని...తోతాపురి గురుంచి రామకృష్ణ పరమహంస  జీవిత కధ లో అప్పటకే చదివి ఉన్నాను.

నీకు ఈ పుస్తకం ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే ఫరవాలేదు అనే అంటాను.కాని ఒకటి...ఈ పుస్తకం లోనే ఓ చోట అన్నట్లు తూర్పు ,పశ్చిమం  ..ఇద్దరి ఆలోచనా విధానం వేరు.కంటికి అగుపించే ప్రపంచాన్ని హేతువు ద్వారా తెలుసుకోవచ్చును.అక్కడ  ఎలా ఒక  Explorer గా ఉన్నావో ..అదే విధానం ఇలాంటి అభౌతిక అంశాల్ని శోధించడానికి అవలంబిస్తే విజయం దొరకదు.దేని పనిముట్లు దానివే.

No comments:

Post a Comment