Friday, April 14, 2017

Ernest Hemingway నవల The Old Man and the Sea సంక్షిప్తంగా (పదవ భాగం)...



ఆ గేలపు తాడు ఉంది కదా..కింద నీళ్ళ లో చేప ని పట్టుకుని ఉన్నది..దాన్ని తన ఎడమ భుజం మీదికి మార్చుకున్నాడు ముసలాయన.సముద్రపు నీళ్ళ లోకి వొంగి చేతిని కడుక్కున్నాడు.చేతిని అలాగే నీటి లో ఉంచాడు.ఆ చేతికి అయిన గాయం..దాని వల్ల అయిన రక్తపు చారికలు ..వాటినే చూస్తున్నాడు.పడవ ఇంకా నీళ్ళు మెల్లగా కదులుతున్నాయి.

ఇపుడు ఆ చేప కాస్త శాంతం గా ఉంది 'అనుకున్నాడు.చేతిని అలాగే నీళ్ళ లో ఉంచాలనిపించింది.అయితే ఆ మాయదారి చేపని నమ్మడానికి లేదు.ఉన్నట్లుండి మళ్ళీ ఓ పెద్ద కుదుపు ఇస్తే...! చేతిని సూర్యుని కాంతికి అడ్డంగా పెట్టాడు..ఆకాశం  వేపు కి  చూస్తూ..! కాసేపటి క్రితమే గదా..లోపలనుంచి ఆ చేప ఇచ్చిన కుదుపు కి ఎడమ చేతికి గాయం అయింది.దీన్ని జాగ్రత్త గా చూసుకోవాలి.దీని తోనే గా తాను పనిచేయవలసింది.

ఇప్పుడు ..చేతి గాయం కొంత ఆరింది.తాను తీసుకొచ్చిన ఆ చేపల్ని తీసి కొసుకుని తినాలనిపించింది.మోకాళ్ళ మీద వంగి తాళ్ళ చుట్టల కింద ఉన్న చేపల్లోనుంచి ఒకటి లాగాడు.దాన్ని ఆరు ముక్కలుగా కోశాడు కత్తి తో.ఆ తర్వాత కత్తి ని తన పంట్లాము కేసి తుడుసుకున్నాడు.మాంసాన్ని చక్కగా తీసి వాటి అస్థికల్ని సముద్రం లో పారేశాడు.మొత్తం అంతా తినగలనా లేదా అనుకుంటూనే ఓ ముక్కని కత్తి తో గుచ్చి తీసుకున్నాడు.భుజం మీద ఉన్న తాడు ..మరో వేపు చికాకుగా అనిపించింది.

తన గాయపడ్డ చేతి కేసి చూస్తూ అన్నాడు...ఇలా చికాకు చేస్తే ఒరిగేది ఏమీ ఉండదు.ఆ..ఏమి చెయ్యి రా బాబు..అని..!నీళ్ళ లోకి చూశాడు..తాడు ఒంపు గా కదిలింది..సరే...కోసిన ఈ చేప ముక్క ని తిను..బలం వస్తుంది..ముఖ్యంగా చేతికి.నీ తప్పు ఏం లేదు..చాలాసేపు ఉండాలిగా ఈ పని మీద .. అలా తనలో మాట్లాడుకుంటూనే ఉన్నాడు.ఒక ముక్క ని నోట్లో వేసుకున్నాడు..చిన్నగా నమిలాడు.ఫర్వాలేదు అనిపించింది.ఇంకా బాగా తినాలి.లోపలికి అంటా ఇంకాలి.ఉప్పు గాని,నిమ్మ తొన గాని ఉంటే మరీ బాగుండేది.

" ఏయ్ ఓ నా చెయ్యి...ఇదంతా నీకోసమే..నీకు శక్తి చేకూర్చడానికే.." అన్నాడు.చెయ్యి కొద్దిగా బిగుసుకున్నట్లు అయింది.మిగతా చేప ముక్కల్ని కూడా తినేశాడు.దాని చర్మాన్ని,పనికి రాని వాటిని నీళ్ళ లోకి ఊసేశాడు.ఇది బాగా రక్తం పట్టిన చేప.డాల్ఫిన్ బదులు ఇది దొరికింది.అదే మంచిదయింది.బలానికి చాలా మంచిది.కాస్తా ఉప్పూ అదీ ఉంటే భలే ఉండేది. మిగతా వి అలా ఉండనీ..ఎణ్దిపోతాయో,కుళ్ళిపోతాయో వాటి ఇష్టం.నాకయితే ఆకలి తీరింది.సముద్రం లోపలి చేప అది శబ్దం చేయడం లేదు.ఇంకొంచెం తింటే..!

" ఏయ్..నా చెయ్యి...మంచి గా ఉండు,నీ కోసమే ఇదంతా తినేది.."తన గాయపడ్డ చేతికి మళ్ళీ చెప్పాడు.ఎలాగో మొత్తానికి అన్ని ముక్కలు లాగించాడు.మంచి గా సదురుకుని చెయ్యిని పట్లాం కి తుడుచుకున్నాడు.ఆ..సరేలే..కాసేపు కుడి చేతి తో తాడుని పట్టుకొని సంభాళించుతాను.గాయపడ్డ ఎడమ చెయ్యి..కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో అనునయించుకున్నాడు.

ఎడమ కాలిని బలమైఅన గేలపు తాటి మీద ఆంచి పెట్టాడు.వెనక్కి ఒరిగాడు..! " దేవుడే సాయం చేయాలి.ఇలాంటి సమయంలో..!ఈ సముద్రం లోని ఆ చేప తనని ఏమి చేయబోతున్నదో.."

ఇప్పటికైతే శబ్దం లేదు.దాని ప్రణాళిక ఏమిటో...దానిది సరే అసలు తన ప్రణాళిక ఏమిటి..అదా దాని సైజు ని బట్టి ఉంటుంది.ఈసారి గాని అది గాలి లో ఎగిరిందా..దానిని చంపుతా.. లోపలే ఉండి పితలాటకం చేస్తొంది.సరే దానితో పాటు నేనూ వేచి ఉంటా. అలా యోచిస్తున్నాడు ముసలాయన.గాయం అయిన చేతిని పంట్లాం కేసి రుద్దుకున్నాడు.ముడుచుకుని వేళ్ళు పెగలను అంటున్నట్లు గట్టి గా అయిపోయాయి.తెరవాలని ప్రయత్నించి..సరే ఇప్పుడు కాదు ఇంకా సూర్యుడు పైకి రానీ అప్పుడు చూద్దాము అనుకున్నాడు.తిన్నది కూడా లోపల అరగాలిగదా ...అప్పుడు ఆ వేళ్ళని నేనే విడదీస్తా..ఎందుకు ..బలవంతంగా ఇప్పుడు..కాసేపు గానీ..దాని అంతట అదే జరగనీ..!

ఒక్కసారి సముద్రం మీదు గా చూశాడు.ఎంత ఒంటరి గా ఉన్నాను అనిపించింది.నీళ్ళు మిల మిల లాడుతూ ఉన్నాయి.వింత నిశ్శబ్దం అంతటా..!పైకి చూస్తే ఆకాశం లో తెల్లని మేఘాలు..ఉన్నట్లుండి..ఒక అడవి బాతుల గుంపు ఎగురుకుంటూ వచ్చింది.అంతలోనే కనపడలేదు.మళ్ళీ కాసేపు ఆగి కనబడ్డాయి.సముద్రం మీద ఎప్పుడూ ఒంటరిగా ఉండము..ఏదో ఒక జీవ రాశి ఏ వైపు నుంచో కనబడుతూనే ఉంటుంది.ఇది అంతా హారికేన్లు వచ్చే కాలం.సముద్రం వాటి జాడని ముందు గానే తెలియజేస్తుంది.అయితే నేల మీద వేరు.ఆకాశం లో ఇప్పుడు తెల్లని మేఘాలు..ఐస్ క్రీం ల్లాగా!సెప్టెంబర్ ఆకాశం..చాలా బాగుంది.

నాకైతే వాతావరణం అనుకూలం గానే ఉంది.ఆ చేపకి మాత్రం కష్టమే 'అనుకున్నాడు.బిగుసుకుపొయిన వేళ్ళని వదులు చేయడానికి ప్రయత్నించాడు.శరీరం లోని ఓ భాగం మొరాయిస్తే మహా హింస గా ఉంటుంది.అదీ ఓ మోసమే..మనిషి ఒక్కడే ఉన్నప్పుడు మరీ బాధ గా ఉంటుంది.ఆ కుర్రాడు ఉంటే ఈ చెయ్యిని రుద్ది మంచిగా చేసేవాడు.ఉన్నట్లుండి..ఓ కుదుపు ..లా తోచింది.లోపలి చేప పైకి వస్తున్న భావం కలిగింది.

..ఆ..అదిగో...బయటకి వచ్చేసింది అది..ఏయ్ నా చెయ్యి.. సర్దుకో..ఇక ..సిద్దం గా ఉండు!" అరిచాడు ముసలాయన.సముద్రపు నీళ్ళని చీల్చుకుంటూ ఆ చేప పైకి లేస్తూ ఉంటే నీళ్ళు దానికి ఇరువేపులా జాలువారుతున్నాయి.మామూలుది కాదు.చాలా పెద్ద చేప ఇది.తన పడవ కంటే ఇంకా రెండు అడుగులు పొడవుగానే ఉంది.దాని ఒంటి మీద చారలు..ఓహో దాని అందం...సూర్య కాంతి తగిలి మరింత భాసించింది.నీటిలోనుంచి బయటకి వచ్చి తన విశ్వరూపం చూపించింది.దాని తోక చూస్తే కొడవలి కి ఉన్న చురుకుదనం ఉంది.మొప్పలు కూడా కత్తులకి ఏ మాత్రం తీసిపోవు.మళ్ళీ లోపలకి వెళ్ళిపోంది ఆ చేప.(సశేషం) 

No comments:

Post a Comment