Monday, December 4, 2017

దీని లో పాత్రలు వెంటాడుతాయి



శరదిందు బందోపాధ్యాయ్ బెంగాలీ లో రాసిన కొన్ని పరిశోధనాత్మక కధల్ని నిన్ననే ముగించాను.రూపా వాళ్ళు వేశారు.మోణిమాల ధర్ అనే  షిల్లాంగ్ లో పనిచేసే అధ్యాపకురాలు ఇంగ్లీష్ లోకి అనువదించారు.ఇది కొన్న రోజున ఎలాంటి అంచనాలు లేవు,ఓ డిటెక్టివ్ చేసే పనుల గురించి రాసి ఉండవచ్చునని ఒక ఊహ మాత్రం ఉండింది.కాని చదివిన పిమ్మట కొన్ని దీని లో పాత్రలు వెంటాడుతాయి.బ్యోం కేష్ ఇంకా అతని సహాయకుడు అజిత్ ..వీరు ఇరువురి యొక్క సమస్యల్ని పరిష్కరించే తీరు కధల వెంబడి అలా నడిపించుకుపోతుంది.

ఈ శరదిందు బందోపాధ్యాయ్ 1889 -1970 కాలం లో జీవించాడు.వృత్తిరీత్య వకీలు అయినప్పటికి క్రమేపి దానికి దూరమై రాయడమే పనిగా పెట్టుకొని జీవించాడు.హిందీ సినిమాలకి కొన్నిటికి స్క్రిప్ట్ రాశాడు.అనేక నవలలు,కధలు వ్యాసాలు రాసినప్పటికి అతను సృష్టించిన సత్యాన్వేషి (డిటెక్టివ్ లా ) బ్యోం కేష్ పాత్ర బెంగాల్ లో ప్రతి ఇంటికి తెలిసిన పాత్ర గా మారింది.ఈ కధలు దూరదర్శన్ లో కూడా వచ్చాయి.మొత్తం ఏడు కధలు ఉన్నాయి.ఆపకుండా చదివించాయి.

అనువాదకురాలు సరళమైన భాష లో రాశారు.అయితే ప్రతి వాక్యాన్ని ,దాని అర్ధాన్ని పఠిత కి చక్క గా అందించగలిగారు.కధ యొక్క పేర్లను కృతకమైన అనువాదం లో కాకుండా దగ్గరగా ఉండే మాటల్లో కి తెచ్చారు.అయితే అది సారాంశాన్ని బలపరిచేది గానే ఉన్నది.ఉదాహరణకి రక్తముఖి నీల అనే టైటిల్ ని ద డెడ్లీ డైమండ్ గా మార్చారు.నిజం గా అది డెడ్లీ నే..అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు జైలు కి పోవడమే లెక్క.సస్పెన్స్ తో పాటుగా సందర్భానుసారం గా కొన్ని సాంస్కృతిక విషయాలూ తెలుస్తుంటాయి.  

No comments:

Post a Comment