ఈ చేప తో నేను ఎంతసేపటి నుంచి వేగుతున్నాను.నా ఈ స్థానం లో ఆ గొప్ప ఆటగాడు DiMaggio గనక ఉంటే ఎలా ఉంటుంది...అయితే ఒకటి..తను నాకంటే వయసు లో చిన్న ఇంకా బలశాలి.అది ఒప్పుకోవలసిందే.అతని తండ్రి కూడా ఒక జాలరి యే.బేస్ బాల్ ఆట లో అతనికి ఓ సారి ఎముక జాలు సంభవించింది గదా...ఆ నొప్పి ..నా చెయ్యి కి కలిగినంత నొప్పి అంత ఉంటుందా...?దాని సంగతి అయితే నాకు తెలియదు.నాకు ఎప్పుడూ అలా జరగలేదు గనక.
సూర్యుడు అస్తమించడానికి తయారు గా ఉన్నాడు.ఏమైనా తాను గుండె నిబ్బరం కోల్పోరాదు.అన్నట్లు ఓసారి కాసాబ్లాంకా అనే ఊరి లో ఓ మద్య శాల లో ఒక నీగ్రో తో తాను బలపరీక్ష కి నిలువ వలసి వచ్చింది.తను సియొన్ ఫ్యుగోస్ నుంచి వచ్చిన వాడు.మంచి బలశాలి.టేబుల్ మీద ఇద్దరూ చేతులు ఆంచి ఒక రి చెయ్యి ని ఇంకొకరు కిందకి వంచే పోటీ అది.అది అంత తొందరగా పూర్తవ్వలేదు.రమారమి ఒకటిన్నర రోజు పట్టింది.తుది ఫలితం తేలడానికి.కిరోసిన్ దీప కాంతి లో కూడా అది సాగింది.ప్రతి నాలుగు గంటలకి రెఫెరి మారడం ఒకటి.ఆ నీగ్రో వ్యక్తి కి తనకి గోళ్ళ దగ్గర రక్తం వచ్చినా ఎవరూ తగ్గలా.జనాలు బెట్లు కట్టడం ఒకటి.ఇది ఎంతకి తెగేలా లేదు.మేము పనికి పోవలా లేదా అని చూసే కార్మికులు అనుకోవడం..మొత్తానికి ఆ పోటి లో విజేత గా తనే నిలిచాడు.
తను అప్పుడు ఇప్పటి ముసలి వ్యక్తి కాదుగా...శాంటియాగో ద చాంపియన్..!ఆ దగ్గరనించి అందరూ తనని చాంపియన్ అని పిలిచేవారు.మళ్ళీ వసంత కాలం లో జరిగిన పోటీ లో సైతం తనే గెలిచాడు.ఆ తర్వాత మరి కొన్నిట్లో గెలిచిన పిమ్మట వాటిని మానేశాడు.తాను నిజంగా తల్చుకుంటే ఎవరినైనా ఓడించగలననే నమ్మకం అతనికి అలా ఏర్పడింది.అయితే ఒకటి..ఎడమ చెయ్యి ఉందే..అది అప్పుడు కూడా తనకి చేయిచ్చేది.నమ్మడానికి లేదు.
సరే..మొత్తానికి ఈ రాత్రి ఏమి వింత జరగనున్నదో...చేతి వేళ్ళు బిగుసుకు పోవడం అనేది మాత్రం జరగకూడదు.అంతలోనే మియామి వేపు వెళ్ళేదనుకుంటా...విమానం కొద్దిగా కిందనుంచే శబ్దం చేస్కుంటూ వెళ్ళింది..తన తల మీద నుంచి.దాని నీడ ఆ ఎగిరే చేపల మీద సైతం పడింది.వీపు కి ఉన్న ఆ గేలపు తాడు ని అలాగే వెనక్కి పెట్టుకొని అల్లంత దూరం చూడాలని ప్రయత్నించాడు.పడవ కింద ఆ పెద్ద చేప కదిలిన చప్పుడు అయింది.పడవ కూడా మెల్లిగా ముందుకు కదులుతున్నది.
మళ్ళీ చూడటం కుదరదేమో అన్నంత ఇదిగా ..ఆ విమానాన్ని అలాగే కనుమరుగయ్యేదాకా చూస్తూన్నాడు ముసలాయన.నిజంగా విమానం కూడా వింత అయినదే.దానిలోనుంచి చూస్తే సముద్రం ఎలా అగుపిస్తుందో..ఇంకా కొద్దిగా కింది నుంచి వెళితే ..ఆ ఎగిరే చేపలు ఇంకా మిగతావి కూడా నీళ్ళలో కనబడతాయి.ఓసారి తను ఎత్తైన బోటు లో వచ్చినపుడు..డాల్ఫిన్ ..దాని వొంటి మీద చారలు మచ్చలు తో పచ్చగా కనిపించింది.అవి గుంపులు గా ఈదుతూ ఉంటాయి.
ఇక చీకటి పడింది అనగా ,అప్పటికే తాను వేసిన మరో గేలానికి డాల్ఫిన్ వచ్చి చిక్కింది.ఆ సర్గూసా చెత్త సముద్రం మీద తేలుతూ ఒక ద్వీపం మాదిరి గా ఉంది.సరిగ్గా పడవ దాని దగ్గరకి రాగానే ఈ డాల్ఫిన్ చిక్కింది.ముందు అది గాలి లో ఎగరడం చూశాడు.మిణుకుమనే కాంతి లో తళుక్కుమని తోచింది.కాసేపు తీవ్రంగా పెనుగులాడింది.మళ్ళీ మళ్ళీ కొట్టుకోసాగింది.ముసలాయన దానికి దగ్గరకి వంగి గేలపు తాడుకి మరింత చిక్కేలా డాల్ఫిన్ వొంటి మీద కొట్టాడు.కింద ఉన్నదే ఆ పెద్ద చేప గేలపు తాడు ..దాన్ని జాగ్రత్తగా అటు ఇటూ మార్చుకున్నాడు.. ఉన్నట్లుండి..ఓ పక్కగా ఒరిగినట్లు అయింది తాడు..! " దీనికి ఎంతకీ బుద్ది రాదు...సరే..ఈ రాత్రికి చికాకు చెయ్యకుండా మంచి గా ఉండు..నేను కూడా మంచి గా ఉంటా..." అన్నాడు గట్టిగా.
డాల్ఫిన్ ని ఇపుడు కాదు గాని రేపు పొద్దుట పూట చీల్చి తింటా.సత్తువ వస్తుంది కాబట్టి ఇంకా ముందుకైనా సాగిపోవచ్చు.ఇక ఈ చేప ఉందే..దాన్ని ఇపుడేం అనకూడదు..అదలాగే లోపల ఉండనీ.సూర్యాస్తమయ సమయం లో చేపలు చికాకు గా ఉంటాయి. మనకీ మంచిది కాదు.అప్పుడు బోనిటో చేప ముక్కల్ని తిన్నాడు గదా..అయితే ఈ డాల్ఫిన్ మాంసాన్ని తినడం అంత ఈజీ కాదు.ఇది కొంత గట్టి గా ఉంటుంది.సరే..ఏది మాత్రం ఈజీలే..!
" చేపా..ఇపుడు..నీకు ఎలా ఉంది..?నాకయితే పొద్దుటికి తిండి దొరికింది.నా ఎడమ చెయ్యి సైతం బాగయింది.నీకు అనిపిస్తే ..పడవని తోసేయ్.." ముసలాయాన బిగ్గరగా నే అడిగాడు.
వీపు మీద అటూ ఇటూ మార్చుకుంటున్న ఆ గేలపు తాడు తన బలాన్ని పరీక్ష చేస్తున్నట్లు ఉంది.నమ్మేదానికి లేదు.నొప్పి కూడా అనిపిస్తోంది.దీనికంటే చికాకు యవ్వారాలే చూశాను..ఇప్పుడు నా కాళ్ళు బాగానే ఉన్నాయి..ఎడమ చెయ్యి కూడా ఫరవాలేదు.చేపది అయితే పై చెయ్యి కాదు.అలా సర్ది చెప్పుకున్నాడు.
సెప్టెంబర్ నెల ..తొందరగా చీకటి పడింది.పడవ మీదే ఆనుకొని ఆకాశం వైపు చూడసాగాడు.నక్షత్రాలు కొన్ని బయటకి వచ్చాయి.కాసేపటిలో మిగతావి అన్నీ వచ్చేస్తాయి.అవి తనకి దూరపు మిత్రులు వంటివి.ఆ చేప కూడా అంతే.ఆ..ఇలాంటి చేప గురుంచి విన్నదీ కన్నదీ లేదు.దీని ని సమ్హరించవలసిందే.సంతోషం..ఏ ఆకాశం లోని చుక్కలనో తెంపుకు వచ్చే పనిని భగవంతుడు మనిషికి పెట్టలేదు.ఒకసారి ఊహించు..ప్రతి రోజూ మనిషి ఓ చంద్రుడినో...సూర్యుడి నో వేటాడాలి అని విధి నిర్ణయించినట్లయితే ..ఆ పని ఎంత నరక యాతన గా ఉంటుంది.అదృష్టం..అలాంటి కష్టం మనిషికి ఇవ్వబడలేదు.అలా పరి పరి విధాలా అనుకొంటూన్నాడు ముసలాయన..! (సశేసం) Murthy Kvvs
No comments:
Post a Comment