Sunday, December 3, 2017

మొదటి రాత్రి పురుషుని యొక్క శక్తి కి గీటురాయి గా మన సమాజం లో ముద్రపడి పోయింది

ఇవాళ న్యూస్ పేపర్ లో వార్త చదివిన తర్వాత ఇది రాయాలనిపించింది.చిత్తూరు జిల్లా లోని గంగాధర నెల్లూరు మండలం,మోతరంగన పల్లి గ్రామం.అక్కడ ఓ పెళ్ళి జరిగింది.ఇరువురు చదువుకున్నవారే. నవ వధువు పైశాచికం గా దాడి చేయబడింది.అదీ  ఆ నవ వరుని చేత.ఇది చూడటానికి చిన్న విష్యం లా ఉండవచ్చును.ఒక కుటుంబం కి సంబందించిన వ్యవహారం లా ఉండవచ్చును.పేపర్లు యధావిధి గా ఎమోషనల్ గా హెడ్ లైన్స్ పెట్టి మిగతాది అక్కడున్న వాళ్ళని కనుక్కొని వాళ్ళ వెర్షన్ వాళ్ళు  రాస్తారు.

పైకి ఇది మామూలు గా కనిపించినా..ఇది యావత్తు మన వ్యవస్థ లోని లోపాల్ని వెల్లడిస్తుంది. దీనికి కారణము మగ పిల్లలకి గాని ,ఆడ పిల్లలకి గాని తమ శరీరం లో కలిగే మార్పులు ..ముఖ్యం గా యవ్వన దశ లో వారి లో ఉండే సాధక బాధకాలు ఒకరికి ఒకరు తెలుసుకోక పోవడము.ఇంకా సరైన జ్ఞానం లేకపోవడం.సరే..మన సమాజము..చేసే స్వీపింగ్ కామెంట్లు ఇంకా కుంగ దీస్తాయి.ఆ వరుడు చేసిన పనిని నేను ఎంత మాత్రం సమర్దించడం లేదిక్కడ.కాని తరతరాల మానసిక జాడ్యాలు ఉన్నాయి దాని వెనుక.

మొదటి రాత్రి పురుషుని యొక్క శక్తి కి గీటురాయి గా మన సమాజం లో ముద్రపడి పోయింది.పెళ్ళి కి ముందు శారీరక అలసట వల్ల గాని ఇంకా మానసిక మైన కారణాల వల్ల గాని అనుభవ రాహిత్యం వల్ల గాని ..ఇలా అనేక కారణాల వల్ల ఒక ఆరోగ్యవంతుడైన పురుషుడు కూడా మొదటి రాత్రి లో విఫలం కావచ్చును.ఆ సంగతిని వెంటనే ఆ నవ వధువు బయటకి అచ్చి బంధువులకి చెప్పడం తో అతని ఈగో హర్ట్ అయ్యి అతను ఆ విధంగా ప్రవర్తించి ఉంటాడు.ఎందుకంటే తెల్లారితే పాయింట్ ఫైవ్ గా వెక్కిరించడానికి చుట్టుపక్కలా అంతా సిద్ధంగా ఉంటారు. దీనికి కారణం లోతుకి వెళ్ళి ఆలోచిస్తే ఎంతో ఉన్నది.పెళ్ళికి ముందు డేటింగ్ గాని,చనువు గా ఉండటాన్ని గాని మన సమాజం లో దుర్లక్షణం గా భావిస్తారు.దానివల్ల ఇరు వురి లో ఉండే ఇంటిమేట్ విషయాలు అసలు ఏ మాత్రం అవగాహన ఉండవు,పెళ్ళికి ముందు దాకా..ఒకప్పుడు పెద్దవాళ్ళ కౌన్సిలింగ్ ఉండేది..కొంత ఓపిక పడితే విషయాలు సర్దుకు పోయేవి..! నిజంగా అతను పెళ్ళికి అనర్హుడే అయితే డాక్టర్ ని సంప్రదించి  ...ఆ తర్వాత కాకపోతే విడాకులు తీసుకోవచ్చును కొంపలు మునిగేది ఏముంది..గాని మన సమాజ పోకడ ఎలా ఉందంటే..పూర్తిగా..ఎమోషనల్ గా ఫీలయి అటో ఇటో తీర్పు ఇచ్చేసి మనుషులు చచ్చేలా చేస్తుంటాము.జీవితం వీటన్నిటిని మించినది అనే తెలివిడిని పెళ్ళి కావాల్సిన  పిల్లలలో పాదుకొల్పాలి.  

1 comment:

  1. జీవితం వీటన్నిటిని మించినది అనే తెలివిడిని పెళ్ళి కావాల్సిన పిల్లలలో పాదుకొల్పాలి.

    ReplyDelete