" ఆ కుర్రవాడు ఉన్నట్లయితే బాగుండు" గట్టిగానే అన్నాడు ముసలాయన.ఆ తర్వాత మెల్లగా వెళ్ళి పడవ ఒంపు భాగం లో కూర్చున్నాడు.అతని భుజం మీద నుంచి ఆ గేలపు తాడు సముద్రం లోకి వేలాడుతున్నది.లోపల ఆ చేప చేసే అలజడి అర్ధమవుతూనే ఉంది.ఏదైనా కానిమ్మని స్థిరంగా అలాగే భుజం మీద ఉంచుకున్నాడు దాన్ని.
ఆ చేపని ఎలగైనా బయటకి వచ్చేలా ఏదో ఒకటి చేయాలి.అన్ని మోసాలకి,బంధనాలకి దూరంగా ఎక్కడో ఆ సముద్రపు నీళ్ళ లోతు లో ఉండాలని అనుకుంటున్నదది.ఇప్పుడు ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది.ఇద్దరకీ తోడు వచ్చే వా ళ్ళు ఎవరూ లేరు.బహుశా ఈ వృత్తికి నేను పనికి రానా..లేదు..లేదు...ఈ జన్మకి నేను చేయగలిగే పని ఇదే.కాసేపు ఆగు ఆ టున రకం చేప మాంసం తినాలి.అది గుర్తు పెట్టుకోవాలి.
కత్తి తీసుకొని మిగతా గేలపు తాళ్ళ ని కోయడం మొదలుపెట్టాడు.ఈ మిగులు అంతా కలిపి పెద్దవి గా చేసి పెట్టుకోవాలి.అవసరం పడితే పడవచ్చు.మొత్తానికి ఒక ఆరు తాళ్ళ ని రిజర్వ్ లో పెట్టుకున్నాడు.వీటన్నిటినీ ఉపయోగించి ఇంకో చేపని పట్టానే అనుకో...చ..ఇప్పుడు పడిన చేప తోనే సతమతం అవుతుంటే మళ్ళీ అదొకటా...అసలు ఇది మార్లిన్ రకమో,బ్రాడ్ బిల్ల్ రకమో,షార్క్ నో ..ఎవరకి తెలుసు..ముదు దీని పని కానివ్వాలి..! అలా అనుకుంటున్నాడు ముసలాయన.
"ఆ కుర్రవాడు ఉన్నట్లయితే బాగుండు" మళ్ళీ గట్టిగా అరిచాడు అతను.పిచ్చిగాని ఆ కుర్రాడు ఇప్పుడెలా వస్తాడు.ఏదైనా తాను ఒక్కడినే చేసుకోవాలి.రిజర్వ్ లో ఉన్న రెండు తాళ్ళని హుక్ కి తగిలించాడు.ఒక్కసారిగా చేప గట్టిగా విదిలించింది.దాని ప్రభావం గేలపు తాడు మీద పడి...సర్ మని బలం గా రాసుకొని మొకానికి కింద బలం గా తగిలి కంటి కింద కోసుకున్నట్లయి రక్తం కారింది..గాయం..కాసేపటికి గాయం ఎండినట్లయింది.
పడవ వొంపు లోనే ..అక్కడున్న చెక్క మీద విశ్రాంతి తీసుకుంటున్నట్లు గా ఒరిగాడు.అతని భుజం మీద గేలపు తాడు ని భద్రం గా పట్టుకున్నాడు.ఈ సారి మళ్ళీ కింది నుంచి బలమైన కుదుపు వచ్చింది.పడవ కదిలినట్లయింది.ఇలా ఎందుకు జరుగుతోంది..బహుశా ఆ గేలపు తాడు కి ఉన్న వైరు దాని వంటిని బలం గా చుట్టుకొని ఉంటుంది.దాని పరిస్థితి నా పరిస్థితి కన్నా మెరుగు లా ఉన్నదా ...ఏమో..!అయితే పడవ ని ఎత్తేయడం దాని వల్ల కాదులే..!అది ఎంత పెద్దదైనా గాని ,నా దగ్గరున్న మిగులు తాడు తో దాన్ని అదుపు చేయగలను.
" ఏయ్ ..చేపా..గుర్తుపెట్టుకో...నేను చచ్చేంతవరకు నిన్ను వదలను" గట్టిగా అరిచి చెప్పాడు ముసలాయన.
ఎక్కడికి పోతుంది..అదీ నాతోనే ఉంటుంది...వాతావరణం చల్లగా ఉంది.సూర్యుడు ఇంకా పైకి రాలేదు.ఎంతసేపు అయితే అంత సేపు ఉంటా.అతని కుడి భుజం మీద ఉన్న గేలపు తాడు సముద్రం లోకి ఉన్నది..ఆ చేపని పట్టుకొని.ఉత్తరం వేపు కదులుతున్నట్లు ఉన్నదే అనుకున్నాడు.ఆ చేప ప్రవాహం తో పాటే కదులుతున్నది.అలసి ఉన్నదేమో.కాసేపు ఆగి చూస్తే తాడు కొద్ది గా ఒంగినట్లు కనిపించింది నీటి మీద.అంటే పైపైనే ఈదుతునట్లు ఉన్నది.అయితే దూకడం గాని చేస్తుందా...చేయక పోవచ్చు. సరే ..కానీ..దేవుడా ..దూకితే దూకనీ ...నా దగ్గర కావలసినంత తాడు ఉంది..అదుపు చేయగలను ...అనుకున్నాడు.
చేప మీద ఒత్తిడి పెంచితే ఎలా ఉంటుందో...అయితే మరీ పెద్ద గా ఊపితే ..దాని గాయం ఎక్కువై బయటకి దూకి నన్ను తోసివేయవచ్చు... సరే పొద్దు గడుస్తున్నకొద్దీనాకు అనుకూలం గానే ఉంటుంది లే...నీళ్ళ మీద తెట్టు లా ఉంది పసుపు పచ్చని పదార్థం..ఆ Gulf weed రాత్రి పూట మెరిసినట్లు కాపడుతుంది.
" ఏయ్..చేప ..నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమ ఇంకా గౌరవమూనూ..అయితే ఈ రోజు ముగిసేలో గా నిన్ను వేటాడి తీరుతాను.."
ఇంతలోనే ఓ పక్షి ఎగురుకుంటూ ...బహుశా ఉత్తర దిక్కు నుంచి ..వచ్చింది.చాలా కొద్ది ఎత్తు లోనే ఎగురుతున్నది.అదీ అలిసినట్టే ఉంది. పడవ కి ఓ చివరన కాసేపు కూర్చున్నది అది..మళ్ళీ ఏమి అనుకుందో...ముసలాయన తల దగ్గరకంటా ఎగురుతూ వచ్చి..పోయి..పొయి..ఆ గేలపు తాటి మీద వాలింది.అక్కడ హాయిగా ఉందేమో.
" ఏయ్..పిట్టా..నీ వయసు ఎంత..ఇదే నీ మొదట ప్రయాణమా ఏమిటి.." అడిగాడు ముసలాయన.ఏదో అర్ధమైనట్లు గా ఆ ముసలాయనకేసి చూసింది ఆ పిట్ట.ఆ తాడు ని అలాగే ఒడిసి పట్టుకుని కూర్చున్నాడా..ఇంకా దేన్ని పరీక్షించే ఓపిక లేదతనికి. ..అసలు ఈ పిట్టలన్నీ ఇలా ఎందుకు వస్తుంటాయో ...ఏ గద్దలు వంటివో వస్తే నీ పని హుళక్కే లే..నీకు చెప్పినా అర్ధం కాదు..కాలం గడుస్తుంటే నీకు తెలుస్తుందిలే.కాసేపు విశ్రాంతి తీసుకో ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికిపో...లేకపోతే ఓ పని చెయ్..నా ఇంటికి వచ్చి అక్కడే ఉండిపో...నీ ఇష్టమైతేనే లే....అయితే ఒకటి ఈ పడవ మీద నేను నిన్ను తీసుకు పోలేను..ఇక్కడ మరో మిత్రుడి తో పని లో ఉన్నాను " అలా ఆ పిట్ట తో పిచ్చాపాటి మాట్లాడ్తున్నాడు ముసలాయన.
ఉన్నట్లుండి ఆ చేప మళ్ళీ ఓ కుదుపు ఇచ్చింది..గట్టి గా పట్టుకోకపోయినట్లయితే ముందుకి పడేవాడే.కుడి చేత్ తో ఆ తాడు ని పట్టుకొని ఉన్నాడా..దాని ఊపు కి చేయికి గాయమై రక్తం కారింది.మొత్తానికి దానికీ లోపల ఏదో అయి ఉంటుంది.తాడు ని బాగా చూసి చేప కదలిక కోసం కిందికి చూడడానికి ప్రయత్నించాడు.ఆ తర్వాత...ఆ తాడు నే పట్టుకొని వెనక్కి విశ్రాంతి కోసమా అన్నట్లు ఒరిగాడు.చూడబోతే నా స్థితి నీది ఒకేలా ఉందే అనుకున్నాడు.
పక్షి ఉందా అని పైకి చూశాడు.తనకి తోడు అదేగా..ఇప్పుడు.అది కనిపించలా..!ఎగిరిపోయింది..ఏదైనా ఆ తీరం చేరేదాకా నీ ప్రయాణమూ కష్టమైనదేలే.. చ..ఈ పిట్ట ధ్యాస లో పడి చేప విషయం లో ఏమారుపాటు గా ఉన్నానేమిటి..ఈ చేప కుదుపుడు కి ఎలా గాయం అయిందో చూడు...లేదు ఇక మీదట నా పని మీద నే దృష్టి పెట్టాలి.ఇంకొకటి ఆ టున రకం చేప మాంసం కొద్ది గా తినాలి..లేకుంటే సత్తువ ఉండదు..ఇలా సాగుతున్నాయి ఆలోచనలు అతనిలో..!(సశేషం)
No comments:
Post a Comment