Tuesday, April 18, 2017

Ernest Hemingway నవల The Old man and the Sea సంక్షిప్తంగా...(పదకొండవ భాగం)



గేలపు తాడు స్థిరంగా,మెల్లగా ఇంకా నీళ్ళ లోకి దిగుతున్నది.చేప లోపల బెదురుతున్నట్లు తోచడం లేదు.ముసలాయన తన రెండు చేతుల తో చేతనైనంత మేరకు తాడు ని సంభాళించుతున్నాడు.చాతుర్యం తో దాని పై వత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నాడు.మరీ ఒకేసారి తీవ్రంగా వెళ్ళినా దాని తాకిడిని తట్టుకోవడం కష్టం.తాడు తెగే అవకాశమూ ఉంది.

అది చాలా పెద్ద చేప.దాన్ని అనునయిస్తూ పట్టాలి.దాని బలం ఏమిటో దానికి తెలియకుండా చేసి బందించాలి అంతే..!అది గాని తాడో పేడో అని పైకి లెగిస్తే తట్టుకోవడం ఎవరి తరం..?నేనే గనక ఆ చేప స్థానం లో ఉంటే నాశక్తిని అంతటిని ఇప్పుడే ఉపయోగించేవాడిని.దేవుడా..కృతజ్ఞతలు.మా మనుషులకి ఇచ్చినన్ని తెలివితేటలు వాటికి ఇవ్వనందుకు..!

ముసలాయన ఇలాంటి పెద్ద చేపల్ని చూడని వాడేమీ కాదు.ఇంతకన్నా బరువు ఉన్న చేపల్ని సైతం పట్టిన రోజులు ఉన్నాయి.అయితే కూడా ఎవరో ఒకరు ఉండేవారు.ఇప్పుడేమో ఒంటరి గా ఉన్నాడు.కనుచూపు మేర లో భూమి కూడా కానరావడం లేదు.తన ఎడం చేతి వేళ్ళు ఇంకా మొరాయిస్తూనే ఉన్నాయి.ఇది గనక సర్దుకుంటే ,కుడి చేతికి ఆసరా గా ఉంటుంది.ఆ చేప,ఈ రెండు చేతులు తోబుట్టువులు వంటివి.ఏదీ మొరాయించడానికి లేదు.అంతే.

చేప కదలిక తగ్గింది.అయితే ఎందుకని ఇందాక అంత ఎత్తు ఎగిరింది..దాని రూపం చూపెట్టడానికా..?అయితే నా సంగతి ఏమిటో నేనూ చూపించాలి.గాయపడ్డ నా ఎడం చేతిని అది చూసి ఉంటుందా..? నేనే ఆ చేపని అయితే తీరు వేరు గా ఉండేది.ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏమిటి...నా ఆత్మశక్తి ఇంకా నా తెలివితేటలు..!

అలా యోచిస్తూ పడమ మీద ఉన్న చెక్కబల్ల మీద స్థిమితం గా కూర్చున్నాడు.ఓ వేపు శరీరం పెట్టే బాధని సహించుకుంటూనే..!...కింద చేప మళ్ళీ కదులుతున్న అనుభూతి కలుగుతున్నది.మెల్లగా ..పడవ కూడా కదులుతున్నది. తూర్పు నుంచి వీస్తున్న పవనాలు సముద్రం యొక్క అలల్ని కొద్దిగా పైకి లేపుతున్నాయి.

సరే..మధ్యానం కల్లా..ఎడమ చేతి వేళ్ళు కరుణించాయి.తెరుచుకున్నాయి ఎట్టకేలకు.హాయిగా తోచింది.ఓ చేప ..ఇహ నీకు ఇది దుర్వార్త యే సుమా అంటూ అరిచాడు.అలా అంటూనే తడుని భుజాల మీదినుంచి అనువు గా  జరుపుకున్నాడు.ఆ..ఇప్పుడు..బాగుంది.అయితే ఎడమ చెయ్యి నొప్పి అలానే ఉంది.దాని పట్టించుకోదలుచుకోలేదు.

నాకు మామూలు గా అయితే పెద్ద గా భక్తి అది లేదులే గాని..ఇపుడు చిన్న ప్రార్ధన చేసుకోవడం మేలు అనుకున్నాడు.రెండు రకాల ప్రార్ధనలు వచ్చు.అయితే అవి గుర్తుకు రాలేదు.ఒక వేగం తో ఉచ్చరించడం మొదలెట్టగానే అప్రయత్నంగా మిగతా ప్రార్ధన అంతా నోటికి రావడం ఆరంభమయింది." ఓ మేరీమాత ..ప్రభువు ని మా అందరి నిమిత్తము నీ గర్భములో   మోసిన తల్లీ ..నీవు స్త్రీలందరిలో అతి శ్రేష్టురాలవు.ఈ మృత్యు ఘడియల లో నిన్ను ప్రార్దించుచున్నాను. నన్ను సమ్రక్షించు..ఆ చేప ని మర్దించు.."
చివరి లో ఆ చేప విషయం చేర్చడం మంచిదని అలా చెప్పాడు.ఆ ప్రార్ధన చేసుకున్నాక మనసు కి హాయిగా తోచింది.అయితే శరీరం యొక్క బాధ అలానే ఉంది.కొద్దిగా పెరిగినట్లుగా కూడా అనిపించింది.పడవ చివరకి వెళ్ళి ఆ వొంపు మీద ఒరిగాడు.చక్కగా వచ్చేశాయి గదా ఎడమ చేతి వేళ్ళు..పనిచేస్తాయా లేదా అని చూసుకున్నాడు.గాలి ఓ వేపు వీస్తూనే ఉన్నా మరో వేపు ఎండ కూడా బాగానే ఉంది.

ఈ చేప ..రాత్రికి కూడా ఇలానే ఉంటే ..తానూ జాగారం చేయాలిసిందే.బాటిల్ లో నీళ్ళు దగ్గర పడుతున్నాయి.ఇంకో చిన్న చేపని అయినా తినాలిసిందే..లేకపోతే బలం ఉండదు.ఇప్పుడు చేప ఏమోగాని డాల్ఫిన్ మాత్రం దొరకవచ్చు.ఓ భాగాన్ని నరికి కొంత తింటాను.ఆ ఎగిరే చేపలు కనిపిస్తే బాగుండు..వాటిని కట్ చేయకుండానే తినేయవచ్చు.వాటిని పచ్చిగా తిన్నా బాగానే ఉంటాయి.సరే..ముందు శక్తిని కాపాడుకోవాలి.ప్రభువా...ఆ చేప అంత పెద్దదని తెలియలేదే ముందు..!

అది ఎంత గొప్పదైనా గానీ...నేను దాన్ని అంతమొందించుతాను.అది అన్యాయం కాదూ ..అనిపించింది.మనిషి ఏదైనా ఓర్చుకొని ఏదైనా చేయగలడు ..అది నిరూపించే తరుణం వచ్చింది.ఆ కుర్రాడికి చెప్పాను గదా..నేను ఒక వింత ముసలాణ్ణి అని. దాన్ని నిరూపించుకునే తరుణం ఇదే అనిపించింది.

కొన్ని వేల సార్లు శక్తిసామర్ధ్యాలు చాటుకున్నాడు.కాని దేనికి అదే వేరు వేరు గదా.అక్కడ ..ఆ చేప..ఇక్కడ..నేను..నిద్రపోతుంటాము..అప్పుడు కల లో సిమ్హాలు వస్తుంటాయి.అనట్లు ఆ సిమ్హాలే ఎందుకు రావాలి కలలో..ఏయ్ ముసలి వాడా..నీ ఆలోచనలు కట్టిపెట్టు.తనకి తనే సర్ది చెప్పుకున్నాడు.ముందు విశ్రాంతి తీసుకో కొద్దిగా.దాని పని లో అది ఉంది.నెమ్మది గా ఉండనీ.

మధ్యానం..పడవ మెల్లగా కదులుతున్నది.భుజం మీద ఉన్న తాడు ని సర్దుకున్నాడు.చేప పైననే ఈదుతోంది.దాని ఘనమైన మొప్పలు..తోక..అదీ బాగున్నది.అంత లోతు లో చేప ఎలా చూస్తుందో....దాని కళ్ళు కూడా పెద్ద గానే ఉన్నాయి..ఇంచుమించు గుర్రం కి ఉన్న కళ్ళు లా ఉన్నాయి.రాత్రిళ్ళు తనకి కూడా ఒక్కోసారి బాగా కనబడతాయి కళ్ళు.ఒక పిల్లి మాదిరిగా.

ఎడమ చేతి వేళ్ళు చలనం ఇపుడు బాగానే ఉంది.వాటికి కొద్దిగా బరువుని అలవాటు చేయాలనిపించి ..తాడు ని అటు ఇటు మార్చుకోవడం చేస్తున్నాడు.ఇంకా నువు అలసిపోకపోతే ఓ చేపా...నువు వింత ప్రాణివే.గట్టి గానే అరిచాడు ముసలాయన.అతను ఇంకొద్ది గా అలిసిపోయాడు.ఇతర విషయాలు ఆలోచించాలి అనిపించింది.ఇపుడు Yankees of Newyork జట్టు వాళ్ళు Tigers of Detroit వాళ్ళతో తలపడుతూ ఉండవచ్చు.

ఇది రెండవ రోజు.ఈ చేప ఎటూ తేల్చడం లేదు.అయితే తాను ఆత్మ విశ్వాసం కోల్పోకూడదు.నేను ఎవరి అభిమానిని..ఘనత వహించిన DiMaggio యొక్క అభిమానిని.ఎటువంటి ఆటగాడు అతను..ఒకసారి కాలికి ఎంతో పెద్ద గాయం అయినప్పటికీ ..ఆటని ముందుకు తీసుకుపోయాడు.అలాంటిది తనకి జరగకపోవచ్చును.కాని కోడిపందేలు జరుగుతున్నప్పుడు చూడు..ఒక పుంజు కి కన్ను పోవచ్చును..ఒక దానికి కాలు పోవచ్చును..ఎలా ఉంటుంది అది.ఏది అయినా బాధ బాధ యే గదా.పక్షులు గాని,మృగాలు గాని ..అవి జీవిస్తున్నంత ప్రమాదభరిత జీవితాన్ని మనిషి జీవిస్తున్నాడా..నిజం చెప్పాలంటే లేదనే చెప్పాలి..అయితే ఈ రాత్రి ...సముద్రం లో ఆ చేప తో..తను ఓ మృగం వలెనే పోరాడవలసిందే.. అనుకున్నాడు. (సశేషం) Murthy Kvvs

No comments:

Post a Comment